దడ దడగా ఉంది : వెన్నెల కిశోర్‌ | Vennela Kishore intresting tweet | Sakshi
Sakshi News home page

Feb 2 2018 4:03 PM | Updated on Feb 2 2018 7:08 PM

Vennela Kishore - Sakshi

వెన్నెల కిశోర్‌

వెండితెర మీద తన కామెడీ టైమింగ్‌ తో అలరించే వెన్నెల కిశోర్ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన షూటింగ్ అప్‌ డేట్స్‌తో పాటు ఫన్ని ట్వీట్స్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు. తాజాగా తనకు దడ పుట్టించిన ఓ విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు ఈ కామెడీ స్టార్‌. వెన్నెల కిశోర్‌ ట్విటర్‌ అకౌంట్‌ ను బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఫాలో అవుతున్నట్టుగా వచ్చిన నోటిఫికేషన్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశాడు. ఈ ఫొటోతో పాటు దడ పెరుగుతోంది అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్‌గా ఉన్న కిశోర్‌ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన టచ్‌ చేసి చూడు, ఛలో సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు.

సౌత్‌ లీడింగ్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు కూడా ఇదే తరహా నోటిఫికేషన్‌ వచ్చింది. అమితాబ్‌ తన ట్విటర్ అకౌంట్‌ ఫాలో అవుతున్నట్టుగా రకుల్‌ కు నోటిఫికేషన్‌ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన రకుల్‌ ‘అమితాబ్‌ బచ్చన్‌ మీ అకౌంట్‌ ను ఫాలో అవుతున్నారు అన్న నోటిఫికేషన్ చూసినప్పటి నా ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. థ్యాంక్యూ సర్‌’ అంటూ ట్వీట్‌ చేసింది రకుల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement