Nela Ticket Review, in Telugu | నేల టిక్కెట్టు తెలుగు మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Fri, May 25 2018 12:51 PM | Last Updated on Fri, May 25 2018 4:48 PM

Nela Ticket Telugu Movie Review - Sakshi

టైటిల్ : నేల టిక్కెట్టు
జానర్ : రివేంజ్‌ డ్రామా
తారాగణం : రవితేజ, మాళవికా శర్మ‌, జగపతి బాబు, సంపత్‌, సుబ్బరాజు
సంగీతం : శక్తికాంత్‌ కార్తీక్‌
దర్శకత్వం : కల్యాణ్‌ కృష్ణ కురసాల
నిర్మాత : రామ్‌ తళ‍్లూరి

మాస్‌ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న రవితేజ కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టుగా అలరించలేకపోతున్నాడు. ఇటీవల రాజా ది గ్రేట్‌ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించినా తరువాత టచ్‌ చేసి చూడు సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా మాస్‌ టైటిల్‌ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. మరి నేల టిక్కెట్టుతో రవితేజ తిరిగి ఫాంలోకి వచ్చాడా..? దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ హ్యాట్రిక్‌ హిట్ సాధించాడా..?

కథ ;
ఆదిత్య భూపతి (జగపతి బాబు).. తండ్రి ఆనంద భూపతి (శరత్‌ బాబు) వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల పేరుతో తండ్రి ఆస్తిని దానం చేసేస్తున్నాడని ఆనంద భూపతిని చంపించేస్తాడు. (సాక్షి రివ్యూస్‌) ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్‌ గౌతమి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. అధికారం అడ్డుపెట్టుకోని ఉద్యోగాలు అమ్ముకోవటం, కబ్జాలు, దందాలు చేస్తూ వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తాడు.

ఈ కథలో హీరో అనాథ(రవితేజ). అమ్మానాన్న తో పాటు కనీసం పేరు కూడా లేని హీరోని చేరదీసిన వ్యక్తి థియేటర్‌లో నేల టిక్కెట్టులో పడుకోబెడతాడు. అప్పటి నుంచి అదే హీరో ఇల్లు, పేరు అవుతుంది. నేల టిక్కెట్టు పేరుతోనే పెరిగి పెద్దవాడైన హీరో. తనను అన్నా.. తమ్ముడు అని పిలిచిన ప్రతీ వారికి కాదనకుండా సాయం చేస్తుంటాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పే హీరో ఓ కేసు కారణంగా ఫ్రెండ్స్‌తో సహా వైజాగ్‌ వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది.

అలా హైదరాబాద్‌ చేరిన హీరో అనుకోకుండా మినిస్టర్‌ ఆదిత్య భూపతి మనుషులతో గొడవ పడతాడు. ఆదిత్య భూపతికి, హీరోకి మధ్య గొడవ ఏంటి..? అసలు హీరో వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ ఎందుకు వచ్చాడు..? ఆదిత్య భూపతి అవినీతిని, దుర్మార్గాలను ఎలా బయటపెట్టాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
సినిమాకు ప్రధాన బలం హీరో రవితేజ. తనదైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్‌, రొమాన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే రవితేజ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే బలమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన మాళవికా శర్మ లుక్స్‌ పరంగా ఆకట్టుకున్న నటిగా మెప్పించలేకపోయింది. విలన్‌గా జగపతి బాబు మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించారు.(సాక్షి రివ్యూస్‌) ఆలీ, ప్రవీణ్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్ రెడ్డి, పృథ‍్వి, ప్రియదర్శి ఇలా తెరనిండా నటీనటులు ఉన్నా ఎవరికీ బలమైన సన్నివేశాలు మాత్రం పడలేదు.

విశ్లేషణ ;
సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించిన కల్యాణ్‌ కృష్ణ, మూడో ప్రయత్నంగా మాస్‌ హీరోతో ఓ కమర్షియల్‌ కథను ఎంచుకున్నాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో పాటు సందేశాత్మక కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆ కథను ప్రేక్షకులను మెప్పించేలా తెర మీద చూపించటంలో తడబడ్డాడు. ఫస్ట్‌హాఫ్ అంతా అసలు కథను మొదలు పెట్టకుండా సరదా సన్నివేశాలతో లాగేయటం, ఆ సన్నివేశాల్లో రవితేజ మార్క్‌ కామెడీని పండించలేకపోవటంతో ఆడియన్స్‌ను ఇబ‍్బంది పెడుతుంది. సెకండ్‌ హాఫ్‌లో అసలు కథ మొదలైనా కథనంలో వేగం లేకపోవటం నిరాశపరుస్తుంది.(సాక్షి రివ్యూస్‌) ఫిదా సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌, నేల టిక్కెట్టుతో మెప్పించలేక పోయాడు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
రవితేజ
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
కథా కథనం
సంగీతం
సినిమా నిడివి

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement