
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోగా సత్తా చాటుతున్న రవితేజకు మహాధన్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌లో మహాధన్ కనిపించాడు. ఇక అప్పటి నుంచి హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై ఇదివరకే స్పందించిన రవితేజ అతని చదువు పూర్తవగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని మహాధన్‌తో తీయడానికి రవితేజను సంప్రదించగా ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment