కత్తి ‘కవర్‌ డ్రైవ్‌’ పని చేయట్లేదు! | Mahesh Kathi now brawl with Ravi Teja Fans | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 4 2018 9:35 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Mahesh Kathi Ravi Teja Fans War - Sakshi

మహేష్‌ కత్తి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సినిమా : సినీ విశ్లేషకుడు మహేష్‌ కత్తి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. టచ్‌ చేసి చూడు చిత్రానికి రివ్యూ ఇచ్చి రవితేజ ఫ్యాన్స్‌ నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. 

సినిమా చూసిన కాసేపటికే కత్తి మహేష్‌ తన వర్షెన్‌ రివ్యూను ఇచ్చేస్తూ.. సినిమాను టచ్‌ చేయకపోతేనే బెటర్‌ అని వ్యాఖ్యానించాడు. అంతే మాస్‌ రాజా ఫ్యాన్స్‌ కి ఇది చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ‘నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు ఉంది. కానీ, వేస్ట్‌ అని డిసైడ్‌ చేయటడానికి నువ్వెవరూ?’ అంటూ కత్తిపై విరుచుకుపడుతున్నారు. దీంతో కత్తి మరో ట్వీట్‌ చేశారు. 

‘సినిమా నచ్చితే చూడమని రెకమండ్ చేసినట్టే. నచ్చకపోతే, చూడకపోతే బెటర్ అని కూడా చెప్తామ్! అందులో తప్పేముంది’ అని తెలిపారు. అయినా తన రివ్యూలో సినిమాను చూడటం.. చూడకపోవటం... అనే ఛాయిస్‌ను ప్రేక్షకుడికే వదిలేస్తానంటూ ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఏది ఏమైనా స్టార్‌ హీరోల విషయంలో కత్తి మహేష్‌ ముందు ట్వీట్లు చేయటం.. అవి వివాదాస్పదం అవుతుండటంతో... కేవలం తన అభిప్రాయమేనంటూ తేల్చేయటం ఫ్యాన్స్‌కు ఏ మాత్రం రుచించటం లేదు. మొన్న పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ వ్యవహారం మాదిరే.. ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్ని చర్చలకు దారితీస్తుందోనని సగటు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement