‘రవితేజకు ఏం కాలేదు’ | Director Kalyan Krishna about Raviteja injury | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 27 2018 3:19 PM | Last Updated on Tue, Feb 27 2018 7:34 PM

Director Kalyan Krishna about Raviteja injury - Sakshi

రవితేజ

లాంగ్ గ్యాప్‌ తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకున్న రవితేజ యమా స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నేల టికెట్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజకు సంబంధించిన వార్త ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్‌ చేస్తోంది.

షూటింగ్‌ లో జరిగిన ప్రమాదంలో రవితేజ గాయపడ్డారని, తీవ్రమైన గాయాలు కాకపోయినా ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ‘అసలేం జరగలేదు.. అవన్నీ పుకార్లు.. ఎవరు ఆందోళన చెందొద్దు.. ఆయన (రవితేజ) ఎప్పటి లాగే పర్ఫెక్ట్‌గా ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement