
లొకేషన్‌లో సరదాగా ఓ సెల్ఫీ
ఇక్కడ ‘ర’ అంటే రవితేజ. ‘రా’ అంటే రాశీఖన్నా. ఓ పక్క సూర్యకిరణాలు, మరోపక్క చల్లటి సముద్ర గాలులు టచ్ చేస్తుంటే... దర్శకుడు విక్రమ్ సిరికొండ వివరించిన సీన్‌కి వీళ్లిద్దరూ టచ్చయ్యారు. ప్రేక్షకులు భలే జోడీ అనేలా నటించేశారట! తర్వాత షాట్ గ్యాప్‌లో సరదాగా కెమేరా కళ్లకు ఓ పోజిచ్చారు.
రవితేజ, రాశీఖన్నా జంటగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 26 వరకూ ఈ షెడ్యూల్ జరగనుంది. ఆల్రెడీ రవితేజ, రాశీలు ‘బెంగాల్ టైగర్’లో జోడీగా నటించారు. అది మంచి విజయం సాధించింది. ఈ ఫొటోలు, అందులోని వీళ్ల సంతోషం చూస్తుంటే... మరో హిట్ మమ్మల్ని టచ్ చేస్తుందనే నమ్మకం కనిపిస్తోంది కదూ!!