సంక్రాంతికి సై! | raviteja new movie release to sankranthi pongal | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి సై!

Published Wed, Nov 1 2017 12:08 AM | Last Updated on Wed, Nov 1 2017 12:08 AM

 raviteja new movie release to  sankranthi pongal

‘వస్తున్నాం బాసూ.. సంక్రాంతికి సందడి చేయడానికి వస్తున్నాం. మీ హార్ట్‌ని టచ్‌ చేయడానికి వస్తున్నాం’ అంటున్నారట రవితేజ అండ్‌ కో. ఇటీవలే ‘రాజా ది గ్రేట్‌’ అంటూ ఓ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ సంక్రాంతికి ‘టచ్‌ చేసి చూడు’తో రావడానికి రెడీ అవుతున్నారట. అన్నట్లు రవితేజ కెరీర్‌లో సంక్రాంతికి విడు దలై, మాంచి హిట్‌ సాధించిన చిత్రాల్లో ‘కృష్ణ’, ‘మిరపకాయ్‌’ ఉన్నాయండోయ్‌. ఒకవేళ ‘టచ్‌ చేసి చూడు’ ఈ సంక్రాంతికి విడుదలైతే దాదాపు ఏడేళ్ల తర్వాత పండగ రేస్‌లోకి రవితేజ వస్తున్నట్లు అవుతుంది.

విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ హీరోయిన్లు. ‘ఫోర్స్‌ 2’, ‘కమాండో 2’ తదితర బాలీవుడ్‌ చిత్రాల్లో విలన్‌గా నటించిన ఫ్రెడ్డీ దార్‌వాలా విలన్‌. ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్‌ కల్లా కంప్లీట్‌ చేసి సంక్రాంతి బరిలో నిలపాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రానికి నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement