షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘నేల టిక్కెట్టు’ | Ravi Teja Nela Ticket Shooting Completed | Sakshi
Sakshi News home page

Published Tue, May 8 2018 10:39 AM | Last Updated on Tue, May 8 2018 10:39 AM

Ravi Teja Nela Ticket Shooting Completed - Sakshi

రీ ఎంట్రీలో మాస్‌ మహారాజ్‌ రవితేజ ఫుల్‌ ఫాంలో ఉన్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత రాజా ది గ్రేట్‌ సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన రవితేజ సూపర్‌ హిట్ అందుకున్నారు. తరువాత టచ్‌ చూసి చూడుతో కాస్త తడబడినా వెంటనే తన మార్క్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ నేల టిక్కెట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్‌ పూర్తి అయినందుకు చాలా ఆనందంగా ఉంది, అదే సమయంలో యూనిట్‌ మొత్తాన్ని చాలా మిస్‌ అవుతున్నా అంటూ ట్వీట్‌ చేశారు కల్యాణ్‌ కృష్ణ. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్నారు. మే 10న జరగనున్న ఈ సినిమా ఆడియో వేడుకకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement