
చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ (పాత చిత్రం)
సాక్షి, చెన్నై : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ సీనియర్ నేత నారాయణ మండిపడ్డారు. ఇద్దరూ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసేందుకు యత్నిస్తున్నారని ఆయన చెబుతున్నారు. మంగళవారం చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు జుట్టు కేంద్రం చేతిలో ఉంది. బీజేపీకి మద్ధతు ఇచ్చినంత కాలం ఆయన బయటే ఉంటారు. ఒకవేళ వ్యతిరేకిస్తే అవినీతి వ్యవహారాల్లో చంద్రబాబు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఆ ధైర్యం చేయట్లేదు’ అని నారాయణ తెలిపారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
‘రాజకీయాలపై స్పష్టమైన అవగాహన లేకపోవటం.. ప్రస్తుత పరిణామాలు అర్థం కాక పవన్ తీవ్ర గందరగోళంలో ఉన్నాడు’ అని ఆయన చెప్పారు. ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో కేసీఆర్‌ల భజన చేస్తూ పవన్ పబ్బం గడుపుకుంటున్నాడని నారాయణ ధ్వజమెత్తారు.
సీపీఐ నేత నారాయణ (పాత చిత్రం)