Nela Ticket
-
సెకండ్ చాన్స్!
రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ మాళవిక శర్మ. తొలి సినిమా డిజాస్టర్ కావటంతో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్న మాళవికకు ఇన్ని రోజుల తరువాత సెకండ్ చాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటించనున్నారు. తొలి సినిమా ఫ్లాప్ కావటంతో ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నారు మాళవిక. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. -
‘నేల టిక్కెట్టు’ బ్యూటీతో వన్స్‌మోర్
సీనియర్ హీరో రవితేజ కెరీర్ పెద్దగా ఆశాజనకంగా లేదు. వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు నిరాశపరచటంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు మాస్ మహరాజ్. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న రవితేజ, తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో ఆకట్టుకున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక శర్మను హీరోయిన్గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ భామ రవితేజ సరసన నటించిన నేల టిక్కెట్టు నిరాశపరిచినా మరోసారి మాళవికకు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. -
మానవతా విలువలను గుర్తుచేశా !
సందడి చేసిన మాళవిక : నేలటిక్కెట్ సినిమా విజయోత్సవాల్లో భాగంగా ఆ చిత్ర బృందం గురువారం నగరంలో సందడి చేసింది. చిత్ర దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, హీరోయిన్ మాళవిక శర్మ తదితరులు సాగరతీరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరోయిన్ మాళవిక శర్మ డ్యాన్సులతో అభిమానులను ఉర్రూతలూగించారు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నేటి తరం బిజీ లైఫ్‌లో పడి మరిచిపోతున్న మానవతా విలువలను గుర్తుచేసేందుకే ‘నేలటిక్కెట్టు’ సినిమా తీశానని చిత్ర డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ అన్నారు. రవితేజ నటించిన ఈ సినిమాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో సాగరతీరంలో వీరు మామ వీటీం ఆధ్వర్యంలో చిత్ర విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరూ మానవత ధృక్పదంతో నడుచుకోవాలని చిత్రంలో చూపించామన్నారు. ఎంత డబ్బు ఉన్నా పది మంది మనుషులు మనచుట్టూ ఉంటేనే గొప్ప అనేది చెప్పామన్నారు. ‘నేలటిక్కెట్టు’ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను వైజాగ్‌కు చెందిన వాడినని అందుకే సిటీ అంటే ఇష్టమన్నారు. తాను చిన్నప్పుడు చూసిన ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేయడానికి ఇష్టపడతానని, అందుకే ప్రతీ సినిమా విశాఖలో షూటింగ్ చేస్తున్నానని తెలిపారు. హీరోయిన్ మాళవికశర్మ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. మొదటి చిత్రం కావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను తొలిసారిగా విశాఖ వచ్చానన్నారు. విశాఖ ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉందన్నారు. నేలటిక్కెట్టు సినిమాను ప్రతీ ఒక్కరూ చూడదగ్గ చిత్రమన్నారు. చిత్రంలో మత్స్యకారుడి పాత్ర పోషించిన డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగంలో జాతీయ అవార్డులు పొందినప్పుడు రాని ఆనందం సినిమాల్లో నటించినప్పుడు వచ్చిన గుర్తింపుతో పొందుతున్నానన్నారు. కళ్యాణ్ కృష్ణ నాలోని నటుడిని గుర్తించి రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో అవకాశం ఇచ్చారన్నారు. అప్పటి నుంచి చాలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది సినిమాలను చూడకుండా రివ్యూలను రాసి ప్రేక్షకులను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. వాటికితోడు కొన్ని రాజకీయలు తోడై ‘నేలటిక్కెట్టు’ చిత్రాన్ని ఆడకుండా చేయాలని అనుకున్నారని, అయితే ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారన్నారు. వేడుకల్లో భాగంగా హీరోయిన్ మాళవిక చేసిన డ్యాన్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపించింది. ఈ సందర్భంగా పదో తరగతిలో ప్రతిభ చూపిన 25 మంది విద్యార్థులకు రూ. 2 వేల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వీరు మామ వ్యవహరించారు. -
‘నేల టిక్కెట్టు’ మూవీ రివ్యూ
టైటిల్ : నేల టిక్కెట్టు జానర్ : రివేంజ్ డ్రామా తారాగణం : రవితేజ, మాళవికా శర్మ, జగపతి బాబు, సంపత్, సుబ్బరాజు సంగీతం : శక్తికాంత్ కార్తీక్ దర్శకత్వం : కల్యాణ్ కృష్ణ కురసాల నిర్మాత : రామ్ తళ్లూరి మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రవితేజ కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టుగా అలరించలేకపోతున్నాడు. ఇటీవల రాజా ది గ్రేట్ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించినా తరువాత టచ్ చేసి చూడు సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా మాస్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి నేల టిక్కెట్టుతో రవితేజ తిరిగి ఫాంలోకి వచ్చాడా..? దర్శకుడు కల్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ హిట్ సాధించాడా..? కథ ; ఆదిత్య భూపతి (జగపతి బాబు).. తండ్రి ఆనంద భూపతి (శరత్ బాబు) వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల పేరుతో తండ్రి ఆస్తిని దానం చేసేస్తున్నాడని ఆనంద భూపతిని చంపించేస్తాడు. (సాక్షి రివ్యూస్) ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ గౌతమి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. అధికారం అడ్డుపెట్టుకోని ఉద్యోగాలు అమ్ముకోవటం, కబ్జాలు, దందాలు చేస్తూ వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తాడు. ఈ కథలో హీరో అనాథ(రవితేజ). అమ్మానాన్న తో పాటు కనీసం పేరు కూడా లేని హీరోని చేరదీసిన వ్యక్తి థియేటర్లో నేల టిక్కెట్టులో పడుకోబెడతాడు. అప్పటి నుంచి అదే హీరో ఇల్లు, పేరు అవుతుంది. నేల టిక్కెట్టు పేరుతోనే పెరిగి పెద్దవాడైన హీరో. తనను అన్నా.. తమ్ముడు అని పిలిచిన ప్రతీ వారికి కాదనకుండా సాయం చేస్తుంటాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పే హీరో ఓ కేసు కారణంగా ఫ్రెండ్స్‌తో సహా వైజాగ్ వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అలా హైదరాబాద్ చేరిన హీరో అనుకోకుండా మినిస్టర్ ఆదిత్య భూపతి మనుషులతో గొడవ పడతాడు. ఆదిత్య భూపతికి, హీరోకి మధ్య గొడవ ఏంటి..? అసలు హీరో వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చాడు..? ఆదిత్య భూపతి అవినీతిని, దుర్మార్గాలను ఎలా బయటపెట్టాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమాకు ప్రధాన బలం హీరో రవితేజ. తనదైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, రొమాన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే రవితేజ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే బలమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. హీరోయిన్గా పరిచయం అయిన మాళవికా శర్మ లుక్స్ పరంగా ఆకట్టుకున్న నటిగా మెప్పించలేకపోయింది. విలన్‌గా జగపతి బాబు మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించారు.(సాక్షి రివ్యూస్) ఆలీ, ప్రవీణ్, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్ రెడ్డి, పృథ్వి, ప్రియదర్శి ఇలా తెరనిండా నటీనటులు ఉన్నా ఎవరికీ బలమైన సన్నివేశాలు మాత్రం పడలేదు. విశ్లేషణ ; సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన కల్యాణ్ కృష్ణ, మూడో ప్రయత్నంగా మాస్ హీరోతో ఓ కమర్షియల్ కథను ఎంచుకున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో పాటు సందేశాత్మక కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆ కథను ప్రేక్షకులను మెప్పించేలా తెర మీద చూపించటంలో తడబడ్డాడు. ఫస్ట్‌హాఫ్ అంతా అసలు కథను మొదలు పెట్టకుండా సరదా సన్నివేశాలతో లాగేయటం, ఆ సన్నివేశాల్లో రవితేజ మార్క్ కామెడీని పండించలేకపోవటంతో ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలైనా కథనంలో వేగం లేకపోవటం నిరాశపరుస్తుంది.(సాక్షి రివ్యూస్) ఫిదా సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్, నేల టిక్కెట్టుతో మెప్పించలేక పోయాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : రవితేజ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథా కథనం సంగీతం సినిమా నిడివి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
తప్పులను క్షమించాలి
‘‘సినిమా సౌండ్ అర్థమయ్యే పిల్లల నుంచీ 90ఏళ్ల వాళ్ల వరకూ అందరూ ‘నేల టిక్కెట్టు’ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్రతి సినిమాకీ ఫస్ట్ సినిమాలాగే కష్టపడతాను. ఈ సినిమాపై నాకు 100 శాతం నమ్మకం ఉంది’’ అని కల్యాణ్ కృష్ణ అన్నారు. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘అనాథ అయిన హీరో ఓ కుటుంబాన్ని ఎలా సంపాదించుకుంటాడు? ప్రతి మనిషికీ ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ లోపం లేకుంటే దేవుడు అయిపోతాడు. ఆ తప్పుల్ని కూడా మనం క్షమించగలిగితేనే ఒకరికొకరు దగ్గరవుతారు. అలా.. ప్రతి మనిషిలోనూ హీరో ఒక రిలేషన్ వెతుక్కుంటాడు. చివరికి దేవుడితో కూడా. ఒక్కసారి రిలేషన్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ల కోసం ఎంత ఫైట్ చేశాడన్నదే సినిమా’’ అన్నారు. ‘‘నేను సోలోగా తీసిన మొట్టమొదటి చిత్రమిది. క్లాస్, మాస్ కాంబినేషన్లో ఉన్న ఫ్యామిలీ ఎమోష¯Œ మూవీ. రవితేజగారు లేకుంటే ఈ సినిమా ఇంత స్పీడ్‌గా పూర్తయ్యేది కాదు. కల్యాణ్ కృష్ణ కూడా బాగా కష్టపడ్డారు. వీరిద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. రవితేజగారితోనే మరో సినిమా చేస్తాం. సెప్టెంబర్ ఆఖరులో ప్రారంభం అవుతుందిæ’’ అన్నారు రామ్ తాళ్లూరి. ‘‘ఈ చిత్రంలో నాది మెడికల్ స్టూడెంట్ పాత్ర. రవితేజగారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కల్యాణ్ కృష్ణ చాలా పాజిటివ్. రామ్ తాళ్లూరి సార్ బ్యానర్లో పని చేయడం వెరీ కంఫర్టబుల్’’ అన్నారు మాళవికా శర్మ. -
లాయర్ అవ్వాలనుకున్నా
-
బాల్కనీ ప్రేక్షకులూ విజిల్స్ వేస్తారు
‘బెంగాల్ టైగర్’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకోవడానికి, ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి ప్రత్యేక కారణాలు లేవు. అప్పుడంటే కుదరలేదు. ఇప్పుడు అన్నీ కుదిరి వరుస చిత్రాలు చేస్తున్నాను. శ్రీనువైట్లతో చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా రీమేకే అయినా, కథలో దాదాపు 70% మార్పులు చేశాం. ఈ చిత్రంలో మా అబ్బాయి మహాధన్ నటించాల్సి ఉంది. కానీ, పరీక్షలు ఉండటంతో చేయలేకపోయాడు. ‘‘నేల టిక్కెట్టు’ చిత్రంలో నాది అనాథ పాత్ర. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బంధాన్ని వెతుక్కునే మనిషిలా కనిపిస్తా. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉండాలనేది సినిమాలో నా ఫిలాసఫీ. ఈ టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే తెలుస్తుంది’’ అని రవితేజ అన్నారు. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవితేజ పంచుకున్న విశేషాలు. – ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కంటే ముందే కల్యాణ్ కృష్ణ ‘నేల టిక్కెట్టు’ కథ నాకు చెప్పాడు. అయితే.. అప్పటికి నాకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో కుదరలేదు. ఈలోపు కల్యాణ్ ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుకచూద్దాం’ సినిమాలు చేశాడు. మా కాంబినేషన్లో సినిమా ఇప్పటికి కుదిరింది. – ఈ చిత్రం ట్రైలర్లో సీనియర్ సిటిజన్‌కి సంబంధించి ‘ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ అనే డైలాగ్ చాలామందికి తెగ నచ్చేసింది. కథలో ఆ పాయింట్ నన్ను బాగా టచ్ చేసింది. దీంతో పాటు మంచి ఫన్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్.. వంటి అంశాలు చాలా ఉంటాయి. పేరెంట్స్‌ని పట్టించుకోని వాళ్లు ఎందుకు బతుకుతారో కూడా నాకు అర్థం కాదు. – ‘నేల టిక్కెట్టు’ టైటిల్ మాస్ అప్పీల్ కోసం పెట్టినది కాదు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ అయ్యే టైటిల్ అది. సొంత మనుషులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నవాళ్లని తన వాళ్లలా ఫీలవడం, వారికోసం తపించడం అనేది సినిమాలో చాలా పెద్ద ఎమోషన్. ఈ పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాలోని కంటెంట్ నేల టిక్కెట్టు ఆడియన్సే కాదు.. బాల్కనీ ఆడియన్స్ కూడా విజిల్స్ వేసేలా ఉంటుంది. – ఈ చిత్రంలో కొంచెం రివెంజ్ డ్రామా కూడా ఉంటుంది. కల్యాణ్ సినిమాల్లో క్లాస్, మాస్ టచ్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. కంప్లీట్‌గా కల్యాణ్ మార్క్ ఎలివేట్ అవుతుంది. కథ మరీ కొత్తది కాకపోయినా ప్రతి క్యారెక్టర్ని డిఫెరెంట్‌గా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో జగపతిబాబుగారి పాత్ర చాలా బాగుంటుంది. – రామ్ తాళ్లూరిగారు నిజాయితీగా, పాజిటివ్‌గా ఉంటారు. పైకి ఒకలా బయట ఇంకోలా అస్సలు ఉండరు. అక్కడే మా ఇద్దరికీ సింక్ అయింది. ఆయన డబ్బు సంపాదిద్దామని ఈ సినిమా తీయలేదు. ఆల్రెడీ ఆయన వద్ద డబ్బుంది. సినిమా అంటే ప్యాషన్‌తోనే ఈ చిత్రం తీశారు. ఆయనతో ఒక సినిమా కాదు చాలా సినిమాలు చేయాలని ఉంది. ఆయన ప్రొడక్షన్లో ఇంకో సినిమా చేస్తున్నా. – శక్తికాంత్ మ్యూజిక్ నాకు చాలా నచ్చేసింది. తను కంపోజ్ చేసిన ‘ఫిదా’ సినిమా సాంగ్స్ కూడా నాకు ఇష్టం. ఈ సినిమాకూ మంచి పాటలిచ్చాడు. – అనూ ఇమ్మాన్యుయేల్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో పాటు నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా కూడా చేస్తోంది. మా సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. దానివల్ల ఆ సినిమాకు ఇబ్బంది కలుగుతుందని మా చిత్రం నుంచి తప్పుకున్నారు. -
మాస్ అండ్ క్లాస్
-
మాస్ అండ్ క్లాస్
-
ఫ్యామిలీ మొత్తం చూడాలనుకుంటాను
‘‘నేల టిక్కెట్టు’ టైటిల్ అని పెట్టినప్పటికీ సినిమా మాత్రం అన్ని సెక్షన్ ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుంది. బాల్కనీ ఆడియన్స్ లాజిక్స్ పట్టించుకుంటారు. ఈ సీన్ ఇలా కాకుండా అలా తీసుంటే బావుండు అనే విషయాన్ని ఆలోచిస్తారు. కానీ నేల టిక్కెట్టు ఆడియన్స్ మాత్రం ఇవేమీ ఆలోచించకుండా మూవీను ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక్కో సినిమాను రెండుసార్లు చూసేవాణ్ణి. బాల్కనీలో ఒకసారి, నేల టిక్కెట్టులో ఒకసారి’’ అన్నారు కల్యాణ్‌కృష్ణ కురసాల. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ కృష్ణ విలేకరులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నేల టిక్కెట్టు’. రవితేజ సినిమా అంటే ఆడియన్స్ కచ్చితంగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలోనూ 70 శాతం కామెడీ ఉంటుంది. ఆవారాగా తిరిగే కుర్రాడిగా రవితేజ క్యారెక్టర్ ఉంటుంది. అతని క్యారెక్టర్‌కు రెండు షేడ్స్ ఉంటాయి. కామెడీ యాంగిల్ ఒకటి. ఫైర్ యాంగిల్ మరోటి. చుట్టూ జనం, మధ్యలో మనం ఉండాలి అనే మనస్తత్వం ఉన్న క్యారెక్టర్ అతనిది. ► రామ్ తాళ్లూరిగారికి ప్రొడక్షన్ ఫస్ట్ టైమ్ అయినా ఎక్కడా అలా అనిపించలేదు. చాలా అనుభవం ఉన్నవారిలా హ్యాండిల్ చేశారు. రవితేజగారి స్పీడ్, ప్రొడక్షన్ వాళ్ల సహకారం వల్ల పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాను కూడా అనుకున్న టైమ్‌కు కంప్లీట్ చేయగలిగాం. ► మాళవికా శర్మ మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. శక్తికాంత్ కార్తీక్ క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా వర్కింగ్ ప్రాసెస్‌లో రవితేజ గారి దగ్గర సిన్సియారిటీ నేర్చుకున్నాను. పని పట్ల ఆయనకు ఉన్న రెస్పెక్ట్ చాలా గ్రేట్. ఇవాళ ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పనిని కచ్చితంగా ఆ రోజే కంప్లీట్ చేస్తారు. స్క్రీన్ మీద ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. . ► ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాలను ఎక్కువగా ఇష్టపడతాను. అలాంటి సినిమాలే తీయడానికి ఇష్టపడతాను. ‘రంగస్థలం’, మహానటి’ సినిమాలు ప్రయోగాలు కాదు. రియలిస్టిక్‌గా, కన్విక్షన్‌తో చెప్పిన పాయింట్స్. ► ఎక్స్పెరిమెంట్స్ కాకుండా కన్విక్షన్‌తో కథ చెప్పాలనుకుంటాను. ► సీనియర్ సిటిజన్స్‌కి చాలామంది రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ విషయాన్ని ఈ సినిమాలో ఒక సీక్వెన్స్‌గా చూపించాను. వాళ్లను రెస్పెక్ట్ చేయాలి. నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ కూడా రాసుకున్నా. ► తర్వాతి ప్రాజెక్ట్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ అనుకుంటున్నాను. స్టోరీ కంప్లీట్ అవ్వగానే నాగార్జునగారిని కలుస్తాను. జులై, ఆగస్టులో మొదలుపెడదాం అనే ఆలోచనలో ఉన్నాను’’ అని పేర్కొన్నారు. -
నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే...
‘ఫస్ట్ టైమ్ లైఫ్‌లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తో్తంది’ అంటూ ప్రారంభమయ్యే ‘నేల టిక్కెట్టు’ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి హిట్ చిత్రాల తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఎస్ఆర్టి ఎంటరై్టన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘చుట్టూ జనం.. మధ్యలో మనం.. అది కదరా లైఫ్... ఎంతమంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడూ లేడు... ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ వంటి అర్థవంతమైన డైలాగులు ఒకవైపు.. ‘నువ్వు రావటం కాదు.. నేనే వస్తున్నా. ఇదే మూడ్ మెయిన్టైన్ చెయ్... నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’... వంటి రవితేజ మార్కు మాస్ డైలాగులు మరోవైపు... మొత్తంగా ట్రైలర్‌లోని డైలాగులు సినిమాపై క్రేజ్ పెంచేస్తున్నాయి. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కించామని చిత్రబృందం పేర్కొంది. -
‘నేల టిక్కెట్టు’ మూవీ స్టిల్స్
-
మే 25న ‘నేల టిక్కెట్టు’
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. టచ్ చేసి చూడు సినిమాతో నిరాశపరిచిన రవితేజ నేల టిక్కెట్టుతో తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నాడు. సొగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో ఆకట్టుకున్న కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేల టిక్కెట్టు ఈ రోజు (గురువారం) సెన్సార్‌కు వెళుతోంది. ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రవితేజ మార్క్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. రవితేజ సరసన మాళవికా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. -
‘నేల టిక్కెట్టు’ ట్రైలర్ వచ్చేసింది
-
పవన్‌పై వర్మ తాజా ట్వీట్
పవన్ పై వర్మ ట్వీట్ల దాడి కొనసాగుతోంది. మెగా ఫ్యామిలిని, ప్రత్యేకంగా పవన్ ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేస్తున్న వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. శ్రీరెడ్డి ఉదంతం తరువాత వర్మ పవన్ అభిమానుల మధ్య వార్ మొదలైంది. ఇటీవల ఆఫీసర్ టీజర్‌కు అన్ లైక్‌లు రావటానికి పవన్ అభిమానులే కారణం అన్నట్టుగా వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేలటికెట్ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ మళ్లీ ఓ ట్వీటేశారు. రవితేజ పక్కన కూర్చున్న పవన్... రవితేజ వేసుకున్న టోర్న్ జీన్స్‌ను చూపిస్తూ ... దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. దీనిపైన వివాదాల వర్మ స్పందిస్తూ... ‘రవితేజకు, పవన్ కల్యాణ్‌కు మధ్యలో వున్న ఈ తొడ సంబంధం గురించి లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి. కానీ పీకే కి, రవి ఎడమతొడ మీద చాలా మక్కువ ఉందన్న విషయం పీకే మొహంలో వున్న ఆనందంలో కనబడుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. Agnyaathavasi @PawanKalyan lo ee angle kooda vundhani expression batti @RaviTeja_offl mohamlo cleargaa touch chesi choodu type lo thelusthondi kaani ee secret Mega family ki @JanaSenaParty ki kooda thelisundadhu ..BUT pk gillullallo Nela tickettla connectionlu kanipisthunnayi pic.twitter.com/GOL7jm7zhJ — Ram Gopal Varma (@RGVzoomin) 12 May 2018 . @Pawankalyan kaani @RaviTeja_offl thoda meedha vunna thana athyantha shraddhaloni just sagam rendu raashtraala meedha pedithe “Abbo athyantha Sashya Shyaamalame"🙏🙏🙏 pic.twitter.com/Zfykf2Qlym — Ram Gopal Varma (@RGVzoomin) 12 May 2018 .@raviteja_offl yedama thodaki, @pawankalyan kudi chethiki vunna avinaabhava sambhandham aa devudike theliyaali pic.twitter.com/PReVG6FjLB — Ram Gopal Varma (@RGVzoomin) 12 May 2018 . @RaviTeja_offl ki, @PawanKalyan ki madhyalo vunna ee thoda sambhandham gurinchina loguttu @JanaSenaParty oerumaallake theliyali ..Kaani pk ki,Ravi yedama thoda meedha chaala makkuva vundhanna vishayam pk moham lo vunna aanandham lo kanabaduthondhi pic.twitter.com/D53KgHv5yD — Ram Gopal Varma (@RGVzoomin) 12 May 2018 -
‘నేల టిక్కెట్టు’ ఆడియో రిలీజ్ వేడుక
-
‘నేల టికెట్టు’లో పవర్ స్టార్
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ, మాళవిక శర్మ జంటగా రామ్ తాళ్ళూరి నిర్మించిన సినిమా ‘నేల టిక్కెట్టు’. శక్తికాంత్ కార్తీక్ స్వరకర్త. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కల్యాణ్ బిగ్ సీడీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. పవన్‌కు ‘నేల టిక్కెట్టు’ చిత్ర బృందం నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. అంతేకాదు పవన్‌కు సంబంధించిన ఓ ఏవీ(ఆడియో- వీడియో)ని ఈ ఆడియో ఫంక్షన్లో ప్లే చేశారు. పవన్ కల్యాణ్ బాల్యం నుంచి హీరోగా, రాజకీయ నేతగా ఎదిగిన తీరును మూడు నిమిషాల నిడివి గల వీడియోలో చూపించారు. మధ్య మధ్యలో పవన్ సినిమాలకు సంబంధించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్‌తో వీడియోని తీర్చిదిద్దారు. పవన్ మొదటి సినిమా మొదలుకుని జనసేన పార్టీకి చెందిన ఫొటోలను ఈ వీడియోలో చూపించి అటు పవన్‌ను ఇటు అభిమానులను చిత్ర బృందం ఆకట్టుకుంది. ఏవీలో ఏముందంటే.. ‘అతడిది నిప్పురవ్వంత నిఖార్సయిన మంచి మనస్తత్వం. సమస్యలపై స్పందించి జనం తరఫున పోరాడే.. ఆ జన సైన్యాన్ని నడిపించే ప్రజా నాయకుడిగా.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతూ.. ఎదిగే కొద్దీ ఒదుగుతూ మన మధ్యలో ఉన్నారు. ఎన్ని సమస్యలపై పోరాడుతున్నా.. ఎన్నిసమరాల్లో తలమునకలై ఉన్నా.. సమయం లేకున్నా కేవలం స్నేహం కోసం.. స్నేహితుడికి ఇచ్చిన మాటకోసం మా ‘నేల టిక్కెట్టు’ ను ఆశీర్వదించేందుకు ఇక్కడిదాకా వచ్చారు. అందుకు వారి రుణం జన్మ జన్మల్లో కూడా తీర్చుకోలేనిది. మా ‘నేల టిక్కెట్టు’ బృందం తరఫున ఆ మంచి మనిషికి, ఆ స్నేహ శీలికి, ఆ సేవా శిఖరానికి సాదరంగా ఘనస్వాగతం పలుకుతున్నాం’ అని ఏవీలో పవన్‌పై తమకు గల అభిమానాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది. ఈ వీడియో ప్లే అవుతున్నంత సేపు పవన్ కల్యాణ్ ఎంతో ఏకాగ్రతతో తదేకంగా స్క్రీన్ వైపే చూడసాగారు. వీడియో పూర్తయిన తర్వాత ఆయన నవ్వు ఆపుకోలేకపోయారు. ‘వీడియో చాలా బాగుంది’ అని చిత్ర బృందానికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ‘రవితేజ మాస్ మహారాజాగా మీకందరికీ తెలియకముందే నాకు బాగా తెలుసు. నా కంటే ముందే ఆయన నటుడయ్యారు. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వారే ఆయనలా నవ్వగలుగుతారు. నవ్వించగలుగుతారు. రవితేజలో నాకు నచ్చే విషయం. ఆయన ఎంత మందిలో ఉన్నా, ఏ పాత్రలో అయినా నటిస్తారు. సిగ్గు, బిడియం లేకుండా ఆయనలా నటించడం చాలా కష్టం’ అని అన్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి గురించి పవన్ మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేయాలనే గొప్ప మనసు కల్గిన వ్యక్తి. ఆయన ఖమ్మంలో ఎన్ఆర్ఐ స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు తనకు పరిచయం’ అని అన్నారు. ‘నేల టికెట్టు’ ఘన విజయం సాధించాలని పవన్ ఆకాంక్షించారు. ‘‘పదేళ్ల క్రితం పవన్ కల్యాణ్‌గారితో ఫోన్లో మాట్లాడాను. ‘మీరు అంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండీ’ అని ఆయన అన్నారు. వన్నాఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అది. ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు రవితేజ. ‘‘హ్యాపీ బర్త్‌డే సత్యనారాయణ గారు (కల్యాణ్‌కృష్ణ తండ్రి). మీ కొడుకు హ్యాట్రిక్ సాధింబోతున్నాడు. శక్తికాంత్ మంచి సంగీతం ఇచ్చాడు. రామ్‌గారు ప్యాషనేట్ నిర్మాత’’ అని రవితేజ అన్నారు. ‘‘రవితేజగారు ఒప్పుకుంటే ఆయనతో మరో నాలుగు సినిమాలు చేద్దాం అనుకుంటున్నా’’ అన్నారు రామ్ తాళ్ళూరి. కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాను ఆయనకు డెడికేట్ చేయాలని ఉంది. ఇది నా ఒక్కడి సినిమా కాదు. అందుకే... ఈ సినిమాకి నేను పడ్డ కష్టాన్ని డెడికేట్ చేస్తున్నా. హరీష్ శంకర్ నాకు ఫ్రెండ్. ఒక రోజు చుట్టూ జనం మధ్యలో మనం అనే కాన్సెప్ట్ వినగానే రవితేజగారికి చెప్తావా? అని హరీష్ అన్నారు. రవిగారికి కథ చెప్పా. నాకు వేరే కమిట్మెంట్ ఉంది. వెయిట్ చెయ్. లేకపోతే వేరే సినిమా చేసుకురా? అన్నారు. ఫస్ట్ సినిమా రవితేజగారితో చేయలేకపోవచ్చు. బట్.. నేను ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చేసేంత వరకు అదే స్ట్రెంత్తో, అదే కాన్ఫిడెన్స్‌తో సినిమా ట్రైల్స్ చేయడానికి కారణం రవితేజగారు ఇచ్చిన నమ్మకం. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఫైవ్‌డేస్ ముందు రామ్‌గారిని కలిశాను. నాపై నమ్మకం ఉంచినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘బడ్జెట్ పద్మనాభం’లో నేను హీరో, రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు రవి హీరో.. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్. రవితేజ ఈ స్థాయికి వచ్చినందుకు శుభాకాంక్షలు’’ అన్నారు జగపతిబాబు. ‘‘ప్రేక్షకులు సాంగ్స్‌ను ఎంజాయ్ చేస్తారన్న గ్యారంటీ ఇవ్వగలను’’ అన్నారు శక్తికాంత్. ‘‘రవితేజగారి ‘దుబాయ్ శీను’ సినిమాకు 5 పాటలు రాశాను. ఈ సినిమాకి ఒక సాంగ్ రాశాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రవితేజ నటనంటే నాకు చాలా ఇష్టం
-
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నేల టిక్కెట్టు’
రీ ఎంట్రీలో మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ సూపర్ హిట్ అందుకున్నారు. తరువాత టచ్ చూసి చూడుతో కాస్త తడబడినా వెంటనే తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ నేల టిక్కెట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ పూర్తి అయినందుకు చాలా ఆనందంగా ఉంది, అదే సమయంలో యూనిట్ మొత్తాన్ని చాలా మిస్ అవుతున్నా అంటూ ట్వీట్ చేశారు కల్యాణ్ కృష్ణ. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. మే 10న జరగనున్న ఈ సినిమా ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. Its a mixed feeling.. very happy and damn missing .. just done wit last day shoot of #nelatickettu wit mass maharaj.. loved working wit @RaviTeja_offl😍love you sir ❤️🤗 — Kalyankrishnkurasala (@kalyankrishna_k) 7 May 2018 -
‘నేల టికెట్టు’కు వస్తున్న పవన్
పవన్ కల్యాణ్ ‘నేల టిక్కెట్టు’ ఆడియో లాంచ్‌కు వస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే అదంతా నిజం కాదనీ, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ఆ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టారు. కానీ ఇప్పుడు అదే రూమర్ నిజమైంది. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా ‘నేల టిక్కెట్టు’ ఆడియో లాంచ్ కార్యక్రమం జరుగుతుందని సినిమా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ‘మాస్ మహారాజ’ రవితేజ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మే 10న నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.రవితేజ హీరోగా, మాళవికా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ‘నేల టికెట్టు’ సినిమా విడుదల కానుంది. -
నేల నేల నేల... నేల టిక్కెట్టు
రవితేజ పలికే డైలాగ్స్‌లోనే కాదు.. చేసే డ్యాన్స్‌లోనూ మాస్ పల్స్ మస్త్‌గా ఉంటాయి. అందుకు ఆయన గత చిత్రాల్లోని పాటలే నిదర్శనం. తాజాగా ఆయనపై మరో మాస్ సాంగ్‌ను గురువారం నుంచి షూట్ చేస్తున్నారు. రవితేజ హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న సినిమా ‘నేల టిక్కెట్టు’. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ‘నేల నేల నేల నేలటిక్కెట్టు’ అనే పాట చిత్రీకరణను గురువారం మొదలుపెట్టారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ‘‘ నేల నేల నేల టిక్కెట్లు.. అంటూ సూపర్‌హిట్ సాంగ్ రాయించావు కల్యాణ్ కృష్ణ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు రామజోగయ్య శాస్త్రి. ‘‘మీ చేత పాట రాయించగలమా సార్.. మీరు రాయాలి గానీ.. మాస్ టిక్కెట్ లిరిక్స్ ఇచ్చిన మీకు థ్యాంక్స్’’ అన్నారు కల్యాణ్ కృష్ణ. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. -
‘నేల టిక్కెట్టు’ కోసం పవన్
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కల్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 12న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పవన్ ఆడియో రిలీజ్ కు ముఖ్య అతిథిగా హాజరైతే సినిమా మీద హైప్ క్రియేట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. ఫిదా ఫేం శక్తి కాంత్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
‘నేల టిక్కెట్టు’ లోకేషన్ స్టిల్స్
-
చుట్టూ జనం.. మధ్యలో మనం
కాస్త కూల్‌గా కనిపించాడు కదా అని నేలటిక్కెట్లాంటోడిని గెలికితే ఉరుకుంటాడా? మడతెట్టేస్తాడు. ఒంట్లో ఒక్కొక్క నరాన్ని మెళిపెట్టేలా బాదేస్తాడు. ఆ అబ్బాయిలైఫ్లో ఓన్లీ మాస్ యాంగిలేనా? లవ్ యాంగిల్ లేదా? అనే డౌట్ అస్సలు అక్కర్లేదు. అన్ని యాంగిల్స్ దండిగా ఉన్నాయి. ‘చుట్టూ జనం.. మధ్యలో మనం’ అనే కాన్సెప్ట్‌తో హ్యాపీ ౖలైఫ్ను లీడ్ చేయాలనే కోరిక ఉంది. ఆలోచిస్తే అబ్బాయిలో మాస్ ప్లస్ క్లాస్ లక్షణాలు ఉన్నాయనిపిస్తోంది కదూ! మరి.. ఈ అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే. రవితేజ హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్వకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ‘నేల టిక్కెట్టు’ చిత్రం టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే రవితేజ ఎనర్జీ మార్క్ పక్కాగా కనిపిస్తోంది. ‘నేల టిక్కెట్టు’ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
`నేల టిక్కెట్టు' టీజర్ రీలీజ్