
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. టచ్ చేసి చూడు సినిమాతో నిరాశపరిచిన రవితేజ నేల టిక్కెట్టుతో తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నాడు. సొగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో ఆకట్టుకున్న కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేల టిక్కెట్టు ఈ రోజు (గురువారం) సెన్సార్‌కు వెళుతోంది. ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రవితేజ మార్క్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. రవితేజ సరసన మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment