touch chesi chudu
-
`నేల టిక్కెట్టు' టీజర్ రీలీజ్
-
‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే..!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో రూపొందించిన ఈ సినిమాతో మాళవిక శర్మ హీరోయిన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. టచ్ చేసి చూడు సినిమాతో నిరాశపరిచిన రవితేజ నేలటిక్కెట్టుతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. -
మే 24న ‘నేల టిక్కెట్టు’
టచ్ చేసి చూడు సినిమా తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇటీవల విడుదల చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చివరిదశలో షూటింగ్ పనులతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలకు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను మే 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతమందిస్తున్నారు. -
‘రవితేజకు ఏం కాలేదు’
లాంగ్ గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకున్న రవితేజ యమా స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎనర్జిటిక్ స్టార్ ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నేల టికెట్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రవితేజకు సంబంధించిన వార్త ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో రవితేజ గాయపడ్డారని, తీవ్రమైన గాయాలు కాకపోయినా ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘అసలేం జరగలేదు.. అవన్నీ పుకార్లు.. ఎవరు ఆందోళన చెందొద్దు.. ఆయన (రవితేజ) ఎప్పటి లాగే పర్ఫెక్ట్గా ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు. Nothing happened.. all false news .. don’t worry.. he is damn perfect as always ..😊👍🏻 https://t.co/qwlqsxjuRq — Kalyankrishnkurasala (@kalyankrishna_k) 27 February 2018 -
‘నేల టికెట్’కు 25 కోట్లు
రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మాస్‌మహారాజ్ రవితేజ తరువాత టచ్‌చేసి చూడు సినిమాతో మరోసారి తడబడ్డాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ నేల టికెట్ సినిమాలో నటిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వరుస విజయాల తరువాత కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా దాదాపుగా పూర్తయినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఓ ప్రముఖ టీవీ ఛానల్ 25 కోట్లకు సొంతం చేసుకుంది. గత చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. మాస్ లో రవితేజకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంతటి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. -
కత్తి ‘కవర్ డ్రైవ్’ పని చేయట్లేదు!
సాక్షి, సినిమా : సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. టచ్ చేసి చూడు చిత్రానికి రివ్యూ ఇచ్చి రవితేజ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. సినిమా చూసిన కాసేపటికే కత్తి మహేష్ తన వర్షెన్ రివ్యూను ఇచ్చేస్తూ.. సినిమాను టచ్ చేయకపోతేనే బెటర్ అని వ్యాఖ్యానించాడు. అంతే మాస్ రాజా ఫ్యాన్స్ కి ఇది చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ‘నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు ఉంది. కానీ, వేస్ట్ అని డిసైడ్ చేయటడానికి నువ్వెవరూ?’ అంటూ కత్తిపై విరుచుకుపడుతున్నారు. దీంతో కత్తి మరో ట్వీట్ చేశారు. ‘సినిమా నచ్చితే చూడమని రెకమండ్ చేసినట్టే. నచ్చకపోతే, చూడకపోతే బెటర్ అని కూడా చెప్తామ్! అందులో తప్పేముంది’ అని తెలిపారు. అయినా తన రివ్యూలో సినిమాను చూడటం.. చూడకపోవటం... అనే ఛాయిస్‌ను ప్రేక్షకుడికే వదిలేస్తానంటూ ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఏది ఏమైనా స్టార్ హీరోల విషయంలో కత్తి మహేష్ ముందు ట్వీట్లు చేయటం.. అవి వివాదాస్పదం అవుతుండటంతో... కేవలం తన అభిప్రాయమేనంటూ తేల్చేయటం ఫ్యాన్స్‌కు ఏ మాత్రం రుచించటం లేదు. మొన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యవహారం మాదిరే.. ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్ని చర్చలకు దారితీస్తుందోనని సగటు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. -
దడ దడగా ఉంది : వెన్నెల కిశోర్
వెండితెర మీద తన కామెడీ టైమింగ్ తో అలరించే వెన్నెల కిశోర్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన షూటింగ్ అప్ డేట్స్‌తో పాటు ఫన్ని ట్వీట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటాడు. తాజాగా తనకు దడ పుట్టించిన ఓ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు ఈ కామెడీ స్టార్. వెన్నెల కిశోర్ ట్విటర్ అకౌంట్ ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫాలో అవుతున్నట్టుగా వచ్చిన నోటిఫికేషన్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. ఈ ఫొటోతో పాటు దడ పెరుగుతోంది అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్‌గా ఉన్న కిశోర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన టచ్ చేసి చూడు, ఛలో సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. సౌత్ లీడింగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఇదే తరహా నోటిఫికేషన్ వచ్చింది. అమితాబ్ తన ట్విటర్ అకౌంట్ ఫాలో అవుతున్నట్టుగా రకుల్ కు నోటిఫికేషన్ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన రకుల్ ‘అమితాబ్ బచ్చన్ మీ అకౌంట్ ను ఫాలో అవుతున్నారు అన్న నోటిఫికేషన్ చూసినప్పటి నా ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. థ్యాంక్యూ సర్’ అంటూ ట్వీట్ చేసింది రకుల్. 😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳palpitations in progress😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳 pic.twitter.com/nGIiqrsRGv — vennela kishore (@vennelakishore) 2 February 2018 Can't express my feelings when an alert stating @SrBachchan follows u back popped up. Thanku sir 😀😀🙏Such a wow feeling . #fanforever — Rakul Preet (@Rakulpreet) 2 February 2018 -
‘టచ్ చేసి చూడు’ మూవీ రివ్యూ
టైటిల్ : టచ్ చేసి చూడు జానర్ : మాస్ యాక్షన్ తారాగణం : రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్, మురళీ శర్మ, జయప్రకాష్, ఫ్రెడ్డీ దారువాలా సంగీతం : జామ్ 8 నేపథ్య సంగీతం : మణిశర్మ దర్శకత్వం : విక్రమ్ సిరికొండ నిర్మాత : వల్లభనేని వంశీమోహన్, నల్లమలుపు బుజ్జి రాజా ది గ్రేట్ సినిమాతో ఘనవిజయం సాధించిన రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ ఎంటర్టైనర్ టచ్ చేసి చూడు. రవితేజ మార్క్ మాస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ మరోసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథతో విక్రమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన టచ్ చేసి చూడు, రవితేజ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసిందా..? తొలి విక్రమ్ సిరికొండ ఆకట్టుకున్నాడా..? కథ : కార్తీకేయ(రవితేజ) ఆవేశపరుడైన పోలీస్ ఆఫీసర్. అసిస్టెంట్ కమిషనర్‌గా డ్యూటీ చేస్తున్న సమయంలో ఓ కేసులో ఆవేశంగా ఓ నిందితుడి మరణానికి కారణమై సస్పెండ్ అవుతాడు. తరువాత పాండిచ్చేరిలో కార్తీకేయ ఇండస్ట్రీస్ అనే కంపెనీ నిర్వహిస్తూ హ్యాపిగా ఉంటాడు. తల్లి, తండ్రి, బామ్మ, ఇద్దరు చెల్లెల్లు ఇదే కార్తీకేయ ప్రపంచం. (సాక్షి రివ్యూస్) తన వ్యాపారానికి అక్కడి లోకల్ లీడర్ సెల్వం అడ్డు వస్తున్నా.. గొడవలెందుకులే అని తానే సర్దుకుపోతుంటాడు. ఒక రోజు పార్టీలో కార్తీకేయ చెల్లెలు విద్యార్థి నాయకుడు సత్యను కొంత మంది వ్యక్తులు హత్య చేయటం చూస్తుంది. అమ్మానాన్నలు వద్దంటున్నా చెల్లెలితో సాక్ష్యం చెప్పించేందుకు సిద్ధమవుతాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కార్తీకేయ చెల్లెలు చెప్పిన ఇర్ఫాన్ లాలా(ఫ్రెడ్డీ దారువాలా) నాలుగేళ్ల క్రితం కార్తికేయ చంపిన వ్యక్తే అని తెలుస్తుంది. బతికున్న వ్యక్తిని చనిపోయినట్టుగా కార్తికేయను ఎందుకు నమ్మించారు..? కార్తికేయకు ఇర్ఫాన్‌కు గొడవేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : రవితేజకు తనకు అలావాటైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో రవితేజ చేసిన తరహా రొటిన్ సీన్స్ లో కనిపించటంతో కొత్తదనమేమీ కనిపించదు. హీరోయిన్స్ కేవలం కథను సాగదీసేందుకే తప్ప ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ లో కనిపించారు. (సాక్షి రివ్యూస్)ఉన్నంతలో రాశీఖన్నా కాస్త పరవాలేదనిపించింది. సీరత్‌కపూర్ గ్లామర్ షోతో మెప్పించినా.. నటిగా ఆకట్టుకోలేకపోయింది. తండ్రి పాత్రలో జయప్రకాష్, పోలీస్ ఆఫీసర్‌గా మురళీ శర్మ, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్‌లు ఇప్పటికే చాలా సినిమాల్లో కనిపించిన అదే తరహా పాత్రల్లో కనిపించారు. విలన్‌గా నటించిన ఫ్రెడ్డీ దారువాలా లుక్స్‌పరంగా ఆకట్టుకున్నా.. పెద్దగా తెరపైన కనిపించలేదు. బలమైన సన్నివేశాలు కూడా లేకపోవటంతో విలనిజం పెద్దగా ఎలివేట్ కాలేదు. విశ్లేషణ : రవితేజ లాంటి మాస్ హీరోతో రొటీన్ సినిమా అయితే కరెక్ట్ అన్న నమ్మకంతో విక్రమ్ సిరికొండ మూస కథను ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది. వక్కంతం వంశీ లాంటి స్టార్ రైటర్ అందించిన కథ అయిన ఎక్కడ కొత్త దనం కనిపించలేదు. ఎమోషనల్ యాక్షన్స్ సీన్స్ ను మరింత బలంగా రాసుకునే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా రొమాంటిక్ కామెడీ సీన్స్ మీద దృష్టి పెట్టాడు. తొలి భాగం అంతా అసలు కథలోకి వెల్లకుండా కేవలం రవితేజ, రాశీఖన్నా మధ్య సన్నివేశాలతో సాగదీశాడు. (సాక్షి రివ్యూస్)అవి కూడా ఆకట్టుకునే స్థాయిలో లేకపోవటం నిరాశపరుస్తుంది. ద్వితియార్థం కాస్త ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టినా..అదే ఊపు కొనసాగించలేకపోయాడు. ప్రతినాయక పాత్రను బలంగా రూపుదిద్దటంలోను దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. జామ్ 8 గ్రూప్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు.తన నేపథ్య సంగీతంతో మణిశర్మ సినిమాను కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిటోగ్రఫి,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రవితేజ ఎనర్జీ మణిశర్మ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ కథా కథనం పాటలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘మహారాజ్.. మీరు ఎప్పుడు అంటే అప్పుడే’
ఈ శుక్రవారం టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ మహారాజ్ రవితేజ, గురువారం అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రవితేజ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో తన ఇన్సిపిరేషన్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అని తెలిపిన రవితేజ, భవిష్యత్తుల్లో దర్శకుడిగా మారే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించాడు. నిర్మాతగా మారే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు నేను నటుడిని మాత్రమే అంటూ సమాధానం ఇచ్చారు. రాజా ది గ్రేట్ సినిమాకు సీక్వల్ ఉంటుందా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ ప్రశ్నను దిల్ రాజు, అనిల్ రావిపూడిలనే అడగాలని తెలిపారు. అయితే వెంటనే స్పందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, మహారాజ్.. మీరు ఎప్పుడు అంటే అప్పుడే రెడీ అంటూ రాజా 2 గ్రేట్ అనే టైటిల్ ను కూడా హింట్ ఇచ్చాడు. తనకు నచ్చిన సంగీత దర్శకుడు ఇళయరాజా అని చెప్పిన రవితేజ, మీ జీవితానికి థీమ్ సాంగ్ గా ఏ పాట బాగుటుంది అన్న ప్రశ్నకు మాత్రం చార్లీ చాప్లిన్ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని సమాధానమిచ్చారు. రాజా ది గ్రేట్ తో వెండితెరకు పరిచయం అయిన రవితేజ వారసుడు మహాధన్ నెక్ట్స్ సినిమాపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ఇప్పడే చెప్పలేం.. ప్రస్తుతానికి తనని ఒంటరిగా వదిలేయ’మని సమాధానమిచ్చాడు. కథ నచ్చితే స్టార్ హీరోల సినిమాలో విలన్ పాత్రకు కూడా రెడీ అన్న రవితేజ.. రాజమౌళి, పూరి జగన్నాథ్ లతో త్వరలోనే సినిమా ఉంటుందని తెలిపాడు. అ! సినిమాలో చెట్టుకు వాయిస్ అందించటంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాని మంచి స్నేహితుడు కావటంతో పాటు ఆ పాత్రకు నా వాయిస్ అవసరం కాబట్టే చెప్పానన్నారు. -
రవితేజ సినిమాలో కాజల్ కూడా..!
ఈ శుక్రవారం ‘టచ్ చేసి చూడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ, వరుస సినిమాలతో బిజీగా అవుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేల టికట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ మాస్ హీరో తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో తన తదుపరి చిత్రం తెరకెక్కనుందని ప్రకటించారు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోని అనే క్లాసిక్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నివేథ థామస్‌ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా విశేషాలు తర్వలో దర్శకుడు శ్రీనువైట్ల వెల్లడించనున్నారు. -
ఆయనతో ఇంకో సినిమా చేయాలనుంది!
‘‘ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ కథ ‘టచ్ చేసి చూడు’. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తుంది. ఈ సినిమా డబ్బింగ్ పూర్తి కాగానే రవితేజగారు నాకు ఫోన్ చేసి, చాలా బాగా చేశావని అభినందించారు. అదే నాకు బిగ్ కాంప్లిమెంట్’’ అని హీరోయిన్ రాశీఖన్నా అన్నారు. రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ‘టచ్ చేసి చూడు’ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీఖన్నా పంచుకున్న విశేషాలు.. ► ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నా పేరు పుష్ప. సాధారణంగా హీరోలకు వినోదం పండించే అవకాశం ఉంటుంది. కానీ హీరోయిన్లకు కామెడీ చేయడానికి స్కోప్ ఉండదు. అయితే.. ఈ సినిమాలో నాకు ఆ అవకాశం దొరికింది. రవితేజగారికి, నాకు మధ్య ఉన్న మంచి కామెడీ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ► నా కోసం, సినిమాల కోసం బరువు తగ్గాను. నటనకూ, గ్లామర్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయడం చాలా బాగుంది. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే బోర్‌గా ఉంటుంది. అందుకే విభిన్నమైన పాత్రలు చేయాలి. ► రవితేజగారు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. సెట్స్‌లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఆయనతో పని చేయడం చాలా బాగుంటుంది. రవితేజగారితో ఇంకో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. ► ‘టచ్ చేసి చూడు, తొలిప్రేమ’ సినిమాల్లో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నా. కానీ టైమ్ దొరకలేదు. డబ్బింగ్ చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీలు కుదరలేదు. ► సీనియర్ హీరోలతో పనిచేస్తున్నప్పుడు వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. యంగ్ హీరోల నుంచి కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. నాకు టాలీవుడ్లో బాగుంది. మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. చాలా హ్యాపీ. అటువంటప్పుడు బాలీవుడ్ ప్రయత్నాలు ఎందుకు? అందుకే చేయడం లేదు. -
ఆ సక్సెస్‌ని తెలుసుకోలేకపోయా
‘‘నా తొలి చిత్రం ‘రన్ రాజా రన్’ మంచి హిట్. అంత మంచి సక్సెస్ఫుల్ సినిమా చేశానని నేను రియలైజ్ కాలేకపోయా. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు కూడా అంతే. అవి నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడతాయని చూడలేదు. ‘ఒక్క క్షణం’ సినిమాలాగా ‘టచ్ చేసి చూడు’ నా కెరీర్‌కి హెల్ప్ అవుతుందనుకుంటున్నా’’ అని సీరత్ కపూర్ అన్నారు. రవితేజ హీరోగా, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సీరత్ కపూర్ చెప్పిన విశేషాలు. ► ‘టచ్ చేసి చూడు’లో నా పాత్ర రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ఉంటుంది. హీరోని డామినేట్ చేస్తుంటా. సినిమా మొత్తం ఉండను. ఇంటర్వెల్ తర్వాత వస్తా. నాకు, రాశీఖన్నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. నేనింకా పూర్తి సినిమా చూడలేదు. అందుకే కథాంశం ఏంటని క్లారిటీగా చెప్పలేను. రవితేజగారు పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ► రవితేజగారు వంటి పెద్ద హీరోతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఆయన చాలా సింపుల్. సెట్స్‌లో సరదాగా ఉంటారు. ఇండస్ట్రీలో ఇన్నేళ్లు అలా ఉండటం మామూలు విషయంకాదు. ఎప్పుడూ ఎనర్జీగా, లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ► ‘రన్ రాజా రన్’ సక్సెస్ తర్వాత నా సినిమాలు కొన్ని సరిగ్గా ఆడలేదు. అందుకు పెద్దగా బాధపడను. ‘రాజుగారి గది–2’ నుంచి మంచి సినిమాలు చేస్తున్నాను. ‘టచ్ చేసి చూడు’లో నేను సెకండ్ హీరోయిన్ని కాదు. ఓ ముఖ్యమైన పాత్ర చేశా. అయినా.. ఫస్ట్ హీరోయిన్.. సెకండ్ హీరోయిన్ అని ఆలోచించను. పాత్రలోని ప్రాముఖ్యత చూసి, నచ్చితే చేస్తా. ► సురేశ్ ప్రొడక్షన్లో రానాతో ఓ సినిమా, ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. వీటితో పాటు మరో సినిమా ఒప్పుకున్నా. త్వరలో పూర్తి వివరాలు చెబుతా. -
రౌడీల దుమ్ముదులుపుతున్న రవితేజ..
సాక్షి, హైదరాబాద్ : చాలా గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన ప్రముఖ టాలీవుడ్ నటుడు రవితేజ. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వస్తుండగా గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఓ కుటుంబాన్ని ప్రేమించే కొడుకుగా కనిపించడంతోపాటు తన జోలికి వచ్చినవారిని రఫ్పాడించే లుక్‌లో రవితేజ అదరగొట్టారు. ముఖ్యంగా 'యూనిఫాంలో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు.. యూనిఫాం తీసేస్తే దానమ్మ దానమ్మ రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు' అంటూ ఆయన పోలీసుగా రౌడీలకు ఇచ్చే వార్నింగ్, ఎమోషన్ చూస్తుంటే ఇటు కుటుంబ ప్రేక్షకులతోపాటు మాస్ చిత్రాలను అమితంగా ప్రేమించే వారికి కూడా మంచి విందు భోజనంగా ఈ సినిమాను తీసుకొచ్చారనిపిస్తుంది. దాంతోపాటు రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలిసిందే. విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వక్కంతం వంశీ కథను అందించారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
‘టచ్ చేసి చూడు’ థియేట్రికల్ ట్రైలర్
-
‘టచ్ చేసి చూడు’ న్యూ వర్కింగ్ స్టిల్స్
-
'టచ్ చేసి చూడు' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
-
రైటర్ అయినా నా డైరెక్షన్ అటువైపే
‘‘బై చాన్స్ రైటర్ అయ్యాను. నిజానికి దర్శకత్వమే ఆసక్తి. వీవీ వినాయక్‌గారు తీసిన ‘ఠాగూర్’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. డైరెక్టర్‌గా నా ఫస్ట్ సినిమా ‘టచ్ చేసి చూడు’ పట్ల ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను’’ అన్నారు విక్రమ్ సిరికొండ. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. వచ్చే నెల మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో విక్రమ్ సిరికొండ చెప్పిన విశేషాలు... ∙నిజం చెప్పే అబద్ధం సినిమా అని ఒక మహానుభావుడు అన్నారు. నా సినిమా చెప్పే నిజం బ్యాలెన్సింగ్ లైఫ్. ఒక డెడికేటెడ్ డ్యూటీ మైండెడ్ పోలీసాíఫీసర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ను బ్యాలెన్స్ చేయడం కోసం చేసే యుద్ధమే ఈ ‘టచ్ చేసి చూడు’. యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా ఉంది. రవితేజది డ్యూయెల్ రోల్ కాదు. డిఫరెంట్ టైమ్ అండ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. పోలీసాఫీసర్‌గా రవితేజ చేసిన గత సినిమాలతో పోల్చినప్పుడు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్‌గా కూడా ఉంటుంది. మోడ్రన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ నేరస్తులను ఎలా గుర్తించాడు? అనే సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ∙ఈ సినిమా కథ వక్కంతం వంశీది. నిర్మాత బుజ్జిగారు చెబితే, కథ విన్నాను. నచ్చింది. హీరో రవితేజ అని తెలిసింది. ఆల్రెడీ రవితేజతో ‘మిరపకాయ్’ సినిమా చేశా. వంశీ కథను నాకు అనుకూలంగా చేంజ్ చేసుకున్నాను. వంశీ కూడా హెల్ప్ చేశాడు. ఇందులో హీరోయిన్స్ రాశీఖన్నా, సీరత్ కపూర్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ప్రీతమ్ అండ్ జామ్ 8 మంచి సంగీతం ఇచ్చాడు. రీ–రికార్డింగ్ మణిశర్మగారు చేస్తున్నారు. ∙మాది హైదరాబాద్. బెంగళూరులో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఫిల్మ్ కోర్స్ ఢిల్లీలో చేశాను. ∙ఠాగూర్, సాంబ, బన్నీ చిత్రాలకు డైరెక్షన్ విభాగంలో వర్క్ చేశాను. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో రైటర్‌గా మారా. -
‘టచ్ చేసి చూడు’ మూవీ స్టిల్స్
-
కమింగ్ సూన్
టచ్ చేస్తాం. అతి త్వరలో మాంచి మాస్ బొమ్మతో థియేటర్స్‌ను టచ్ చేస్తాం అంటున్నారు ‘టచ్ చేసి చూడు’ చిత్రబృందం. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని సమాచారం. ‘‘చిరకాల మిత్రుడైన రవితేజతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వక్కంతం వంశీ అందించిన కథను విక్రమ్ బాగా తెరకెక్కించారు. త్వరలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రీసెంట్గా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రీతమ్ అండ్ జామ్ 8 సంగీతం అందించారు. -
’టచ్ చేసి చూడు’ టీజర్ విడుదల
-
ఫిబ్రవరి 2న ‘టచ్ చేసి చూడు’
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో సినిమా వాయిదా పడింది. తరువాత రవితేజ పుట్టిన రోజు కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తారని భావించినా.. హడావిడి అవుతుందన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రాజా ది గ్రేట్ తో సత్తా చాటిన రవితేజ టచ్ చేసి చూడుతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. -
ఫస్ట్ లుక్ : టచ్ చేసి చూస్తే మడతడిపోద్ది
సాక్షి, సినిమా : రాజా ది గ్రేట్ చిత్రంతో మాస్ మహరాజ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న రవితేజ.. కొత్త ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం విడుదలైంది. యాక్షన్ బ్యాక్ గ్రౌండ్లో క్లీన్ షేవ్‌తో ఉన్న రవితేజ స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్ ను చిత్ర యూనిట్ వదిలింది. విక్రమ్ సిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్‌కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కా యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న 'టచ్ చేసి చూడు' కి ప్రీతమ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వచ్చే నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. Here it is!! #TouchChesiChudu first look... pic.twitter.com/8PLWlkJzMU — Ravi Teja (@RaviTeja_offl) December 29, 2017 -
హాయ్ దుబాయ్
సాంగ్స్ షూట్ చేయడానికి దుబాయ్‌కి హాయ్ చెప్పింది ‘టచ్ చేసి చూడు’ చిత్రబృందం. మరి.. దుబాయ్‌కి బై బై ఎప్పుడు చెప్తారంటే వారం రోజుల తర్వాత. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. ఇందులో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. దుబాయ్‌లో ఏం జరుగుతోంది? ఎన్ని రోజులు షూటింగ్లో పాల్గొంటారు? అని రాశీ ఖన్నాని అడిగితే – ‘‘ఈ సినిమాలో వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్ పాత్ర చేస్తున్నాను. ఓన్లీ సాంగ్స్‌లోనే కాకుండా కొన్ని సీన్స్‌లో కూడా నేను డ్యాన్స్ చేయాల్సి ఉంది. అంతే కాదు నా క్యారెక్టర్ కొంచెం కామిక్‌గా ఉంటుంది. స్క్రీన్‌పై నేనొచ్చినప్పుడు వచ్చే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం సాంగ్స్‌ను షూట్ చేయడానికి దుబాయ్ వచ్చాం. ఈ వన్ వీక్ షెడ్యూల్లో టు సాంగ్స్‌ను కంప్లీట్ చేయబోతున్నాం. ప్రీతమ్ ఎక్స్లెంట్ మ్యూజిక్ ఇచ్చారు’’ అని చెప్పారు రాశీ ఖన్నా. అంటే రవితేజ, రాశీఖన్నా దుబాయ్‌లో చిందేస్తున్నారన్నమాట. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. -
మళ్లీ గురి!
‘వార్నింగ్‌లు, వారెంట్లు, జైళ్లు, బెయిళ్లు ఉండవ్. తప్పు చేసిన క్రిమినల్స్ చిక్కితే ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వదు’ అంటూ ‘పవర్’ సినిమాలో పోలీసు పవర్ ఏంటో చూపించి, ప్రేక్షకులను మెప్పించారు రవితేజ. అంతేకాదు, ‘విక్రమార్కుడు’, ‘మిరపకాయ్’ సినిమాల్లో పోలీసాఫీసర్ పాత్రలో రవితేజ ఎంతలా రెచ్చిపోయారో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన అంతా ఎందుకంటే... విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. బహుశ ఈ సినిమాలో మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు రవితేజ. మరోవైపు సోషల్ మీడియాలో రవితేజ పోలీస్ గెటప్‌లో ఉన్న ఫొటోలు ట్రోల్ అవడంతో ఖాకీ దుస్తుల్లో ఆయన కనిపించడం ఖాయం అంటున్నారు అభిమానులు. అంటే.. రవితేజ మరోసారి గన్ పట్టి బాక్సాఫీసుపై గురి పెట్టారన్నమాట. రాశీఖన్నా, సీరత్‌కపూర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి బరిలో దింపాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
టచ్ చేస్తే... ఫైటే!
దమ్ముంటే టచ్ చేసి చూడు అని సవాల్ విసిరారు రవితేజ. ఆ సవాల్‌కి రౌడీలు భయపడలేదు. టచ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అంతే... రవితేజ రఫ్పాడించారు. ఫైనల్‌గా అతని టచ్‌కి దొరక్కుండా రౌడీలు ఎస్కేప్. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న ‘టచ్ చేసి చూడు’ కోసం యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. పైన చెప్పినట్లే జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. రాశీ ఖన్నా డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఫ్రెడ్డీ దార్వాల ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా హీరో, హీరోయిన్లపై సాంగ్ తీసిన ఈ చిత్రం యూనిట్ ఇప్పుడు రవితేజ, ఫ్రెడ్డీలపై కీలక సీన్స్‌తో పాటు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అంటే... ప్రస్తుతం టచ్ చేస్తే ఫైట్ అన్నమాట. ‘‘టచ్ చేసి చూడు షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాను’’ అని పేర్కొన్నారు ఫ్రెడ్డీ. రవితేజ స్టైల్లో సాగే పక్కా కమర్షియల్ మూవీ ఇది అని సమాచారం. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ వినికిడి. -
సంక్రాంతికి సై!
‘వస్తున్నాం బాసూ.. సంక్రాంతికి సందడి చేయడానికి వస్తున్నాం. మీ హార్ట్‌ని టచ్ చేయడానికి వస్తున్నాం’ అంటున్నారట రవితేజ అండ్ కో. ఇటీవలే ‘రాజా ది గ్రేట్’ అంటూ ఓ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ సంక్రాంతికి ‘టచ్ చేసి చూడు’తో రావడానికి రెడీ అవుతున్నారట. అన్నట్లు రవితేజ కెరీర్లో సంక్రాంతికి విడు దలై, మాంచి హిట్ సాధించిన చిత్రాల్లో ‘కృష్ణ’, ‘మిరపకాయ్’ ఉన్నాయండోయ్. ఒకవేళ ‘టచ్ చేసి చూడు’ ఈ సంక్రాంతికి విడుదలైతే దాదాపు ఏడేళ్ల తర్వాత పండగ రేస్‌లోకి రవితేజ వస్తున్నట్లు అవుతుంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లు. ‘ఫోర్స్ 2’, ‘కమాండో 2’ తదితర బాలీవుడ్ చిత్రాల్లో విలన్‌గా నటించిన ఫ్రెడ్డీ దార్వాలా విలన్. ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో నిలపాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రానికి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మాతలు. -
రాంగ్ స్టెప్!
వెస్ట్రన్ మాస్ డ్యాన్స్‌తో మ్యూజిక్ క్లాస్ చాలా జోరుగా సాగుతోంది. సడన్‌గా ఓ రాంగ్ స్టెప్ పడింది. అంతే...హీరోయిన్ రాశీ ఖన్నా చూపు అటు పడింది. రాంగ్ స్టెప్‌ను కరెక్ట్ చేశారు. ‘ఇలా చేయాలి’ అని చెప్పడం కాదు.. స్టెప్ వేసి, చూపించారు. ఇలా రాంగ్ స్టెప్స్‌ను కరెక్ట్ చేస్తూ రైట్ స్టెప్స్ నేర్పిస్తున్నారామె. రాశీ ఖన్నా ఏదైనా మ్యూజిక్ స్కూల్లో డ్యాన్స్ టీచర్‌గా చేరారేమో అనుకుంటున్నారా? చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి అంత తీరిక ఏది? మరి... రాంగ్ స్టెప్స్‌ని కరెక్ట్ చేసింది ఎక్కడ? అంటే ‘టచ్ చేసి చూడు’ సినిమా లొకేషన్లో. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ రోల్ చేస్తున్నారు. అసలు విషయం అదన్న మాట. -
సెప్టెంబర్‌లో 'టచ్ చేసి చూడు'
ఏడాదికి పైగా విరామం తీసుకున్న సీనియర్ స్టార్ రవితేజ, ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుడితో కలిసి టచ్ చేసి చూడుతో పాటు పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాల్లో నటిస్తున్నాడు. రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్న రవితేజ ముందుగా టచ్ చేసి చూడు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ క్యాలెండర్ ఫుల్ బిజీగా ఉంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్ జై లవ కుశ ను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు స్పైడర్‌ను సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా సెప్టెంబర్ నెలాఖరున రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి ఇంత కాంపిటీషన్లో రవితేజ సినిమాకు గ్యాప్ దొరుకుతుందో లేదో చూడాలి. -
మాస్ హీరోతో హాట్ బ్యూటి
లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ, రెండు సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టాడు. ఇప్పటికే అనీల్ రావిపూడి డైరెక్షన్లో రాజా ది గ్రేట్ షూటింగ్లో బిజీగా ఉన్న రవితేజ, మరో సినిమా టచ్ చేసి చూడు కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా రాశీఖన్నాను ఫిక్స్ చేయగా తాజాగా సెకండ్ హీరోయిన్ను కూడా ఫైనల్ చేశారు. రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటి సీరత్ కపూర్. తొలి సినిమాతో సక్సెస్ సాధించినా తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయింది సీరత్. దీంతో ఇన్నాళ్లు ఫోటో షూట్లతో కాలం గడిపేసిన ఈ బ్యూటి, ఇప్పడిప్పుడే బిజీ అవుతోంది. ఇప్పటికే రాజుగారి గది 2లో నాగ్ సరసన నటిస్తున్న సీరత్ కపూర్, తాజాగా రవితేజ సరసన సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. -
పాండిచ్చేరిలో ర... రా... !
ఇక్కడ ‘ర’ అంటే రవితేజ. ‘రా’ అంటే రాశీఖన్నా. ఓ పక్క సూర్యకిరణాలు, మరోపక్క చల్లటి సముద్ర గాలులు టచ్ చేస్తుంటే... దర్శకుడు విక్రమ్ సిరికొండ వివరించిన సీన్‌కి వీళ్లిద్దరూ టచ్చయ్యారు. ప్రేక్షకులు భలే జోడీ అనేలా నటించేశారట! తర్వాత షాట్ గ్యాప్‌లో సరదాగా కెమేరా కళ్లకు ఓ పోజిచ్చారు. రవితేజ, రాశీఖన్నా జంటగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 26 వరకూ ఈ షెడ్యూల్ జరగనుంది. ఆల్రెడీ రవితేజ, రాశీలు ‘బెంగాల్ టైగర్’లో జోడీగా నటించారు. అది మంచి విజయం సాధించింది. ఈ ఫొటోలు, అందులోని వీళ్ల సంతోషం చూస్తుంటే... మరో హిట్ మమ్మల్ని టచ్ చేస్తుందనే నమ్మకం కనిపిస్తోంది కదూ!! -
నో మోర్ గ్యాప్!
ప్రామిస్... అభిమానులకు, ప్రేక్షకులకూ రవితేజ ఓ ప్రామిస్ చేస్తున్నారు. అదేంటి అంటే... ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానంటున్నారు. ‘బెంగాల్ టైగర్’ విడుదలైన 420 రోజుల తర్వాత ‘టచ్ చేసి చూడు’ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. తర్వాత కొన్ని రోజులకు ‘రాజా.. ది గ్రేట్’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇన్నాళ్లు మీరు ఎక్కడికి వెళ్లారు? అని రవితేజను ప్రశ్నిస్తే... ‘‘ఎక్కడికీ వెళ్లలేదు. స్క్రిప్ట్స్ వింటుండేవాణ్ణి. దాంతోనే నా టైమంతా గడిచింది. ఇక నుంచి గ్యాప్ ఉండదు. వరుసగా సినిమాలు చేస్తా. ‘టచ్ చేసి చూడు’ చిత్రీకరణ మొదలైంది. ఏప్రిల్‌లో ‘రాజా.. ది గ్రేట్’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ గ్యాప్‌లో ఎప్పుడైనా నెగిటివ్‌గా ఫీలయ్యా రా? అని రవితేజను అడిగితే... ‘‘నా బ్లడ్ గ్రూప్ బీ పాజిటివ్. పాజిటివ్‌గా ఆలోచిస్తా. పాజిటివ్‌గా ఉంటాను’’ అన్నారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ను నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించనున్న ‘రాజా.. ది గ్రేట్’కి అనిల్ రావిపూడి దర్శకుడు. -
420 రోజుల తర్వాత స్టార్ట్ చేశాడు!
సరిగ్గా 420 రోజులు... ‘బెంగాల్ టైగర్’ విడుదలై నిన్నటికి 420 రోజులు! ఆ సినిమా విడుదల తర్వాత ఏడాదికి పైగా విరామం తీసుకున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టారు. సీన్ పేపర్ టచ్ చేశారు. తర్వాత డైలాగ్ చెప్పారు. మొత్తానికి షూటింగ్ స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండని దర్శకునిగా పరిచయం చేస్తూ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ క్లాప్ ఇవ్వగా, ఎడిటర్ గౌతంరాజు కెమేరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘శుక్రవారం చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్‌లో వారం రోజులకు పైగా షూటింగ్ చేసి, తర్వాత పాండిచ్చేరి వెళతాం. అక్కడ 25 రోజులు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టు వక్కంతం వంశీ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ కథ తయారుచేశారు’’ అన్నారు. రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, మాటలు: శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు, ఆర్ట్: రమణ వంక, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎం. సుకుమార్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: జామ్8. -
టచ్ చేస్తే...!
వచ్చేశాడు... అభిమానులకు పుట్టినరోజు కానుకతో మాస్ మహారాజా రవితేజ వచ్చేశాడు. గత సినిమా కంటే మరింత సై్టలిష్‌గా, మాసీగా కొత్త సినిమా కబురుతో వచ్చేశాడు. రవితేజ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించనున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా వివరాలను నేడు (జనవరి 26) రవితేజ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘రవితేజ ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలుపెడతాం. చిరకాల మిత్రుడు రవితేజతో సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. విక్రమ్ సిరి మాట్లాడుతూ – ‘‘డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. రవితేజ సరసన రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, మాటలు: శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రమణ, కెమేరా: ఎం. సుకుమార్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8. -
'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ
-
'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ
మాస్ మహరాజ్ రవితేజ సినిమా కోసం అభిమానులు సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో డీసెంట్ హిట్ సాధించిన రవితేజ, ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న తరుణంలో ఆగిపోవటంతో కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్‌లో వరల్డ్ టూర్ కు వెళ్లొచ్చిన మాస్ హీరో.. ఫైనల్‌గా కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఇన్నాళ్లు రూమర్స్ గానే ఉన్న వార్తలపై క్లారిటీ ఇస్తూ కొత్త సినిమా పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. టచ్ చేసి చూడు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు విక్రమ్ సిరకొండ దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో రవితేజకు శుభాకాంక్షలు తెలపటంతో పాటు ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.