సాక్షి, సినిమా : రాజా ది గ్రేట్ చిత్రంతో మాస్ మహరాజ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న రవితేజ.. కొత్త ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం విడుదలైంది. యాక్షన్ బ్యాక్ గ్రౌండ్‌లో క్లీన్ షేవ్‌తో ఉన్న రవితేజ స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్ ను చిత్ర యూనిట్ వదిలింది.
విక్రమ్ సిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్‌కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పక్కా యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న 'టచ్ చేసి చూడు' కి ప్రీతమ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వచ్చే నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Here it is!! #TouchChesiChudu first look... pic.twitter.com/8PLWlkJzMU
— Ravi Teja (@RaviTeja_offl) December 29, 2017
Comments
Please login to add a commentAdd a comment