‘మహారాజ్.. మీరు ఎప్పుడు అంటే అప్పుడే’ | Raviteja Energetic Answers To Fans | Sakshi
Sakshi News home page

‘మహారాజ్.. మీరు ఎప్పుడు అంటే అప్పుడు రెడీ’

Published Thu, Feb 1 2018 4:59 PM | Last Updated on Thu, Feb 1 2018 7:16 PM

Raviteja - Sakshi

రవితేజ

ఈ శుక్రవారం టచ్‌ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్‌ మహారాజ్‌ రవితేజ, గురువారం అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రవితేజ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో తన ఇన్సిపిరేషన్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్ అని తెలిపిన రవితేజ, భవిష్యత్తుల్లో దర్శకుడిగా మారే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించాడు.

నిర్మాతగా మారే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు నేను నటుడిని మాత్రమే అంటూ సమాధానం ఇచ్చారు. రాజా ది గ్రేట్ సినిమాకు సీక‍్వల్ ఉంటుందా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ ప్రశ్నను దిల్ రాజు, అనిల్‌ రావిపూడిలనే అడగాలని తెలిపారు. అయితే వెంటనే స‍్పందించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి, మహారాజ్.. మీరు ఎప్పుడు అంటే అప్పుడే రెడీ అంటూ రాజా 2 గ్రేట్ అనే టైటిల్‌ ను కూడా హింట్‌ ఇచ్చాడు.

తనకు నచ్చిన సంగీత దర్శకుడు ఇళయరాజా అని చెప్పిన రవితేజ, మీ జీవితానికి థీమ్ సాంగ్‌ గా ఏ పాట బాగుటుంది అన్న ప్రశ్నకు మాత్రం చార్లీ చాప్లిన్ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అని సమాధానమిచ్చారు. రాజా ది గ్రేట్‌ తో వెండితెరకు పరిచయం అయిన రవితేజ వారసుడు మహాధన్ నెక్ట్స్ సినిమాపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ఇప్పడే చెప్పలేం.. ప్రస్తుతానికి తనని ఒంటరిగా వదిలేయ’మని సమాధానమిచ్చాడు. 

కథ నచ్చితే స్టార్‌ హీరోల సినిమాలో విలన్ పాత్రకు కూడా రెడీ అన్న రవితేజ.. రాజమౌళి, పూరి జగన్నాథ్‌ లతో త్వరలోనే సినిమా ఉంటుందని తెలిపాడు. అ! సినిమాలో చెట్టుకు వాయిస్ అందించటంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాని మంచి స్నేహితుడు కావటంతో పాటు ఆ పాత్రకు నా వాయిస్ అవసరం కాబట్టే చెప్పానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement