నేల నేల నేల... నేల టిక్కెట్టు | Ravi Teja's Nela Ticket to be sold on May 24th | Sakshi
Sakshi News home page

నేల నేల నేల... నేల టిక్కెట్టు

Published Fri, May 4 2018 12:26 AM | Last Updated on Fri, May 4 2018 12:26 AM

Ravi Teja's Nela Ticket to be sold on May 24th  - Sakshi

రవితేజ

రవితేజ పలికే డైలాగ్స్‌లోనే కాదు.. చేసే డ్యాన్స్‌లోనూ మాస్‌ పల్స్‌ మస్త్‌గా ఉంటాయి. అందుకు ఆయన గత చిత్రాల్లోని పాటలే నిదర్శనం. తాజాగా ఆయనపై మరో మాస్‌ సాంగ్‌ను గురువారం నుంచి షూట్‌ చేస్తున్నారు. రవితేజ హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న సినిమా ‘నేల టిక్కెట్టు’. ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ సినిమాలోని ‘నేల నేల నేల నేలటిక్కెట్టు’ అనే పాట చిత్రీకరణను గురువారం మొదలుపెట్టారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ‘‘ నేల నేల నేల టిక్కెట్లు.. అంటూ సూపర్‌హిట్‌ సాంగ్‌ రాయించావు కల్యాణ్‌ కృష్ణ థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు రామజోగయ్య శాస్త్రి. ‘‘మీ చేత పాట రాయించగలమా సార్‌.. మీరు రాయాలి గానీ.. మాస్‌ టిక్కెట్‌ లిరిక్స్‌ ఇచ్చిన మీకు థ్యాంక్స్‌’’ అన్నారు కల్యాణ్‌ కృష్ణ. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement