
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేష్ కత్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మరోసారి అక్షరాల తుటాలు పేల్చారు. ఆంగ్ల సంవత్సరాది జరుపుకోకూడదని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఏకీపడేశారు.
‘‘న్యూ ఇయర్ జరుపుకోకూడదని ఆర్డర్ జారీ చేస్తారు. తాను మాత్రం వేదపండితుల ఆశీర్వచనాలతో సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఎలా నమ్మేది ఈ నాయకుడిని? అంటూ ఫేస్‌బుక్‌లో కాసేపటి క్రితం మహేష్ కత్తి ఫోటోతో కూడిన ఓ సందేశం ఉంచారు.
పవన్‌కు బాధ్యత నేర్పే ప్రయత్నం చేస్తున్నా...
ఇక నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా మరోసారి ఆయన పోస్టు చేశారు. పవన్ లాంటి రాజకీయ జోకర్‌ను బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నిస్తున్నా అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్నే ఆయన ఫేస్‌బుక్‌లో ఉంచారు. పవన్ కళ్యాణ్ పిచ్చి సేన బూతుల్ని ఖండించే ధైర్యం లేని వాళ్ళు, నాకు నీతులు చెప్పడంలో మట్టుకు ముందు ఉంటారని. తన వైఖరి చిరాకుని కలిగిస్తే బ్లాక్ చెస్తే సరిపోతుందని అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అనే ఒక బాధ్యతారహిత వ్యక్తి, నటుడు, సోకాల్డ్ నాయకుడు... తనపై వస్తున్న బెదిరింపులపై ఇంతవరకు ఒక ఖండన కూడా చేయలేదని.. అలాంటి మనిషికి బాధ్యత నేర్పే ప్రయత్నం తాను చేస్తున్నానని మహేష్ చెప్పారు. తనతో ఉన్నవాళ్లు ఉంటారని. పోయేవాళ్ళు దయచేసి వెళ్లిపొవాలని మహేష్ సూచించారు. ‘‘నా ఫేస్ బుక్ వాల్ నుంచి. నా జీవితం నుంచీ. సింపుల్. ఇదే నా కొత్త సంవత్సరపు నిర్ణయం. నా ఆత్మగౌరవాన్ని మించింది ఏదీ లేదు. నా ప్రాణంతో సహా!’’ అంటూ ఆయన సందేశం ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment