Kalyan Krishna
-
ఆ బాధ నాకు తెలుసు.. అందుకే 'లంబసింగి' నిర్మించా: డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ
కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన సినిమా 'లంబసింగి'. 'బిగ్‌బాస్' ఫేమ్ దివి హీరోయిన్. భారత్ రాజ్ హీరో. 'బంగార్రాజు' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించాడు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. (ఇదీ చదవండి: కాస్ట్లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?) టాలెంట్ ఉన్నాసరే అవకాశాలు లేక చాలామంది ఉంటారు, నేను కూడా అలా ఛాన్సులు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందుకే నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టా. దివి లాంటి చాలామంది తెలుగమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి. ఈ సినిమాని అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నా అని కల్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు. కళ్యాణ్ కృష్ణ.. ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందమేసింది. ఈ ఛాన్స్ ఇచ్చిన ఆయనకు స్పెషల్ థాంక్స్. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము అని దివి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సౌత్ సినిమాలపై కంగన ఇంట్రెస్ట్.. అదే కారణమా?) -
చిరంజీవికి కుమారుడిగా 'రామ్ చరణ్' క్లోజ్ ఫ్రెండ్
టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలకు కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి వరుసుగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా విజయం ఆయనలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇదే జోష్‌లో ప్రస్తుతం ఆయన నటించిన 'భోళాశంకర్' విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే చిరంజీవి మరో సినిమాను లైన్లో పెట్టారు. నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు వంటి చిత్రాలను రూపొందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీకి ఆయన కమిట్ అయ్యారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బ్రో డాడీ'ని రీమేక్ చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించబోతోంది. ఈ సినిమాలో ఎవర్గ్రీన్ బ్యూటీ త్రిష ఆయనకు జోడీగా కనిపించనుంది. వారిద్దరికి గోల్డెన్ ఛాన్స్ ఈ సినిమా కోసం క్రేజీ కాంబినేషన్ ఏర్పాటు చేసే పనిలో దర్శకుడు కాల్యాణ్ కృష్ణ ఉన్నారు. సుమారు 23 ఏళ్ల తర్వాత చిరంజీవితో త్రిష మళ్లీ జత కట్టనుంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. మరోవైపు చిరు కొడుకు పాత్ర కోసం ముందుగా సిద్ధు జొన్నలగడ్డ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న దానిపై ఎన్నో చర్చలు జరిగాయి. (ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్) ఈ నేపథ్యంలోనే కొందరు హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ చివరకు రామ్ చరణ్ ఫ్రెండ్ శర్వానంద్‌ను చిరంజీవి ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. శర్వాకు జోడీగా యంగ్ హీరోయిన్ శ్రీలీలను ఫిక్స్ చేశారని టాక్. అలా వారిద్దరూ చిరుతో నటించేందుకు గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. అలా చిరంజీవి-త్రిషలకు కొడుకుగా శర్వానంద్ నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చిరు బర్త్‌డే రోజు (ఆగష్టు 22)న ప్రకటించనున్నారు. బ్రో డాడీ రీమేక్ ఇక బ్రో డాడీ సినిమా విషయానికొస్తే కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. కల్యాణి ప్రియదర్శి, మీనా, మోహన్ లాల్ తదితరులు నటించారు. ఈ మూవీ స్టోరీ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. పైగా చిరంజీవి కూడా కొత్త కథలతో ప్రయోగాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ చేసిన ఆయన.. ప్రస్తుతం విడుదల కానున్న భోళా శంకర్ కూడా 'వేదాళం' సినిమాకు రీమేక్ అని తెలిసిందే. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ) -
పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు.. అదే జోష్‌లో మాస్ సినిమాలు చేసేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘భోళా శంకర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం రిలీజైన తర్వాత ఓకేసారి రెండు సినిమాలను అనౌన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడట చిరంజీవి. అందులో మొదటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ తర్వాత బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో మరో మూవీ చేయబోతున్నాడు. ఇదే క్రమంలో తన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల కెరీర్‌ని కూడా గాడిలో పెట్టేందుకు సిద్దమయ్యారట చిరంజీవి. ఆ మధ్య సుష్మిత నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌తో పాటు సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమాను కూడా నిర్మించింది. అయితే ఆ రెండూ కూడా డిజాస్టర్‌గా మిగిలాయి. (చదవండి: భోళా శంకర్ టీజర్: హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్.. చిరు మాస్ డైలాగ్స్) దీంతో నిర్మాతగా అడుగుపెట్టిన సుష్మితకు ఆదిలోనే అపజయాలు ఎదురయ్యాయి. ఎలాగైన తన కూతురిని నిర్మాతగా నిలబెట్టాలని భావిస్తున్నారట చిరంజీవి. అందుకే తన తదుపరి సినిమాను కూతురి నిర్మాణ సంస్థలోనే చేయనున్నారట. ఇప్పటికే ‘సైరా’తో తన కొడుకు రామ్ చరణ్‌ని నిర్మాతగా పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు కూతురికి కూడా తన సినిమాతో ఓ సూపర్ హిట్ అందించి,పెద్ద ప్రొడ్యూసర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడట. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు నటించబోయే సినిమాకు సుష్మితనే నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించి, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదికి సంకాంత్రికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత వశిష్ట డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు చిరు. -
సోగ్గాడుగా చిరు? సస్పెన్స్ లో మెగా ఫాన్స్..
-
Manishankar Teaser: డబ్బు ప్రతి ఒక్కరిని శాసిస్తోంది
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘మణిశంకర్”. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథ-కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్యతల్ని జి.వి.కె(జి. వెంకట్కృష్టణ్) నిర్వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా మణిశంకర్ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విడుదల చేశారు.‘డబ్బు ప్రతి ఒక్కరిని శాసిస్తోంది. ఓడిస్తుంది. ఓడిన ప్రతివాడిని గెలిపిస్తుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టీజర్ విడుదల అనంతరం కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ - ``మణిశంకర్ పోస్టర్స్, టీజర్ చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకుని దర్శకుడు జీవీకే ఈ స్క్రిప్ట్ చేసినట్లు తెలుస్తోంది. రియలెస్టిక్‌గా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి జీవీకే, శివ కెరీర్‌కు హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ మణిశంకర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్` అన్నారు. చిత్ర దర్శకుడు జీవీకే మాట్లాడుతూ - ‘మణిశంకర్ అనేది ఒక యాక్షన్ థ్రిల్లర్. మంచి కంటెంట్‌ని యాక్షన్ మోడ్, సస్పెన్స్ వేలో చెప్పడం జరిగింది. మంచి టీమ్ తో కలిసి పనిచేశాం కాబట్టి ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది` అన్నారు.‘మణిశంకర్ అనే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ చేసే కొన్ని డీలింగ్స్‌కి సంభందించిన కథ. సంజన, చాణుక్య, ప్రియా హెగ్డే ఈ నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ. ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’అన్నారు హీరో శివ. -
చై-దక్షల వీడియోపై షాకింగ్ కామెంట్స్, చై బంగారం, ఇదంతా హీరోయిన్ వల్లే..
నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’ ఈవెంట్లో నాగచైతన్య, నటి దక్ష వీడయో నెట్టింట చర్చనీయాంశమైంది. స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుంటే చై, హీరోయిన్ దక్ష వైపు చూడగా.. ఆమె కొట్టెగా కనుబొమ్మలు ఎగిరేయడంతో చై సిగ్గుపడిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వైరల్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. బంగార్రాజు మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో మూవీ సెక్సెస్ మీట్లో దర్శకడు కల్యాణ్ కృష్ణ ఈ వీడియోపై స్పందించాడు. చదవండి: ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్ ట్వీట్ వైరల్ సెట్లో నాగచైతన్య ఎలా ఉండేవాడు, స్వభావం గురించి వివరిస్తూ ఈ వైరల్ వీడియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా దక్ష వల్లనే జరిగిందంటూ నటివైపు చూస్తూ అన్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ‘బెసిగ్గా నాగచైతన్య చాలా సిగ్గు, మోహమటస్తుడు. అతడికి ఎంతటి సిగ్గు అంటే దానికి ఉదహరణ ఇటీవల వైరల్ అయిన వీడియోను ఉదాహరణ. నాగ్ సార్ మాట్లాడుతుంటే ఏదో సౌండ్ వినిపంచడంతో వెనక్కి తిరిగాడు. దీంతో దక్ష అతడి చూసి కళ్లు ఎగిరేసింది. దానికే చై సిగ్గుపడ్డాడు. ఆయన స్వభావమే అంతా. దేనికైన సిగ్గు పడతాడు. ఇదంతా దక్ష వల్లే జరిగింది. చైతన్యది ఏం లేదు, అంతా నువ్వే చేశావు’ అంటూ హీరోయిన్ వైపు చూస్తూ అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ సరసన చాన్స్ కొట్టేసిన రష్మిక! ఇలా చై, దక్షల వైరల్ వీడియోపై దర్శకడు కల్యాణ్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సందర్భంగ కల్యాణ్ కృష్ణ, నాగ చైతన్యపై ప్రశంసలు కురిపించాడు. ‘చై బంగారం. చైతూని అందరూ బంగారం ఎందుకు అని అంటారో ఆయనతో పని చేశాక తెలుస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను చేశాను. ఇప్పుడు బంగార్రాజు చేశాను. 24 కారెట్స్ కాస్త 48 కారెట్స్ అయింది. ఈ నాలుగేళ్లలో అతనిలో చాలా మార్పులు వచ్చాయి. మాట్లాడే పద్దతి, నటన, మెచ్యూరిటీలో మార్పులు వచ్చాయి. చైలో ఉన్న క్లారిటీ మనకు పది శాతం ఉంటే.. హ్యాపీగా బతికేయోచ్చు. ఈ సినిమా వల్ల ప్రతీ రోజు సెట్లో కలిశాం. చై సైలెంట్ అని అనిపిస్తుంది. కానీ అంత సైలెంట్ కాదు. ఓపెన్ అప్ ఎంజాయ్ చేస్తే నవ్వు ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంత వరకు రాముడి పాత్రలు చేస్తే ఇప్పుడు చేసింది కృష్ణుడు కారెక్టర్. • Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT — ChayAkkineni ™ 🏹 (@massChayCults) January 10, 2022 చదవండి: నా జిమ్ ట్రైనర్ టార్చర్ చేస్తుంటాడు, నేను ఆ చాన్స్ మిస్సయ్యా: రష్మిక -
బంగార్రాజు సక్సెస్ మీట్.. నానమ్మ, తాతలు గుర్తుకు వచ్చేలా
Bangarraju Movie Success Meet At Annapurna Studios In Hyderabad: బంగార్రాజు సినిమా చూశాక అమల ఇంటికి రాగానే అమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసిందని కింగ్ నాగార్జున తెలిపారు. అక్కినేని తండ్రి కొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి విజయంతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం (జనవరి 15)న బంగార్రాజు చిత్రబృందం అన్నపూర్ణ స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగ చైతన్య, కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్మెంట్ జునైద్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 'జనవరి 14 అనేది మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. ప్రతి సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని నాన్నాగారు అంటుండేవారు. అలాగే ప్రయత్నిస్తున్నాం. బంగార్రాజుకు ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ నుంచి కలిపి ఒక్క రోజులోనే రూ. 17.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ సినిమా చూశాకా పెద్ద బంగార్రాజు పాత్ర ఎక్కువగా ఉందని అంటున్నారు. అది పాత్రపరంగా డైరెక్టర్ డిజైన్ చేసిందే. సినిమా చూశాక అమల ఇంటికి రాగానే ఆమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసింది. అవి ఆనందంతో కూడిన కన్నీళ్లు. వారు మనల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పింది. వారు మా వెనక ఉన్నారనే ఫీలింగ్‌ను వ్యక్తం చేసింది. ఇదే అభిప్రాయాన్ని చాలామంది వారి అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, నాన్నలను గుర్తుచేసుకున్నామని చెప్పారు. ఈ సినిమాకు మరో సీక్వెల్‌ను ఇప్పుడే ప్లాన్ చేయలేం.' అని నాగార్జున వెల్లడించారు. నాగ చైతన్య మాట్లాడుతూ బంగార్రాజు సినిమాలో చేయడం నాకు సవాల్‌గా అనిపించింది. గ్రామీణ నేపథ్యం, ఎనర్జిటిక్ పాత్ర ఇంతవరకూ చేయలేదు. ఇందుకు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ చాలా సపోర్ట్ చేశాడు. ఆయనకు ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు. కథ విన్నాక ఆయన చెప్పినట్లు చేయడమే. షూటింగ్లో నాన్నగారు నన్ను డామినేట్ చేశారనే ఫీలింగ్ ఒకసారి కలిగింది. అది ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాను. అని పేర్కొన్నాడు. 'పండుగ సందర్భంగా రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయడం మాకు బగా కలిసివచ్చింది. నాగార్జునతోపాటు టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడి పనిచేశారు. సంగీతం దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలకు తగిన ట్యూన్స్ ఇచ్చి ఆడియోకు మరింత క్రేజ్ వచ్చేలా చేశాడు.' అని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు. కథ ప్రకారం వీఎఫ్ఎక్స్ చేశానన్నారు జునైద్. కథకు కావాల్సిన అన్ని అంశాలను డైరెక్టర్‌తో చర్చించి చేయడం వల్లే గ్రాఫిక్ విజువల్స్‌కు మంచి పేరు వచ్చిందన్నారు. ఇదీ చదవండి: బంగార్రాజు మూవీ ఎలా ఉందంటే.. -
ప్రతి పాట వజ్రంలా ఉంటుంది
‘‘బంగార్రాజు’ చిత్రంలో ప్రతి పాట ఓ వజ్రంలా ఉంటుంది. ఇది సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది’’ అని నాగార్జున అన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బంగార్రాజు మ్యూజికల్ నైట్’ లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘అభిమానులందర్నీ ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలి. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోకు చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ పుట్టింది. యాభై ఏళ్ల క్రితం ‘దసరా బుల్లోడు’తో నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) సంక్రాంతికి దుమ్ములేపారు.. ఆ చిత్రం కూడా మ్యూజికల్ హిట్. సినిమా సక్సెస్‌లో సగ భాగం మ్యూజిక్దే. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ రాబోతోంది. జనవరి 14 పండుగ రోజున పండుగలాంటి ‘బంగార్రాజు’ ను తీసుకొస్తున్నాం’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘బంగార్రాజు’ ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. అనూప్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. మా లిరిక్ రైటర్స్‌కి థ్యాంక్స్. ఇది పండుగ లాంటి సినిమా. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ–‘‘సినిమా సక్సెన్ స్థాయిని నిర్ణయించేది సంగీతమే. ‘బంగార్రాజు’ కు ఇంత మంచి సంగీతం ఇచ్చిన అనూప్ రూబెన్స్‌కి థ్యాంక్స్. నాగ్ సర్ ప్రతి సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టరే. ‘బంగార్రాజు’ పాటలు కూడా అలాగే ఉంటాయి. ఇండస్ట్రీలో బంగార్రాజు అంటే నాగ్ సారే.. ఇప్పుడు ఆయ నకు పోటీగా చిన్న బంగార్రాజు(నాగచైతన్య) ఎక్కడా తగ్గలేదు’’ అన్నారు. ‘‘ఈ మ్యూజికల్ నైట్తోనే సంక్రాంతి ప్రారంభమైనట్టుంది’ అని నిర్మాత జీ స్టూడియోస్ ప్రసాద్ అన్నారు. హీరోలు సుమంత్, సుశాంత్, నిర్మాత నాగ సుశీల, కెమెరామేన్ యువరాజ్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్ మాట్లాడారు. -
ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి.. దర్శకుడి ముచ్చట్లు
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున 'బంగార్రాజు'గా మరోసారి సందడి చేయనున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాకు 'సోగ్గాడు మళ్లీ వచ్చాడు' అనేది క్యాప్షన్. ఇందులో నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నాగార్జున సరనస రమ్యకృష్ణ నటించగా.. చైకు జంటగా కృతి శెట్టి అలరించనుంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం డైరెక్టర్ తన అనుభవాలను పంచుకున్నారు. మా మధ్య మంచి ర్యాపో ఉంది.. 2014లో మొదటగా నాగార్జునకు సోగ్గాడే కథను నెరేట్ చేశాను. 2016లో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా రిలీజ్ అయింది. ఆ రోజే బంగార్రాజు సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. మధ్యలో చైతన్యతో ఓ సినిమాను తీస్తే నాగార్జున గారే నిర్మించారు. మొదటి నుంచి కూడా మా మధ్య మంచి ర్యాపో ఉంది. ప్రతీ విషయంలో ఆయన నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానో ఆయనకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఆ లైన్ నాది కాదు.. సోగ్గాడే చిన్న నాయనా లైన్ నాది కాదు. రామ్ మోహన్ గారి పాయింట్ అది. వేరే దర్శకుడిని ముందుగా అనుకున్నారు. నేను వేరే సినిమా కోసం నాగార్జున గారికి ఓ కథ వినిపించాను. అయితే ఆ కథ నా వద్దకు వచ్చింది. ఓ పదిహేను రోజులు ఆ కథ మీద కూర్చున్నాను. ఆ తరువాత కథను నాగార్జున గారికి వినిపించాను. ఫస్ట్ నెరేషన్‌లోనే ఒకే అయింది. అప్పుడే చేయాలనుకున్నాం.. సోగ్గాడే చిన్ని నాయన సినిమా విడుదలైన రోజే బంగార్రాజు సినిమా చేయాలని అనుకున్నాం. కానీ చైతన్యతో ముందు ఓ సినిమా చేయమని నాగార్జున గారు అన్నారు. కానీ అప్పటికే నాగ చైతన్య గారు సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలకు కమిట్ అయ్యారు. ఆ గ్యాప్‌లో నేను 'నేల టికెట్' సినిమాను చేశాను. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా లేట్ అయింది. ఇది ప్రీక్వెల్ కాదు సోగ్గాడే సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు రాబోతోంది. ప్రీక్వెల్ కాదు. రెండు సినిమాలను కలిపి చూస్తే ఐదు గంటలు అవుతుంది. సోగ్గాడే ఎక్కడ ఎండ్ అయిందో.. బంగార్రాజు అక్కడ మొదలవుతుంది. పాత్రల్లో తేడా ఉండదు.. జనరేషన్ తేడా ఉంటుంది తప్పా బంగార్రాజు పాత్రలో తేడా ఉండదు. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపిస్తారు. పెద్ద బంగార్రాజు పాత్ర ఎలా ఉండేదో.. చిన్న బంగార్రాజు పాత్ర కూడా అలానే ఉంటుంది. మూడు దశల్లో ఉండే ప్రేమ కథ జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఓ సినిమా అనుకున్నాను. అందులో యంగ్ పాత్రలో నాగ చైతన్య, మిగిలిన పాత్రలో నాగార్జున అని అనుకున్నాను. ఆ కథ అయితే ఉంది. ఎప్పుడు చేస్తానో తెలీదు. అదే పెద్ద సవాల్ అనుకున్న సమయానికి ఈ సినిమాను రెడీ చేయడమే పెద్ద సవాల్‌గా అనిపించింది. వేరే సినిమాలతో కాకుండా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో అందరూ పోల్చుతారు. వీఎఫ్ఎక్స్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అలా కాలంతో పాటుగా పరిగెత్తాల్సి వచ్చింది. పండుగల ఉందన్నారు సినిమాను ప్రారంభించడమే సంక్రాంతి టార్గెట్‌తో స్టార్ట్ చేశాం. ముందు నుంచి సంక్రాంతికి అనుకున్నాం. కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. టీం అంతా కలిసి పని చేశాం. అందరూ ఒకే సింక్‌లో ఉండేవాళ్లం. అందుకే ఈజీగా చేశాం. ఎక్కడా కూడా మిస్ అండర్‌స్టాండిగ్ రాలేదు. మొన్నే సెన్సార్ అయింది. జీరో కట్స్‌తో యూఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా పండుగలా ఉందని అన్నారు. ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకూడదు. అందుకే స్క్రిప్ట్‌కు ఇంత సమయం పట్టింది. మొదట్లో కొంత మంది నాగ చైతన్యది గెస్ట్ కారెక్టర్ అని రాశారు. రెండు పాత్రలు సమానంగా ఉంటాయి. ఇద్దరూ హీరోలకు ప్రతీ ఎమోషన్ సమానంగా ఉంటుంది. సెంటిమెంట్ కోసం కాదు పాటలో ఫన్ ఉంటే నాగార్జున గారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందులో కళ్లు మీద పాట పాడారు. ఇందులో కబడ్డీ మీద పాట పాడారు. ఈ పాట ఎవరు పాడినా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆయన పాడితే ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అందుకే నాగార్జున గారితో పాడించాం. సెంటిమెంట్ కోసం కాదు. అఖిల్‌తో కష్టం.. అఖిల్‌తో బంగార్రాజుకు సీక్వెల్ అంటే కష్టం. ముందు కథ రాసిన నేను సంతృప్తి చెందాలి. ఆ తరువాత వారిని మెప్పించాలి. ఎగ్జైట్ చేసే పాయింట్ దొరికితే ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి ఆలోచన అయితే లేదు. జనవరి 9న మ్యూజికల్ ఈవెంట్ ఈ సినిమాకు సంగీతమే ప్రధాన బలం. ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. ఇంకా మూడు పాటలు రానున్నాయి. దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియో ఎంత బాగుంటుందో.. మేకింగ్ పరంగా కూడా అంతే బాగుంటుంది. ఆర్ఆర్ అద్బుతంగా ఉంటుంది. మాకే కంట్లో నీళ్లు తిరిగాయి. జనవరి 9న మ్యూజికల్ ఈవెంట్ ఉంది. అందులోనే పాటలు విడుదల చేస్తాం. పంచెకట్టు పెట్టడానికి కారణం అదే నేటివిటీ ఉండాలి.. దర్జాగా ఉండాలి అనే ఆలోచనల నుంచే బంగార్రాజు గెటప్‌ను అనుకున్నాం. సూట్, బూట్ వేసుకుంటే బయట అందరూ ఫాలో అవ్వలేరు. అందుకే అందరికీ సింపుల్‌గా అనిపించాలనే పంచెకట్టుని పెట్టాం. రమ్యకృష్ణ పాత్ర కంటిన్యూ అవుతుంది సినిమాలో ఐదు యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. అందులో నాలుగు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేశారు. ఇంకోటి ఆర్కే చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు ఇద్దరు హీరోలకు సమానంగా ఉంటాయి. చాలా తెలివైనదాన్ని అని అనుకునే అమాయకురాలి పాత్రలో కృతి శెట్టి కనిపిస్తుంది. విలేజ్‌లో ఉండి, బీటెక్ చదివి తనలాంటి తెలివైన అమ్మాయిలు ఊర్లో లేరని అనుకునే పాత్రలో నటించింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఉన్నట్టుగా రమ్యకృష్ణ గారి పాత్ర కంటిన్యూ అవుతుంది. ఎమోషన్ ఉంటేనే.. ప్రతీ దర్శకుడి అన్ని రకాల సినిమాలను చేయాలని ఉంటుంది. నేను తర్వాత చేసే సినిమా మాత్రం ఈ జానర్లో ఉండదు. ఏ సినిమా చేసినా కూడా ఎమోషన్ మాత్రం ఉండాలి. ఎమోషన్ కనెక్ట్ అయితేనే సినిమా హిట్ అవుతుంది. కామెడీ సినిమా అయినా కూడా ఎమోషనల్‌గా టచ్ అవ్వాల్సిందే. ఈవీవీ గారి సినిమాల్లో కామెడీ ఉన్నా కూడా ఎమోషన్ ఉంటుంది. ఆ ఆలోచనలు లేవు జ్ఞానవేల్ రాజా గారితో ఓ సినిమా ఉంటుంది. కథ, హీరో అనేది ఇంకా నిర్ణయించలేదు. హీరోను బట్టి ద్విభాష చిత్రంగా ఉండొచ్చు. కానీ నేను మాత్రం తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సినిమాను తీస్తాను. నాకు పాన్ ఇండియన్ ఆలోచనలు లేవు. ప్రస్తుతం సినిమాల మీదే ఫోకస్ పెట్టాను. వెబ్ సిరీస్‌ల గురించి ఆలోచించడం లేదు. -
Bangarraju Movie Images : ‘బంగార్రాజు’ మూవీ స్టిల్స్
-
Nagarjuna Bangarraju Movie: మైసూర్లో బంగార్రాజు
‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున– దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. నాగార్జున–నాగచైతన్యలు పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట కల్యాణ్ కృష్ణ. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీలో నాగార్జున పక్కన గ్రేస్‌ఫుల్‌గా కనిపించిన రమ్యకృష్ణ ‘బంగార్రాజు’ లోనూ నటిస్తున్నారు. నాగచైతన్య సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సత్యానంద్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’
షూటింగ్లో పాల్గొనేందుకు బంగార్రాజు రెడీ అవుతున్నాడు. 2016లో నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఆ సంక్రాంతి పండక్కి ఓ మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర పేరుతోనే ప్రీక్వెల్‌ను ప్లాన్ చేశారు కల్యాణ్ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య మరో హీరోగా నటిస్తారు. షూటింగ్‌ను ఈ నెల 20న మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. సెట్స్ వర్క్ కూడా జరుగుతోందట. అంతేకాదు.. ‘సోగ్గాడే చిన్ని నాయనా..’ని సంక్రాంతికి విడుదల చేసినట్లే ‘బంగార్రాజు’ని కూడా సంక్రాంతికి (2022) విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. -
తాత కాబోతున్న నాగార్జున..!
కింగ్ నాగార్జున త్వరలో తాత కాబోతున్నారు. అయితే అది రియల్ లైఫ్‌లో మాత్రం కాదు.. రీల్ లైఫ్‌లోనే. అవును నాగార్జున తన తదుపరి చిత్రంలో తాత పాత్రలో కనిపించనున్నాడట. దేవదాసు సినిమా తరువాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నాగ్, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రతో పాటు మరో మలయాళం సినిమాలో నటిస్తున్నారు. తమిళ్లో ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైనా ఇంకా పట్టాలెక్కలేదు. తాజాగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వల్ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు నాగ్. కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చటంతో ఏప్రిల్ లోనే సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు నాగార్జున, నాగచైతన్య కే తాతగా కనిపించనున్నాడట. బంగార్రాజు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మానవతా విలువలను గుర్తుచేశా !
సందడి చేసిన మాళవిక : నేలటిక్కెట్ సినిమా విజయోత్సవాల్లో భాగంగా ఆ చిత్ర బృందం గురువారం నగరంలో సందడి చేసింది. చిత్ర దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, హీరోయిన్ మాళవిక శర్మ తదితరులు సాగరతీరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరోయిన్ మాళవిక శర్మ డ్యాన్సులతో అభిమానులను ఉర్రూతలూగించారు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నేటి తరం బిజీ లైఫ్‌లో పడి మరిచిపోతున్న మానవతా విలువలను గుర్తుచేసేందుకే ‘నేలటిక్కెట్టు’ సినిమా తీశానని చిత్ర డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ అన్నారు. రవితేజ నటించిన ఈ సినిమాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో సాగరతీరంలో వీరు మామ వీటీం ఆధ్వర్యంలో చిత్ర విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరూ మానవత ధృక్పదంతో నడుచుకోవాలని చిత్రంలో చూపించామన్నారు. ఎంత డబ్బు ఉన్నా పది మంది మనుషులు మనచుట్టూ ఉంటేనే గొప్ప అనేది చెప్పామన్నారు. ‘నేలటిక్కెట్టు’ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను వైజాగ్‌కు చెందిన వాడినని అందుకే సిటీ అంటే ఇష్టమన్నారు. తాను చిన్నప్పుడు చూసిన ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేయడానికి ఇష్టపడతానని, అందుకే ప్రతీ సినిమా విశాఖలో షూటింగ్ చేస్తున్నానని తెలిపారు. హీరోయిన్ మాళవికశర్మ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. మొదటి చిత్రం కావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను తొలిసారిగా విశాఖ వచ్చానన్నారు. విశాఖ ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉందన్నారు. నేలటిక్కెట్టు సినిమాను ప్రతీ ఒక్కరూ చూడదగ్గ చిత్రమన్నారు. చిత్రంలో మత్స్యకారుడి పాత్ర పోషించిన డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగంలో జాతీయ అవార్డులు పొందినప్పుడు రాని ఆనందం సినిమాల్లో నటించినప్పుడు వచ్చిన గుర్తింపుతో పొందుతున్నానన్నారు. కళ్యాణ్ కృష్ణ నాలోని నటుడిని గుర్తించి రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో అవకాశం ఇచ్చారన్నారు. అప్పటి నుంచి చాలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది సినిమాలను చూడకుండా రివ్యూలను రాసి ప్రేక్షకులను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. వాటికితోడు కొన్ని రాజకీయలు తోడై ‘నేలటిక్కెట్టు’ చిత్రాన్ని ఆడకుండా చేయాలని అనుకున్నారని, అయితే ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారన్నారు. వేడుకల్లో భాగంగా హీరోయిన్ మాళవిక చేసిన డ్యాన్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపించింది. ఈ సందర్భంగా పదో తరగతిలో ప్రతిభ చూపిన 25 మంది విద్యార్థులకు రూ. 2 వేల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వీరు మామ వ్యవహరించారు. -
‘నేల టిక్కెట్టు’ మూవీ రివ్యూ
టైటిల్ : నేల టిక్కెట్టు జానర్ : రివేంజ్ డ్రామా తారాగణం : రవితేజ, మాళవికా శర్మ, జగపతి బాబు, సంపత్, సుబ్బరాజు సంగీతం : శక్తికాంత్ కార్తీక్ దర్శకత్వం : కల్యాణ్ కృష్ణ కురసాల నిర్మాత : రామ్ తళ్లూరి మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రవితేజ కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టుగా అలరించలేకపోతున్నాడు. ఇటీవల రాజా ది గ్రేట్ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించినా తరువాత టచ్ చేసి చూడు సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా మాస్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి నేల టిక్కెట్టుతో రవితేజ తిరిగి ఫాంలోకి వచ్చాడా..? దర్శకుడు కల్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ హిట్ సాధించాడా..? కథ ; ఆదిత్య భూపతి (జగపతి బాబు).. తండ్రి ఆనంద భూపతి (శరత్ బాబు) వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల పేరుతో తండ్రి ఆస్తిని దానం చేసేస్తున్నాడని ఆనంద భూపతిని చంపించేస్తాడు. (సాక్షి రివ్యూస్) ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ గౌతమి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. అధికారం అడ్డుపెట్టుకోని ఉద్యోగాలు అమ్ముకోవటం, కబ్జాలు, దందాలు చేస్తూ వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తాడు. ఈ కథలో హీరో అనాథ(రవితేజ). అమ్మానాన్న తో పాటు కనీసం పేరు కూడా లేని హీరోని చేరదీసిన వ్యక్తి థియేటర్లో నేల టిక్కెట్టులో పడుకోబెడతాడు. అప్పటి నుంచి అదే హీరో ఇల్లు, పేరు అవుతుంది. నేల టిక్కెట్టు పేరుతోనే పెరిగి పెద్దవాడైన హీరో. తనను అన్నా.. తమ్ముడు అని పిలిచిన ప్రతీ వారికి కాదనకుండా సాయం చేస్తుంటాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పే హీరో ఓ కేసు కారణంగా ఫ్రెండ్స్‌తో సహా వైజాగ్ వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అలా హైదరాబాద్ చేరిన హీరో అనుకోకుండా మినిస్టర్ ఆదిత్య భూపతి మనుషులతో గొడవ పడతాడు. ఆదిత్య భూపతికి, హీరోకి మధ్య గొడవ ఏంటి..? అసలు హీరో వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చాడు..? ఆదిత్య భూపతి అవినీతిని, దుర్మార్గాలను ఎలా బయటపెట్టాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమాకు ప్రధాన బలం హీరో రవితేజ. తనదైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, రొమాన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే రవితేజ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే బలమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. హీరోయిన్గా పరిచయం అయిన మాళవికా శర్మ లుక్స్ పరంగా ఆకట్టుకున్న నటిగా మెప్పించలేకపోయింది. విలన్‌గా జగపతి బాబు మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించారు.(సాక్షి రివ్యూస్) ఆలీ, ప్రవీణ్, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్ రెడ్డి, పృథ్వి, ప్రియదర్శి ఇలా తెరనిండా నటీనటులు ఉన్నా ఎవరికీ బలమైన సన్నివేశాలు మాత్రం పడలేదు. విశ్లేషణ ; సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన కల్యాణ్ కృష్ణ, మూడో ప్రయత్నంగా మాస్ హీరోతో ఓ కమర్షియల్ కథను ఎంచుకున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో పాటు సందేశాత్మక కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆ కథను ప్రేక్షకులను మెప్పించేలా తెర మీద చూపించటంలో తడబడ్డాడు. ఫస్ట్‌హాఫ్ అంతా అసలు కథను మొదలు పెట్టకుండా సరదా సన్నివేశాలతో లాగేయటం, ఆ సన్నివేశాల్లో రవితేజ మార్క్ కామెడీని పండించలేకపోవటంతో ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలైనా కథనంలో వేగం లేకపోవటం నిరాశపరుస్తుంది.(సాక్షి రివ్యూస్) ఫిదా సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్, నేల టిక్కెట్టుతో మెప్పించలేక పోయాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : రవితేజ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథా కథనం సంగీతం సినిమా నిడివి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
తప్పులను క్షమించాలి
‘‘సినిమా సౌండ్ అర్థమయ్యే పిల్లల నుంచీ 90ఏళ్ల వాళ్ల వరకూ అందరూ ‘నేల టిక్కెట్టు’ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్రతి సినిమాకీ ఫస్ట్ సినిమాలాగే కష్టపడతాను. ఈ సినిమాపై నాకు 100 శాతం నమ్మకం ఉంది’’ అని కల్యాణ్ కృష్ణ అన్నారు. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘అనాథ అయిన హీరో ఓ కుటుంబాన్ని ఎలా సంపాదించుకుంటాడు? ప్రతి మనిషికీ ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ లోపం లేకుంటే దేవుడు అయిపోతాడు. ఆ తప్పుల్ని కూడా మనం క్షమించగలిగితేనే ఒకరికొకరు దగ్గరవుతారు. అలా.. ప్రతి మనిషిలోనూ హీరో ఒక రిలేషన్ వెతుక్కుంటాడు. చివరికి దేవుడితో కూడా. ఒక్కసారి రిలేషన్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ల కోసం ఎంత ఫైట్ చేశాడన్నదే సినిమా’’ అన్నారు. ‘‘నేను సోలోగా తీసిన మొట్టమొదటి చిత్రమిది. క్లాస్, మాస్ కాంబినేషన్లో ఉన్న ఫ్యామిలీ ఎమోష¯Œ మూవీ. రవితేజగారు లేకుంటే ఈ సినిమా ఇంత స్పీడ్‌గా పూర్తయ్యేది కాదు. కల్యాణ్ కృష్ణ కూడా బాగా కష్టపడ్డారు. వీరిద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. రవితేజగారితోనే మరో సినిమా చేస్తాం. సెప్టెంబర్ ఆఖరులో ప్రారంభం అవుతుందిæ’’ అన్నారు రామ్ తాళ్లూరి. ‘‘ఈ చిత్రంలో నాది మెడికల్ స్టూడెంట్ పాత్ర. రవితేజగారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కల్యాణ్ కృష్ణ చాలా పాజిటివ్. రామ్ తాళ్లూరి సార్ బ్యానర్లో పని చేయడం వెరీ కంఫర్టబుల్’’ అన్నారు మాళవికా శర్మ. -
మాస్ అండ్ క్లాస్
-
మాస్ అండ్ క్లాస్
-
‘నేల టిక్కెట్టు’ మూవీ స్టిల్స్
-
మే 25న ‘నేల టిక్కెట్టు’
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. టచ్ చేసి చూడు సినిమాతో నిరాశపరిచిన రవితేజ నేల టిక్కెట్టుతో తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నాడు. సొగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో ఆకట్టుకున్న కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేల టిక్కెట్టు ఈ రోజు (గురువారం) సెన్సార్‌కు వెళుతోంది. ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రవితేజ మార్క్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. రవితేజ సరసన మాళవికా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. -
‘నేల టిక్కెట్టు’ ట్రైలర్ వచ్చేసింది
-
‘నేల టిక్కెట్టు’ ఆడియో రిలీజ్ వేడుక
-
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నేల టిక్కెట్టు’
రీ ఎంట్రీలో మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ సూపర్ హిట్ అందుకున్నారు. తరువాత టచ్ చూసి చూడుతో కాస్త తడబడినా వెంటనే తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ నేల టిక్కెట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ పూర్తి అయినందుకు చాలా ఆనందంగా ఉంది, అదే సమయంలో యూనిట్ మొత్తాన్ని చాలా మిస్ అవుతున్నా అంటూ ట్వీట్ చేశారు కల్యాణ్ కృష్ణ. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. మే 10న జరగనున్న ఈ సినిమా ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. Its a mixed feeling.. very happy and damn missing .. just done wit last day shoot of #nelatickettu wit mass maharaj.. loved working wit @RaviTeja_offl😍love you sir ❤️🤗 — Kalyankrishnkurasala (@kalyankrishna_k) 7 May 2018 -
చుట్టూ జనం.. మధ్యలో మనం
కాస్త కూల్‌గా కనిపించాడు కదా అని నేలటిక్కెట్లాంటోడిని గెలికితే ఉరుకుంటాడా? మడతెట్టేస్తాడు. ఒంట్లో ఒక్కొక్క నరాన్ని మెళిపెట్టేలా బాదేస్తాడు. ఆ అబ్బాయిలైఫ్లో ఓన్లీ మాస్ యాంగిలేనా? లవ్ యాంగిల్ లేదా? అనే డౌట్ అస్సలు అక్కర్లేదు. అన్ని యాంగిల్స్ దండిగా ఉన్నాయి. ‘చుట్టూ జనం.. మధ్యలో మనం’ అనే కాన్సెప్ట్‌తో హ్యాపీ ౖలైఫ్ను లీడ్ చేయాలనే కోరిక ఉంది. ఆలోచిస్తే అబ్బాయిలో మాస్ ప్లస్ క్లాస్ లక్షణాలు ఉన్నాయనిపిస్తోంది కదూ! మరి.. ఈ అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే. రవితేజ హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్వకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ‘నేల టిక్కెట్టు’ చిత్రం టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే రవితేజ ఎనర్జీ మార్క్ పక్కాగా కనిపిస్తోంది. ‘నేల టిక్కెట్టు’ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
`నేల టిక్కెట్టు' టీజర్ రీలీజ్
-
‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే..!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో రూపొందించిన ఈ సినిమాతో మాళవిక శర్మ హీరోయిన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. టచ్ చేసి చూడు సినిమాతో నిరాశపరిచిన రవితేజ నేలటిక్కెట్టుతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. -
మే 24న ‘నేల టిక్కెట్టు’
టచ్ చేసి చూడు సినిమా తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇటీవల విడుదల చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చివరిదశలో షూటింగ్ పనులతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలకు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను మే 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతమందిస్తున్నారు. -
రవితేజ ‘నేల టిక్కెట్టు’ కన్ఫామ్!
సాక్షి, సినిమా: రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ తరువాత టచ్‌చేసి చూడు సినిమాతో తడబడ్డాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ 'నేల టిక్కెట్టు' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సంవత్సరాది ఉగాదికి కొత్త కొత్తగా కనిపించి అభిమానులకు పండగ ఉత్సాహాన్ని డబుల్ చేయనున్నారు హీరో రవితేజ. తన అభిమానులకు ఉగాది కానుకగా నేల టిక్కెట్టు మూవీ ఫస్ట్ లుక్‌ను శనివారం సోషల్ మీడియాలో రవితేజ విడుదల చేశారు. పల్లెటూరి బ్రాక్‌డ్రాప్ తో ఈ ఫొటోలో హీరో రవితేజతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారి చేతుల్లోనూ చాయ్ గ్లాస్‌తో సరదాగా ఉన్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మాతగా ఈ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాళవిక శర్మ, రవితేజతో జోడీగా కనిపించనున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ‘నేల టిక్కెట్టు’ అనే టైటిల్‌ను అనుకున్నా.. అధికారికంగా ఉగాది కానుకగా ఓ రోజు ముందు టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. కాగా, సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఓ ప్రముఖ టీవీ ఛానల్ 25 కోట్లకు సొంతం చేసుకుంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాను మే 24న విడుదల చేయనున్నారు. NELA Tickets available from May 24th 😊😉 pic.twitter.com/F7FIoiSMc6 — Ravi Teja (@RaviTeja_offl) 17 March 2018 -
ఉగాదికి కొత్తగా...
తెలుగు సంవత్సరాది ఉగాదికి కొత్త కొత్తగా కనిపించి అభిమానులకు పండగ ఉత్సాహాన్ని డబుల్ చేయనున్నారు హీరో రవితేజ. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాళవిక శర్మ కథానాయిక. ఈ సినిమాకు ‘నేల టిక్కెట్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా ఈనెల 18న విడుదల చేయాలనుకుంటున్నారు. రీసెంట్గా చిత్రబృందం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. ఆల్మోస్ట్ 60 శాతం సినిమా చిత్రీకరణ పూరై్తంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు నటిస్తున్న ఈ సినిమాను మే లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్. -
డోన్ట్ వర్రీ!
.... హీరో రవితేజకు సెట్లో ఎటువంటి ప్రమాదం జరగలేదు అని అభిమానులకు భరోసా ఇచ్చారు దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్పాట్లో బైక్ చేజింగ్ స్టంట్ చేసిన రవితేజ ప్రమాదవశాత్తు గాయపడ్డారని, రెండు నుంచి మూడు వారాల సమయం పాటు విశ్రాంతి తీసుకోమని ఆయనకు డాక్టర్లు సూచించారని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఈ వార్తల్లో నిజం లేదని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ పేర్కొన్నారు. ‘‘రవితేజగారికి ఏమైంది? ఆయన గురించి చాలా వార్తలు వస్తున్నాయి?’’ అని ఓ అభిమాని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘ఏమీ జరగలేదు. ఆ వార్తల్లో నిజం లేదు. డోన్ట్ వర్రీ. ఆయన పర్ఫెక్ట్’’ అని ఆ అభిమాని పోస్ట్‌కు స్పందించారు కల్యాణ్ కృష్ణ. ఇందులో మాళవిక వర్మ కథానాయిక. ఈ సినిమాకు ‘నేల టిక్కెట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
‘రవితేజకు ఏం కాలేదు’
లాంగ్ గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకున్న రవితేజ యమా స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎనర్జిటిక్ స్టార్ ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నేల టికెట్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రవితేజకు సంబంధించిన వార్త ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో రవితేజ గాయపడ్డారని, తీవ్రమైన గాయాలు కాకపోయినా ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘అసలేం జరగలేదు.. అవన్నీ పుకార్లు.. ఎవరు ఆందోళన చెందొద్దు.. ఆయన (రవితేజ) ఎప్పటి లాగే పర్ఫెక్ట్గా ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు. Nothing happened.. all false news .. don’t worry.. he is damn perfect as always ..😊👍🏻 https://t.co/qwlqsxjuRq — Kalyankrishnkurasala (@kalyankrishna_k) 27 February 2018 -
సకుటుంబ సపరివార సమేతంగా...
రవితేజ ఏదైనా టూర్ వెళ్లారేమో అనుకుంటున్నారా? టూర్ వెళ్లేంత తీరిక లేదు. కానీ సుకుటుంబ సపరివార సమేతంగానే ఉన్నారు. ఇది సినిమా ఫ్యామిలీ. ఒక మూవీకి కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు చిత్రబృందమంతా ఒక కుటుంబంలాగానే కలిసిమెలిసి ఉంటారు కదా. ప్రస్తుతం రవితేజ అండ్ సినిమా ఫ్యామిలీ సందడి సందడిగా షూటింగ్ చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేసిన చిత్రబృందం రీసెంట్గా వైజాగ్‌లో వారం పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఫ్యామిలీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. రోజుకి మినిమమ్ 40 నుంచి 50 మంది ఆర్టిస్టులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. -
‘నేల టికెట్’కు 25 కోట్లు
రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మాస్‌మహారాజ్ రవితేజ తరువాత టచ్‌చేసి చూడు సినిమాతో మరోసారి తడబడ్డాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ నేల టికెట్ సినిమాలో నటిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వరుస విజయాల తరువాత కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా దాదాపుగా పూర్తయినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఓ ప్రముఖ టీవీ ఛానల్ 25 కోట్లకు సొంతం చేసుకుంది. గత చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. మాస్ లో రవితేజకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంతటి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. -
వైజాగ్‌లో వారం రోజులు
... ఎందుకు? రవితేజ వైజాగ్‌లో వారం రోజులు ఎందుకు ఉండాలనుకున్నారంటే... కచ్చితంగా హాలిడేస్ కాదు. షూటింగ్ కోసమే. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లారు. ఈ నెల 8 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత బ్యాక్ టు హైదరాబాద్. ఇందులో రవితేజ సరసన మాళవికా శర్మ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ స్టైల్ మాస్, కల్యాణ్ కృష్ణ ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘నేల టిక్కెట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం. -
సెల్ఫీతో సందడి
ఫ్రమ్ ఏ టూ సి... ఏ సెంటరైనా రవితేజకు ఫ్యాన్స్ ఉన్నారు. జస్ట్ రెండే సినిమాల (సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం)తో యూత్, ఫ్యామిలీస్‌కి దగ్గరయ్యారు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. మాస్ హీరో రవితేజతో ఈ యంగ్ డైరెక్టర్ చేస్తోన్న సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికా శర్మ కథానాయిక. ‘‘రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేశాం. సక్సెస్‌లో ఉన్న రవితేజ, కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో మా బ్యానర్‌పై సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఆల్రెడీ ఇండస్ట్రీలో బజ్ స్టార్ట్ అయ్యింది. ముకేశ్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఫస్ట్ డే షూటింగ్ స్పాట్లో యూనిట్ మెంబర్స్‌తో రవితేజ సరదాగా సెల్ఫీ దిగి, సందడి చేశారు. -
రవితేజకు జోడిగా కొత్తమ్మాయి
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు షూటింగ్ పూర్తి చేసిన ఈ సీనియర్ హీరో త్వరలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించనున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ సరసన కొత్తమ్మాయిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. జనవరి 5న షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం మాళవిక శర్మను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ముందుగా హీరోయిన్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని భావించినా.. రవితేజ, రకుల్ కాంబినేషన్ లో వచ్చిన కిక్ 2 ఫ్లాప్ కావటంతో వేరే హీరోయిన్ కోసం ప్రయత్నించారు. యాడ్ ఫిలింస్ తో ఆకట్టుకున్న మాళవిక శర్మ, హిమాలయ గర్ల్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రవితేజ సరసన నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. -
‘నేల టికెట్’కు ఫిదా టచ్
‘రాజా ది గ్రేట్’ సినిమాతో కం బ్యాక్ అయిన మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు పనుల్లో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో వెంటనే ‘సొగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జనవరి 5న సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ఓ కొత్త సంగీత దర్శకుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్‌ను ‘నేల టికెట్’ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
బంగార్రాజు నాగార్జునే
బంగార్రాజు పేరు వినగానే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ గుర్తుకురాక మానదు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ‘వాసి వాడి తస్సాదియ్యా’ అంటూ బంగార్రాజు పాత్రలో నాగ్ పల్లెటూరి సోగ్గాడిగా అలరించారు. ‘సోగ్గాడే చిన్నినాయన’కు ప్రీక్వెల్‌గా నాగార్జునతో ‘బంగార్రాజు’ సినిమాకు ప్లాన్ చేశారు కల్యాణ్ కృష్ణ. కానీ, ఇప్పుడా సినిమా ప్రస్తావన లేకపోవడంతో నాగ్ ఆ సినిమా చేయడం లేదనీ, రవితేజతో ‘బంగార్రాజు’ తీసేందుకు కల్యాణ్ రెడీ అవుతున్నారనే వార్త షికారు చేస్తోంది. రవితేజకు కథ కూడా వినిపించారట. ‘‘అసలు ఆ రూమర్ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదు. ‘బంగార్రాజు’ కథ ఒక వెర్షన్ రాశా. అది నాగ్‌సార్‌కి అంతగా నచ్చకపోవడంతో వేరేలా తయారు చేస్తున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ ‘బంగార్రాజు’ నాగార్జున సారే. రవితేజకు నేను కథ చెప్పిన విషయం వాస్తవమే. కానీ, అది వేరే కథ. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని క్లారిటీ ఇచ్చి, రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టారు. ప్రస్తుతం వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందించే పనిలో ఉన్నారు కల్యాణ్ కృష్ణ. మరి నాగార్జున, వెంకటేశ్–నాగచైతన్య, రవితేజ.. ఎవరి సినిమా ముందు సెట్స్‌పైకి వెళుతుందన్నది సస్పెన్స్. వారి డేట్స్‌ని బట్టి ఎవరితో సినిమా ముందు మొదలవుతుందో త్వరలో తెలుస్తుంది. -
సోగ్గాడిగా మాస్ మహరాజ్..?
దాదాపు రెండేళ్ల విరామం తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాడు. అంధుడిగా కనిపిస్తూనే తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా రవితేజ తీసుకున్న జాగ్రత్తలు మంచి విజయాన్ని అందించాయి. అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు ఈ మాస్ హీరో. ఇప్పటికే టచ్ చేసి చూడు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ, పలువురు దర్శకులతోజరుపుతున్నాడు. రవితేజ రవితేజ నెక్ట్స్ సినిమాల లిస్ట్ లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరిందన్న ప్రచారం జరుగుతోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో దర్శకుడి మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనకు ప్రీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. బంగార్రాజు పేరుతో నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ ఓ సినిమా తెరకెక్కించాలని భావించాడు. అయితే ప్రస్తుతం నాగ్ ప్రాజెక్ట్ చేసేందుకు సుముఖంగా లేకపోవటంతో అదే కథను కొద్దిపాటి మార్పులతో రవితేజ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ వార్తలు ఫిలిం నగర్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. -
మామ అల్లుళ్ల మల్టీ స్టారర్
సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన మూడో సినిమాను కూడా అక్కినేని కాంపౌండ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. అయితే తన మూడో సినిమాను మల్టీ స్టారర్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. కళ్యాణ్ తదుపరి చిత్రం వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్ లో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో అతిథి పాత్రలో అలరించిన వెంకీ, ఈ సారి పూర్తి స్థాయి మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి వెంకటేష్ ఏ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టకపోయినా.. త్వరలోనే ఓ రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది. నాగచైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మల్టీ స్టారర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
మామ మామే... అల్లుడు అల్లుడే!
వెంకటేశ్‌కు నాగచైతన్య ఏమవుతారు? మేనల్లుడు! చైతూకి వెంకీ? మేనమామ! ఈ మామా అల్లుళ్లు ఇద్దరూ కలసి నటించిన సినిమా ‘ప్రేమమ్’. అయితే... అందులో వెంకీది అతిథి పాత్రే. కానీ, స్పెషాలిటీ ఏంటంటే.. అందులో వీళ్లిద్దరూ మామా అల్లుళ్లగానే కనిపించారు. దాంతో దగ్గుబాటి–అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ. వాళ్లను మరింత ఖుషీ చేసే మేటర్ ఏంటంటే... మరోసారి మామా–అల్లుడు కలసి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మళ్లీ తెరపై మామా అల్లుళ్లగానే కనిపించనున్నారు. అయితే... ఈసారి ఎవరూ అతిథి పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఇద్దరివీ పూర్తి స్థాయి పాత్రలే. మల్టీస్టారర్ అన్నమాట! ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ మామాఅల్లుళ్ల సినిమాకు స్క్రిప్ట్ రాస్తున్నారు. నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, చైతూతో ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ వంటి హిట్ సిన్మాలు తీసిన కల్యాణ్‌కృష్ణ ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం కథపై దర్శక–రచయితలు కసరత్తులు చేస్తున్నారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత చిత్రీకరణ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట! -
చైతూకి విలన్‌గా సీనియర్ హీరో
వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాగచైతన్య ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రారండోయ్ వేడుక చూద్దాం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. కొత్త దర్శకుడు కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో సందడి చేస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యకు ప్రతినాయకుడిగా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో విలన్‌గా నటిస్తున్న శ్రీకాంత్.. చాలా ఏళ్ల తరువాత ఓ తెలుగు సినిమాలో విలన్ రోల్‌కు ఓకె చెప్పాడు. ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ మరోసారి విలన్ రోల్లో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
'రారండోయ్.. వేడుక చూద్దాం' ఫస్ట్ లుక్స్
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. నాగార్జున హీరోగా 'సొగ్గాడే చిన్ని నాయనా' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. నాగ్ కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిపోయినా నిన్నే పెళ్లాడతా తరహాలో నాగచైతన్యకు ఈ సినిమా మెమరబుల్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించి రెండు పోస్టర్లను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలో దర్శకుడు కళ్యాన్ కృష్ణ, నిర్మాత నాగార్జునలు రెండు డిఫరెంట్ మోడల్స్‌ను సెలెక్ట్ చేయటంతో రెండు పోస్టర్లను ఒకేసారి రిలీజ్ చేశారు. నాగ్ సెలెక్ట్ చేసిన పోస్టర్లో నాగచైతన్య యాక్షన్ మోడ్‌లో కనిపిస్తుంటే.., డైరెక్టర్ సెలెక్ట్ చేసిన పోస్టర్ టైటిల్‌ను జస్టిఫై చేస్తూ పండుగ వాతావరణం కనిపించేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆడియో, సినిమా రిలీజ్ డేట్ లను త్వరలోనే వెల్లడించనున్నారు. Here we go the first look of #NC13!!the 1st one is my choice and the 2nd @kalyankrishna_k/#rarandoiVedukachudham💐 pic.twitter.com/SfK1cn2xUW — Nagarjuna Akkineni (@iamnagarjuna) 29 March 2017 -
వేడుకకు ఆహ్వానిస్తున్న నాగచైతన్య..?
ప్రేమమ్ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న నాగచైతన్య అదే జోరులో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కృష్ణమరియముత్తు దర్శకత్వంలో మరో సినిమాను సైలెంట్‌గా పూర్తి చేస్తున్నాడు. వీటిలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ 'రారాండోయ్ వేడుక చూద్దాం' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. ముందుగా ఈ టైటిల్ అఖిల్ సినిమా కోసం అని భావించినా.. ఇది నాగచైతన్య లేటెస్ట్ సినిమా కోసం రిజిస్టర్ చేయించారన్న టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా నిన్నేపెళ్లాడతా తరహా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ముందుకు నుంచే చెపుతున్నారు చిత్రాయూనిట్. అలాంటి కథకు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని.. ఈ సినిమాతో చైతన్యకు మరో బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అంటున్నారు అక్కినేని అభిమానులు. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. -
నాగ్ టైటిల్‌తో నాగచైతన్య..?
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా లాంటి బిగ్ హిట్ అందించిన కళ్యాణ్ కృష్ణ.. నాగచైతన్య కోసం నిన్నేపెళ్లాడతా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు నాగార్జున హీరోగా తెరకెక్కిన అల్లరి అల్లుడు టైటిల్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. 90లలో ఘనవిజయం సాధించిన ఈ టైటిల్ చైతన్య సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, నాగ్ కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో ఒక్కటిగా నిలిచిన హలోబ్రదర్ సినిమాలోని ప్రియరాగాలే పాటను రిమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి ఈ టైటిల్‌పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వకాపోయినా.. అక్కినేని అభిమానులు మాత్రం నాగ్ టైటిల్‌కే ఓటేస్తున్నారు. -
నాగచైతన్యతో ముగ్గురు కృష్ణులు
ప్రేమమ్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నాగచైతన్య వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ప్రేమమ్‌తో పాటు చైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో కూడా రిలీజ్‌కు రెడీగా ఉండగా మరో మూడు సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. అయితే చైతన్య చేయబోయే మూడు సినిమాలకు ముగ్గురు కృష్ణులు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ షూటింగ్‌లను పూర్తి చేసిన చైతూ, త్వరలో సొగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించనున్నాడు ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు చైతూ. ఇప్పటికే ఫైనల్ అయిన ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తొలిసారిగా ఓ సినిమా అంగీకరించాడు నాగచైతన్య. ఈ సినిమాతో కృష్ణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. -
'ఒకసారి ఇటు చూడు' అంటున్న చైతూ
సొగ్గాడే చిన్ని నాయనా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన రెండో సినిమాను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లోనే చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ మేరకు అక్కినేని నాగార్జున ప్రకటన కూడా విడుదల చేశారు. నాగాచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ముందుగా ఈ సినిమాకు నిన్నే పెళ్లాడతా అనే టైటిల్‌ను పెట్టాలని భావించినా.. ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకున్నారట. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబందించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తన తొలి సినిమా తరహాలోనే ఈ సినిమాకు కూడా రొమాంటిక్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడట దర్శకుడు కళ్యాణ్. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు 'ఒకసారి ఇటు చూడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. త్వరలోనే టైటిల్‌తో పాటు ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. -
రకుల్ కు మరో క్రేజీ ఆఫర్
తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. యువ హీరో నాగ చైతన్య సరసన రకుల్ హీరోయిన్గా నటించనుంది. నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్ హిట్ సినిమా తీసిన కల్యాణ్ కృష్ణ.. తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా చైతన్య నటించిన ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
సెప్టెంబర్ స్పెషల్ గురూ!
అఖిల్ రెండో సినిమాకి దర్శకుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెర పడింది. ‘మనం’తో అక్కినేని కుటుంబంతో పాటు అభిమానులకు మధురమైన చిత్రం అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సిసింద్రీ సినిమా చేయనున్నారు. అలాగే, ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో అక్కినేని నాగార్జునకి సూపర్ హిట్ అందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. త్వరలో ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయని నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘సెప్టెంబర్ రాక్స్ ఫర్ మి. నా స్టార్ డెరైక్టర్స్ కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య, విక్రమ్ కుమార్‌తో అఖిల్ సినిమాలు చేయబోతున్నారు. త్వరలో ఇవి సెట్స్‌కి వెళతాయి’’ అని నాగ్ పేర్కొన్నారు. కొత్త కథలను ఎంపిక చేయడంలోనూ, కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలోనూ నాగార్జున ఎప్పుడూ ఓ అడుగు ముందుంటారు. కొత్తకు పట్టం కడుతూ ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించాయి. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలు ఆ కోవలోనివే. ఈ రెండిటితో పాటు ‘ఊపిరి’తో వరుస విజయాలు సాధించిన నాగార్జున జోరుగా ‘నమో వెంకటేశాయ’లో నటిస్తున్నారు. అదే జోరు మీద కుమారుల కోసం సినిమాలు సెట్ చేసే పనిలో పడ్డారాయన. -
అక్కినేని వారసులు క్లారిటీ ఇచ్చారు
యంగ్ హీరో అఖిల్ తన రెండో సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ సినిమా రిజల్ట్‌తో ఆలోచనలో పడ్డ ఈ యువ కథానాయకుడు రెండో సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన అక్కినేని యంగ్ హీరో గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే నిర్మాణపరమైన సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. ఇదే విషయాన్ని నాగార్జున కూడా కన్ఫామ్ చేశాడు. అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని ప్రకటించిన నాగ్, నాగచైతన్య.., సొగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నాడని ప్రకటించాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. Sept rocks for me/announcing films with two of my star directors.KALYAN with NagaChaitanya//VIKRAM KUMAR with Akhil.On the floors very soon — Nagarjuna Akkineni (@iamnagarjuna) 1 September 2016 -
మరోసారి మాయ చేస్తారట..!
'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మరోసారి తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ కపుల్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఏం మాయ చేసావే సినిమా తరువాత ఆటోనగర్ సూర్యలో కలిసి నటించారు చైతు, సామ్. ఈ సినిమా విజయం సాధించకపోయినా, ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యింది. తరువాత మనం సినిమాతో మరోసారి భారీ సక్సెస్‌ను నమోదు చేశారు. ఇటీవల సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సమంతను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతూ, ప్రస్తుతం ప్రేమమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెర మీదే కాదు తెర వెనక కూడా వీరి మధ్య ఏదో ఉందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరో సినిమాలో కలిని నటించటం ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యంగ్ జనరేషన్ లో రామ్ చరణ్, కాజల్ తప్ప మరే జంట నాలుగు సినిమాల్లో కలిసి నటించలేదు. దీంతో ఈ రికార్డ్ సాధించిన రెండో జంటగా నిలిచారు చైతన్య, సమంత. -
మరో మల్టీ స్టారర్లో కింగ్
యంగ్ హీరోలు కూడా సక్సెస్ కోసం కష్టాలు పడుతుంటే సీనియర్ హీరో నాగార్జున మాత్రం వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన నాగ్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా కొత్త దనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ తన మార్క్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మరోసారి భక్తిరస ఛారిత్రక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తిరుమల వెంకటేశ్వరుడి పరమ భక్తుడైన హాథీరాం బాబాగా మరోసారి భక్తుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమా తరువాత సొగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బంగార్రాజు టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా మల్టీ స్టారర్‌గా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా సినిమా చేస్తున్న కళ్యాణ్, ఆ సినిమా పూర్తవ్వగానే నాగార్జునతో తెరకెక్కించబోయే సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. -
ఆ కాంబినేషన్లో మరో సినిమా
'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మరోసారి తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ కపుల్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఏం మాయ చేసావే సినిమా తరువాత ఆటోనగర్ సూర్యలో కలిసి నటించారు చైతు, సామ్. ఈ సినిమా విజయం సాధించకపోయినా, ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యింది. తరువాత మనం సినిమాతో మరోసారి భారీ సక్సెస్‌ను నమోదు చేశారు. ఇటీవల సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సమంతను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతూ, ప్రస్తుతం ప్రేమమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు, ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సోగ్గాడి కొడుకే హీరో నాయనా!
మొన్న సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంచలన విజయం సాధించి త్వరలో 50 కోట్ల క్లబ్లో చేరనుంది. నాగార్జున కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకునిగా పరిచయమయ్యారు. రొమాన్స్, ఫాంటసీ మిళితమైన ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో కల్యాణ్‌కృష్ణ మంచి మార్కులు కొట్టేశారు. ఆయన రెండో చిత్రం ఎవరితో చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రానికి సోగ్గాడి కొడుకే హీరో! నాగచైతన్య హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సినిమా చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణ్‌కృష్ణ చెప్పిన కథ అటు నాగార్జునకు, ఇటు నాగచైతన్యకు విపరీతంగా నచ్చేసిందట. చైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో పాటు మలయాళ ‘ప్రేమమ్’ రీమేక్ ‘మజ్ను’లో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలూ ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత కల్యాణ్ కృష్ణతో సినిమా చేయడానికి ఈ యువ హీరో ఆసక్తిగా ఉన్నారు. -
సంక్రాంతి సక్సెస్ ఈ నలుగురిదీ!
స్టార్ టాక్ దర్శకులు సుకుమార్, శ్రీవాస్, మేర్లపాక గాంధీ, కల్యాణ్‌కృష్ణ - నలుగురూ ఇప్పుడు హాట్ టాపిక్. వీళ్ళ నలుగురి సినిమాలూ ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగిన సినిమా పందెంకోళ్ళు. వివిధ హీరోల అభిమానులు, పరిశ్రమలోని వర్గాలు కత్తులు నూరుకుంటున్న టైమ్‌లో ఈ నలుగురు దర్శకులనూ ‘సాక్షి ఫ్యామిలీ’ ఒకే దగ్గర కూర్చోబెట్టి, వాళ్ళతో ముచ్చటించింది. తీసిన సినిమాలు, నటించిన హీరోలు వేరైనా, పరిశ్రమలో అందరూ ఒకటేనని నిరూపించింది. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తులైన నలుగురు దర్శకులతో ‘సాక్షి’ జరిపిన ఎక్స్‌క్లూజివ్ డబుల్ ‘డబుల్ ధమాకా’ ఇది... మీ నలుగురు దర్శకులకూ ఒకరికొకరు పరిచయమేనా? లేక ఇప్పుడే కలిశారా? శ్రీవాస్ - నాకు సుక్కు (సుకుమార్) బాగా తెలుసు. సంక్రాంతికి వచ్చిన మా ‘డిక్టేటర్’, సుక్కు ‘నాన్నకు ప్రేమతో’ పనులు ప్రసాద్ ల్యాబ్స్‌లో పక్కపక్కనే జరిగాయి. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మేర్లపాక గాంధీ, ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో దర్శకుడైన యువకుడు కల్యాణ్‌కృష్ణ గురించి విన్నాను. గాంధీ - నేను, సుకుమార్ గారు యాక్టర్ బ్రహ్మాజీ గారింట్లో ఒకసారి కలిశాం. సుకుమార్- నాకు శ్రీవాస్ గారు బాగా తెలుసు. ఇక, మా కాకినాడ అబ్బాయి కల్యాణ్‌కృష్ణను బన్నీ పార్టీలో కలిశా. ఇక, గాంధీ వాళ్ళ నాన్న గారు మేర్లపాక మురళి నవలా రచయిత కదా! ఆయన సాహిత్యంతో పరిచయముంది. మీ నలుగురిలో గాంధీ (చిత్తూరు జిల్లా) మినహా మిగిలిన ముగ్గురూ తూర్పుగోదావరి జిల్లా వాసులే? శ్రీవాస్ - అవును. మేమూ ముందు గమనించలేదు. ఇందాకే ఎవరో ఈ మాట అన్నారు. మా గోదావరి జిల్లాల్లో ఉండే ఆప్యాయతలు, వెటకారాలు అన్నీ మాలో ఉన్నాయి. ఇంకో మాటేమిటంటే, మీ నలుగురూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవాళ్ళు. పల్లె సంస్కృతికి ప్రతిబింబమైన సంక్రాంతికే మీ నలుగురి సినిమాలూ రావడం... శ్రీవాస్ - యాదృచ్ఛికమే అయినా ఆనందంగా ఉంది. సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? శ్రీవాస్ - మా ఊరు సీతానగరంలో రామదుర్గా పిక్చర్ ప్యాలెస్ అనే సినిమా హాలుండేది. సంక్రాంతి అనగానే... సినిమాలు, హాలులో జనం కొట్టే విజిల్స్ గుర్తొస్తాయి. బాలయ్య లాంటి మాస్ హీరో దొరకడంతో, అనుకోకుండా సరిగ్గా అలాంటి సినిమానే తీశా. సుకుమార్ - ఆ... ఇదీ కారణం! (నవ్వులు...) గాంధీ - మాది తిరుపతి దగ్గర రేణిగుంట. నాకు కూడా సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి సినిమాలే. ఫ్రెండ్స్‌తో కలసి రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళి, అక్కడ సినిమాలు చూసేవాళ్ళం. ‘నరసింహనాయుడు’ లాంటి సినిమాలు సంక్రాంతికి చూసి, ఎంజాయ్ చేసిన రోజులు మామూలువి కావు. సుకుమార్ గారూ! మరి, మీరు చెప్పండి? సుకుమార్ - ముందుగా తమ్ముడు కల్యాణ్‌కృష్ణ చెబుతాడు. కల్యాణ్‌కృష్ణ - మా అమ్మమ్మ గారిదీ, నాయనమ్మ గారిదీ పల్లెటూరే. అందుకే, సంక్రాంతి అంటే - అందరం కలవడం, ఆనందంగా గడపడం అలవాటు. బేసిక్‌గా నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టం. మా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా అలాగే వచ్చింది. అందరి మూలాలూ గ్రామాల నుంచే మొదలవుతాయి. అందుకే, మా సినిమా ఎక్కువగా కనెక్ట్ అయింది. సుకుమార్ - (సరదాగా... బుంగమూతి పెడుతూ...) మా సినిమాలు కూడా కనెక్టయ్యాయండీ... (నవ్వులు...) శ్రీవాస్ - (నవ్వేస్తూ...) {పతిసారి లాగా కాకుండా ఈసారి విశేషం ఏమిటంటే, సంక్రాంతి సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. ఈసారి ‘డిక్టేటర్’ ఫుల్ మాస్... ‘నాన్నకు ప్రేమతో క్లాస్ నిండిన మాస్... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్యామిలీస్... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమాలపరంగా ఈ మధ్య ఇంత విభిన్నమైన సంక్రాంతి మరొకటి రాలేదేమో! శ్రీవాస్ - మేమందరం కలసి ఒక మాట చెబుతాం. (మిగిలినవాళ్ళ వైపు తిరిగి...) మీరు కూడా ఓటేయాలి. ఇలా వివిధ రకాలైన సినిమాలు ఒకే సీజన్లో రావడం ప్రేక్షకుల అదృష్టం. మా దురదృష్టం. ఎందుకంటే, సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల నుంచి తెలుగు సినిమాకు రూ. 150 కోట్లు వసూలవుతాయనుకుంటే, అదే మొత్తాన్ని నాలుగు సినిమాలూ పంచుకోవాల్సి వచ్చింది. నాలుగు సినిమాలొచ్చాయి కదా అని ఎక్స్ట్రా ఎమౌంట్ ఎక్కడ నుంచీ రాదు కదా! సినిమాల కోసం ఎంత ఖర్చు చేయాలని జనం ప్రిపేర్ అయ్యారో, అంతే ఖర్చు చేస్తారు. రెండు సినిమాలు రిలీజైతే, ఇదే మొత్తం ఆ రెండిటికీ వచ్చేది. సుకుమార్ - కానీ, నాలుగు రిలీజైతే నాలుగూ సక్సెస్ అనిపించుకోవడం విశేషం. నిజంగానే ఆనందించాల్సిన విషయం. ఎక్కువ మందిని సినిమా హాలులోకి ఆకర్షించాం. శ్రీవాస్ - ఒక్కోసారి రాజకీయాల లాంటివి ఎక్కువుంటాయి. వాటన్నిటి నుంచి పక్కకు తెచ్చి, సినిమా హాలులో కూర్చోబెట్టాం. సుకుమార్ - (ఛలోక్తిగా...) జనమంతా సినిమాల హడావిడిలో మునిగిపోయి, హాళ్ళలో ఉండిపోవడం వల్ల బయట క్రైమ్ రేటు బాగా తగ్గింది. అందుకు, పోలీసులతో సహా అందరూ మా సినిమా వాళ్ళను అభినందించాలి. (నవ్వులు...) శ్రీవాస్ - నిజం చెప్పాలంటే, ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాలు తీసేవాళ్ళూ అవసరం. ఇలా డిఫరెంట్ జానర్స్‌లో తీసేవాళ్ళుంటేనే, ప్రేక్షకులకూ బాగుంటుంది. ఇండస్ట్రీకీ బాగుంటుంది. అన్ని ఒకటే రకంగా ఉంటే చూడలేరు, చూడరు. కల్యాణ్‌కృష్ణ - అవును. అందరం అన్నీ చేయాలి. శ్రీవాస్ - గాంధీని కేవలం ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడనీ, కల్యాణ్‌కృష్ణను ఫ్యామిలీ చిత్రాల దర్శకుడనీ అనుకోనక్కర లేదు. కల్యాణ్ లైఫ్ అంతా ఇంతా ఇలాంటి సినిమాలే చేస్తూ కూర్చోరు కదా! రేపు అఖిల్‌తో ఒక క్యూట్ లవ్‌స్టోరీ చేయాల్సి వస్తే, చేస్తారు. అలాగే, గాంధీ ఒక మాస్ తరహా చిత్రం చేయాల్సి వస్తే చేస్తారు. నన్నడిగితే, అసలు డెరైక్టర్స్ ఎప్పుడూ ఒకే రకం సినిమాలు తీయాలని అనుకోరు. నా సంగతే చూస్తే, ‘లౌక్యం’ మంచి హిలేరియస్ కామెడీ ఉండే సినిమా. ఆ వెంటనే బాలయ్యబాబుతో సినిమా అనగానే ‘డిక్టేటర్’ లాంటి మాస్ స్టైల్ యాక్షన్ ఫిల్మ్ చేశాను కదా! సుకుమార్ - అవును. నేను ‘లౌక్యం’ చూశాను. చాలా క్లాస్‌గా ఉంటుంది. మేకింగ్ కూడా బాగుంటుంది. గమనిస్తే మీ నలుగురు దర్శకులకూ రచనా నేపథ్యం ఉంది. సుకుమార్, కల్యాణ్కృష్ణలైతే... మొదలైందే రచయితలుగా! దాని వల్ల సినిమాకు ఎంత ఉపయోగపడింది? శ్రీవాస్ - రైటరే దర్శకుడు కావడం వల్ల ఉపయోగమే. ఉదాహరణకు దాసరి గారు. ఇక, మా గురువు గారు కె. రాఘవేంద్రరావు రైటర్ కాకపోయినా, కథను అల్లుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. పెద్ద ఎన్టీయార్‌తో ‘అడవిరాముడు’ గురించి ఆయన చెబితే ఆశ్చర్యపోయా. ఎన్టీయార్ అప్పటి దాకా చేయని నేపథ్యంలో సినిమా అయితే బాగుంటుందని అటవీ నేపథ్యం ఎంచుకున్నారు. దానికి తగ్గట్లే హీరోను ఫారెస్ట్ ఆఫీసర్‌ను చేశారు. కానీ, ఆయన ఫలానా అని ముందే అది చెప్పేస్తే, డ్యూయెట్లకి కుదరదు కాబట్టి, ఆ సంగతి ఇంటర్వెల్‌కి చెబుదామనుకున్నారు. ఒక రైటర్ కాకపోయినా, కమర్షియల్ దర్శకుడు ఎలా ఆలోచించి, కథ అల్లుకోవాలో చెప్పడానికి అంతకు మించి ఇంక ఉదాహరణేం కావాలి! కానీ, ఈ మధ్య దర్శక - రచయితలు కూడా ఇతరుల స్క్రిప్ట్‌ల మీద ఆధారపడడం కూడా జరుగుతోంది! మరి, మీ రైటింగ్ స్కిల్స్ వృథా అవుతున్నట్లేగా? శ్రీవాస్ - అలా కాదు. గతంలో ‘లక్ష్యం’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రాలకు నేనే కథలు రాసుకున్నా. కానీ, మనమే కథ రాసుకొని, స్క్రిప్ట్ చేసుకోవాలంటే దానికి ఆరు నెలల నుంచి ఏడాది దాకా పడుతుంది. ఒక సినిమా అయిపోయిన వెంటనే, దాని మీద వచ్చిన విమర్శలు, రివ్యూల్లో పేర్కొన్న తప్పొప్పుల్ని అర్థం చేసుకొని, మళ్ళీ అవి జరగకుండా ఉండేలా కొత్త సినిమా స్క్రిప్ట్‌కి కూర్చోవాలి. ఇలా కొత్త సినిమా ఏమిటనేది - ఆలోచించుకోవడానికే 4 నెలల టైమ్ పడుతుంది. ఒక లైన్ అనుకొని, ఏ హీరో దగ్గరకు వెళ్ళినా, అప్పటికే అతను కనీసం రెండు సినిమాలు చేస్తూ ఉండి ఉంటాడు. దాంతో, మళ్ళీ వెయిటింగ్. అందుకే, దర్శకులైన మేము ఎక్కువగా బయటివారి కథలు తీసుకొని, సినిమాకు తగ్గట్లు తీర్చిదిద్దుకుంటాం. కానీ, బయటివాళ్ళ కథను జడ్జ్ చేయడానికి కూడా దర్శకుడికి రైటింగ్ స్కిల్స్ కావాల్సిందే. అది తప్పనిసరి. సుకుమార్ - ఇది కరెక్ట్. శ్రీవాస్ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. నన్నడిగితే - దర్శకుడిగా మమ్మల్ని పెట్టుకొనేది మా క్రియేషన్కి కాదు... మా జడ్జిమెంట్‌కి! ఫలానా కథ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది జడ్జ్ చేయడాన్ని బట్టి మా సక్సెస్ ఉంటుంది. ఎవరైతే, కథను సరిగ్గా జడ్జ్ చేయగలుగుతారో వాళ్ళకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ఫుల్ డెరైక్టర్ అవుతారు.గాంధీ గారూ! సంక్రాంతి బరిలో హేమాహేమీలైన ముగ్గురు పెద్ద హీరోల చిత్రాల మధ్య వస్తున్నప్పుడు దేన్ని నమ్మి, ధైర్యం చేశారు? మేర్లపాక గాంధీ - కంటెంట్‌ను నమ్ముకున్నా. వినోదంతో సాగే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కథతో అందరూ కనెక్ట్ అవుతారనుకున్నాను. అనుకున్నట్లుగానే ఇవాళ చాలామంది కనెక్ట్ అయినట్లు బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ అయింది. కల్యాణ్‌కృష్ణ గారూ! మొదటి మూడు సినిమాలూ రిలీజైపోయాక, ఆఖరున జనవరి 15న మీ ‘సోగ్గాడి చిన్ని నాయనా’ వస్తుంటే, మీరు ఏమైనా టెన్షన్ ఫీలయ్యారా? సినిమా రిజల్ట్ ఎప్పుడు తెలిసింది? కల్యాణ్‌కృష్ణ - రిలీజ్‌కు ముందు నుంచి గట్టి నమ్మకం ఉంది. నాగార్జున గారు తన ఫ్రెండ్స్‌కీ, మరికొందరికీ షో వేశారు. చూసినవాళ్ళ రెస్పాన్స్ చూశాక, ‘తప్పు జరగదు’ అనే నమ్మకం మాకుంది. అయితే ఎంతైనా, సినిమా రిలీజ్‌కు ముందు రోజు చిన్నపాటి టెన్షనైతే ఉంది. ఇక్కడ రిలీజ్ కన్నా కొద్ది గంటల ముందే మన అర్ధరాత్రి టైమ్‌కే లండన్ లాంటి చోట్ల షోలు పడతాయి. అక్కడ నుంచే ఫస్ట్ హిట్ టాక్ వచ్చింది. ఇక్కడ కూడా షో పడ్డాక రెస్పాన్స్‌తో రిజల్ట్ తెలిసిపోయింది. శ్రీవాస్ - నిజం చెప్పాలంటే, ఇక్కడ రిలీజ్ రోజున పొద్దున్న మనం నిద్ర లేచే టైమ్‌కే ఓవర్సీస్ నుంచి సినిమా టాక్ వచ్చేస్తుంది. ఫోనుల్లో మెసేజ్‌లు, కాల్స్ వచ్చేస్తాయి. సుకుమార్ - అందుకే మేము లేట్‌గా నిద్ర లేస్తుంటాం (నవ్వులు...). ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకైతే రిలీజ్‌కు ముందు దాదాపు 500 గంటలు కంటిన్యుయస్‌గా పనిచేశా. అరగంట నిద్రపోవాలంటే, పెద్ద డిస్కషనే! మధ్య మధ్యలో 10 నిమిషాలు చిన్న కునుకు తీయడమే తప్ప, కంటి నిండా నిద్ర కూడా లేదు. రిలీజ్ ముందు రోజు రాత్రి కూడా ప్రింట్స్, కరెక్షన్స్ - అవన్నీ చూసుకోవడమే సరిపోయింది. వర్క్ అంతా పూర్తయ్యాక ఎప్పుడు పడుకున్నానో, నిద్ర లేచానో నాకే తెలీదు. తీరా నిద్ర లేచే సరికి ‘ఇవాళే సినిమా రిలీజ్ కదా’ అని గుర్తొచ్చింది. ఎన్ని ఫోన్లు వచ్చాయో తెలీదు కానీ, మెమరీ 20 మిస్డ్ కాల్స్‌కే కాబట్టి, అవి నోట్ అయి ఉన్నాయంతే! అన్ని ఫోన్లు వచ్చాయంటే, సినిమా సక్సెస్ అన్న మాట అని అర్థమైంది. శ్రీవాస్ - రిలీజ్ రోజున మన ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంటే సినిమా హిట్. మోగకపోతే, ఫట్ అన్న మాట. సుకుమార్ - ఫోన్ మోగలేదంటే, పొరపాటున సెలైంట్ మోడ్‌లో పెట్టేశామేమోనని ఒకటికి, రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిందే. (నవ్వులు...) శ్రీవాస్ - ‘డిక్టేటర్’ సినిమా విషయానికొస్తే - సహ నిర్మాతగా, దర్శకుడిగా నాది డబుల్ వర్క్. అయితే, టెన్షన్ పడలేదు. సర్వసాధారణంగా సినిమావాళ్ళందరికీ రిలీజ్ ముందు రోజున బయ్యర్లు సినిమా కొనడానికి కమిటైన డబ్బులో ఎంత తగ్గించి తెస్తారో అని టెన్షన్. ‘డిక్టేటర్’ విషయానికి వస్తే - డిస్ట్రిబ్యూటర్లుఒక వారం ముందే వచ్చి, ‘నాన్నకు ప్రేమతో’ సహా మరికొన్ని సినిమాలు కూడా ఒకేసారి వస్తున్నాయి కాబట్టి, డబ్బు అనుకున్నంత సమకూరడం లేదని చెప్పారు. వాళ్ళ ఇబ్బందులు కూడా గ్రహించి, ఈరోస్ వాళ్ళతో, బాలకృష్ణ గారితో మాట్లాడాం. ముందుగా వాళ్ళు ‘డిక్టేటర్’ కొనడానికి కమిటైన డబ్బులో నుంచి 15 శాతం డిస్కౌంట్ ఇచ్చాం. దాంతో, మాకు జరగాల్సిన వ్యాపారంలో కొన్ని కోట్లు తగ్గినా, సినిమా పరిశ్రమలో అందరి క్షేమం కోసం చూశాం. డిస్ట్రిబ్యూటర్లు కూడా మిగిలినదంతా మిస్ కాకుండా కట్టారు. పరిశ్రమ క్షేమం దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ చర్యతో బాలకృష్ణ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అనుకున్నట్లుగానే, రిలీజవగానే ‘డిక్టేటర్’ హిట్ అయింది. కానీ, సినిమా రిలీజ్ రోజున సరైన టాక్ తెలుస్తుందంటారా? శ్రీవాస్ - ఏ హీరో అభిమానులైనా తమ హీరో సినిమా రిలీజ్ రోజునే చూసేస్తారు. ఫ్యాన్స్ డెఫినెట్‌గా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. పైగా, బాలయ్యబాబు లాంటి మాస్ హీరోతో చేసే సినిమా అంటే పెద్ద ఎడ్వాంటేజ్. ఫ్యాన్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ, ముందుగా ఆనందంతో అరిచేస్తారు. ఒక్కోసారి మన సినిమా నిజంగా ఇంత హిట్టయిందా అనిపిస్తుంది. అందుకే, ఎవరమైనా సరే - ఫస్ట్ డే టాక్ నిజమా, కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటాం. మాకు డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలుసు కాబట్టి, వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతుంటాం. వాళ్ళు అబద్ధం చెప్పరు. అందుకని రెండోరోజు నుంచి నిజాలు తెలిసిపోతాయి. నాలుగైదు రోజుల తర్వాత పరిస్థితి స్పష్టంగా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే, మాటల్లో బుకాయించగలమే కానీ, డిస్ట్రిబ్యూటర్లు చూపించే అంకెలను కాదనలేం కదా! సుకుమార్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవును... అది నిజం. ఇంతకీ, మీ నలుగురికీ మిగతా ముగ్గురు దర్శకుల సినిమాల్లో, సినిమా మేకింగ్‌లో నచ్చిందేమిటి? శ్రీవాస్ - సుక్కుది చాలా డిఫరెంట్ స్టైల్. రెగ్యులర్ ఫార్మట్‌లో కాకుండా కొత్తగా తీస్తాడు. ఆ సీన్ చూసేవాళ్ళకూ, చూసేవాళ్ళకూ కొత్తదనం అనిపిస్తుంది. ‘ఆర్య’ సినిమా అలాంటి డిఫరెంట్ స్టైల్‌కు ఒక ఉదాహరణ. ఇక, మేర్లపాక గాంధీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చూశాను. అతని ఎంటర్టైన్మెంట్ టైమింగ్ బాగుంటుంది. కల్యాణ్‌కృష్ణ మా తూ.గో. జిల్లా వాడేగా! మా సహజమైన గోదావరి శైలిలో సినిమా తీస్తాడు. ‘సోగ్గాడే...’ బాగుందని విన్నా. కల్యాణ్‌కృష్ణ - సుకుమార్ గారిలో నాకు నచ్చేది ఏమిటంటే - ‘ఆర్య’లోని వన్‌సైడ్ లవ్ మొదలు ఏది చెప్పినా, తనదైన లాజిక్‌తో కన్విన్స్ చేస్తారు. శ్రీవాస్ గారి ‘లక్ష్యం’ నుంచి అన్ని సినిమాలూ చూస్తూ వచ్చా. ఎమోషన్ని ఆయన బాగా హ్యాండిల్ చేస్తారు. ఇక, గాంధీ గారి కామెడీ టైమింగ్ నాకు బాగుంటుంది. మేర్లపాక గాంధీ - నాకు శ్రీవాస్ గారి సినిమాల్లో అటు ఎంటర్టైన్మెంట్, ఇటు ఎమోషన్ - రెండూ డీల్ చేయడం బాగుంటుంది. సుకుమార్ గారు మంచి క్రియేటివ్ డెరైక్టర్. సుకుమార్ - శ్రీవాస్ సినిమాల గురించి ఇందాకే చెప్పేశాను. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ నాకు నచ్చింది. కల్యాణ్‌కృష్ణకు ఇది తొలి సినిమానే కాబట్టి, ఇంకా బాగా వృద్ధిలోకి వస్తాడు. ఇతర దర్శకుల సినిమాలు చూసినప్పుడు అలా మనమూ తీయాలన్నంత అనిపించిన సందర్భాలు? కల్యాణ్‌కృష్ణ - కొన్ని సీన్స్ చూసినప్పుడు అలా అనిపిస్తుంది. శ్రీవాస్ గారు తీసిన ‘లక్ష్యం’లో హీరో అన్న క్యారెక్టర్ జగపతిబాబును చూసినప్పుడూ, ‘ఆర్య’లో తాజ్‌మహల్ గురించి చెప్పే సీన్ లాంటివి చాలా ఇష్టం. గాంధీ - ఏ సినిమా చూసినా, ఫలానాది చాలా బాగుంది అనుకొనే సందర్భాలు చాలా ఉన్నాయి. సుకుమార్, శ్రీవాస్ గార్ల సినిమాలూ అంతే! కానీ, నాకు తెలిసింది, నేను చేయగలిగినదే చేద్దామని ఫిక్సయ్యా. కానీ, పక్కవాళ్ళ సినిమా చూసినప్పుడు ఇలాంటిది మనం తీయలేకపోయామనో, మన సినిమాయే బాగా ఆడాలనో జెలసీ ఉండదా? సుకుమార్ - సెకన్లో వెయ్యోవంతు ఒక చిన్నపాటి జెలసీ ఫీలింగ్ రావడం మానవ సహజం. క్రియేటివ్ ఫీల్డ్‌లో మరీ! (నవ్వులు...). కానీ, వెంటనే దాన్ని పాజిటివ్‌గా, ఆనందంగా మార్చుకోవాలి. మారుతుంది. శ్రీవాస్ - చాలామందికి తెలియనిదేమిటంటే, సినిమా పరిశ్రమలో నడిచేది ఒక చైన్ రియాక్షన్. మన ముందు సినిమాలు ఆడకూడదనుకొంటే, అక్కడ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ దగ్గర మన సినిమా కొనడానికి డబ్బులెక్కడ ఉంటాయి? కాబట్టి, ఆ ఎఫెక్ట్ మన సినిమా మీద పడుతుంది. కాబట్టి, ప్రతి ఒక్కరి సినిమా ఆడాలి. ఫిల్మ్‌నగర్‌లో కూర్చొని, మన హీరో, మన సినిమా ఒక్కటే గొప్ప.. మనదొక్కటే ఆడితే చాలు. అవతలివాడి సినిమా బాగోలేదు... పోవాలి అనుకుంటే, తప్పు. సుకుమార్ - అవును. ఇది చాలా మంచి లాజిక్. ప్రాక్టికల్ కూడా! శ్రీవాస్ -నిజానికి, సినిమా బిజినెస్ అనేది గుడ్డిగా ఆడే ఒక ఆట. ఇటీజ్ ఎ ఫేక్ గేమ్. ఒక పేకాట లాగా ఉంటుంది. డబ్బులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో చెప్పలేం. సుకుమార్ - ఇవాళ సంక్రాంతి రిలీజ్లు నాలుగూ సినిమాలూ ఆడుతున్నాయీ అంటే, థ్యాంక్స్ టు ‘బాహుబలి’. ఆ సినిమా కొన్నేళ్ళుగా బయటకు రాని జనాన్ని ఇళ్ళల్లో నుంచి సినిమా హాలుకి మళ్ళీ రప్పించడం మొదలుపెట్టింది. గాంధీ - ఇవాళ నిజంగానే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. శ్రీవాస్ - సినిమాలు చూసి 15 - 20 ఏళ్ళయిన అత్తయ్యలు, మామయ్యలు కూడా ఇప్పుడు మళ్ళీ థియేటర్ల వైపు వస్తున్నారు. సినిమా బాగుందని వింటే, వచ్చి చూస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ - అందుకే, ఈసారి కలెక్షన్స్ కూడా బాగున్నాయి. శ్రీవాస్ - ఏమైనా, పక్కవాడి సినిమా ఫెయిలవ్వాలి, మనం పాసవ్వాలి అనుకుంటే, వాడికి 34 మార్కులొస్తాయి. మనకు 35 మార్కులొస్తాయి. పక్కవాడికి 99 మార్కులు రావాలి, మనం అంతకన్నా ఇంకొద్దిగా బాగుండాలి అనుకుంటే, మనకు 100 మార్కులొస్తాయి. అప్పుడే అందరం బాగుంటాం. సుకుమార్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవును. బ్రహ్మాండంగా చెప్పారు. మీ మీద ప్రభావం చూపిన సినిమాలు, దర్శకులంటే? శ్రీవాస్ - నా మీద కె. రాఘవేంద్రరావు గారి ప్రభావం చాలా ఉంది. ఆయన లాగా అన్ని రకాల కోవల సినిమాలూ ట్రై చేయాలి, ఎలాంటివైనా చేయగలడనిపించుకోవాలని కోరిక. ప్రభావం చూపిన సినిమాలంటే, తమిళ దర్శకుడు శంకర్ సినిమాలు బాగా ఇష్టం. హిందీలో ‘లగాన్’. సుకుమార్ - {పత్యేకించి కొన్ని సినిమాలని చెప్పడం కష్టం. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు చూస్తూ ఉండేసరికి, రోజుకో సినిమా ఇష్టమై, ప్రభావం మారిపోతుంటుంది. అయితే, బేసిగ్గా రామ్‌గోపాల్ వర్మ, కృష్ణవంశీ, మణిరత్నం అంటే నాకు బాగా ఇష్టం. మరీ ముఖ్యంగా, వర్మ గారి సినిమాలంటే! నేను టీచింగ్ వదిలేసి, దర్శకత్వం వైపు వచ్చేయాలని నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా మణిరత్నం ‘గీతాంజలి’. కల్యాణ్‌కృష్ణ - ‘సీతారామయ్య గారి మనవరాలు’ నుంచి ‘నరసింహనాయుడు’ దాకా చాలా సినిమాలు ఇష్టం. సహజంగానే వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. దర్శకుల్లో నాకు కృష్ణవంశీ గారు బాగా ఇష్టం. మేర్లపాక గాంధీ - నాకు జంధ్యాల గారు ఇష్టం. ఆయన అన్ని సినిమాలూ చూశా. బేసిక్‌గా ఆయన పాత్రల క్యారెక్టరైజేషన్ నాకు ఇష్టం. సంక్రాంతి అంటే ఆడవాళ్ళ ముగ్గులు, గొబ్బెమ్మలు, అలంకారాలు, పిండివంటలు - అన్నీ! కానీ, సినిమాలకొచ్చేసరికి ఎంతసేపటికీ, హీరోల సినిమాలేనా? హీరోయిన్ల సినిమాలతో సంక్రాంతి సీజన్ చేయొచ్చుగా? శ్రీవాస్ - (నవ్వేస్తూ...) హీరోలందరూ ఒక ఏడాది సెలవు తీసేసుకుంటే, అప్పుడు హీరోయిన్ల సినిమాలే చేయొచ్చు. సుకుమార్ - మాకైతే, జెండర్ తేడా లేదు. ఆడా, మగా ఒకటే! (నవ్వులు...). గతంలో విజయశాంతి గారి లాంటివాళ్ళకు ప్రత్యేక మార్కెట్ ఉండేది. ఇప్పుడు ఎందుకనో చాలా కారణాల వల్ల హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అన్ని రావడం లేదు. అలాంటి సినిమాలతో సంక్రాంతి వస్తే... అదో వెరైటీ. ఇంతకీ మీరు మీ సినిమాలు కాకుండా, సంక్రాంతికొచ్చిన ఇతర రిలీజ్లు చూశారా? శ్రీవాస్ - అసలు మీరు మా సినిమాలన్నీ చూశారా? సుకుమార్ - అవునవును. చూశారా? ‘సాక్షి’ - (నవ్వుతూ...) చూడకుండా ఎలా ఉంటాం! చూశాం. రివ్యూలు రాశాం. ఇంటర్వ్యూలు చేశాం, చేస్తున్నాం. శ్రీవాస్ - (నవ్వేస్తూ...) కానీ, చాలామంది చూడకుండానే, ట్రైలర్లు చూసేసి, ‘హీరో స్టైల్ బాగుంది’ లాంటి మాటలతో మసిపూసి మారేడుకాయచేసి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేస్తుంటారు. కానీ, నా మటుకు నేను సంక్రాంతి రిలీజ్‌లన్నీ ఇంకా చూడలేదు. ఎక్కడండీ! ఇప్పటి దాకా మా సినిమాల పనులు, రిలీజ్ హంగామా, ఇప్పుడేమో ప్రమోషన్ హడావిడిలో ఉన్నాం. కొద్దిగా తీరిక దొరికిన తరువాత ఇప్పుడిక వెళ్ళాలి. సుకుమార్, మేర్లపాక గాంధీ, కల్యాణ్‌కృష్ణ - మా పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. శ్రీవాస్, సుకుమార్- ఇప్పుడిక ఫ్యామిలీలు తీసుకొని, మిగిలిన సినిమాలకు కూడా వెళతాం. మేర్లపాక గాంధీ - నేను మా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రిలీజ్ ముందు రోజు బాగా టెన్షన్ పడ్డా. మా కన్నా ఒక రోజు ముందే జనవరి 13న ‘నాన్నకు ప్రేమతో’ వచ్చేసింది. పైగా, నేను సుకుమార్ గారి ఫ్యాన్‌ని. ఆ మధ్య ఆయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ‘నాన్నకు ప్రేమతో’కి వెళుతూ, నన్ను రమ్మన్నారు. ‘నేను రానురా బాబూ! ఈ టెన్షన్లో సుకుమార్ గారి సినిమా చూశానంటే, నాకిక నా సినిమా నచ్చదు. నా సినిమా రిలీజయ్యాక, కొంచెం ఆగి చూస్తాను’ అని చెప్పాను. ఇప్పటి వరకూ చూడడం కుదరలేదు. ఇప్పుడు వెళతాను. సుకుమార్ - అవును. ‘కుమారి 21 ఎఫ్’ బాగుందని గాంధీ నాకు చాలా మంచి ఎస్.ఎం.ఎస్. పెట్టాడు. శ్రీవాస్ - మేము ఇతర సంక్రాంతి రిలీజ్లు చూడలేదన్న మాటే కానీ, చూసినదాని కన్నా చాలా ఎక్కువే విన్నాం. (నవ్వులు...) ఇంతకీ ఈ సంక్రాంతి మీకు ఏమిచ్చింది? శ్రీవాస్, గాంధీ, కల్యాణ్‌కృష్ణ, సుకుమార్ - (నలుగురూ ఒక్కసారిగా...) సక్సెస్ ఇచ్చింది. సుకుమార్ - మీకు మాత్రం మా నలుగురి నుంచి మంచి ఇంటర్వ్యూ ఇచ్చింది (నవ్వులు...) ఇంతకీ, ఫైనల్లీ ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో... ‘...అండ్ ది అవార్డ్ గోస్ టు...’? శ్రీవాస్ - (వెంటనే అందుకుంటూ...) ఆడియన్స్! అన్ని సినిమాలనూ ప్రేక్షకులు చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ టేస్ట్‌ను బట్టి, నాలుగు కోవల సినిమాలనూ ఆదరించారు. పరిశ్రమ పచ్చగా కళకళలాడడానికి ఇంతకన్నా ఏం కావాలి! సుకుమార్ - ఈ మాట నిజం. శ్రీవాస్ చెప్పినదానికే మా ఓటు (నవ్వులు...). గాంధీ, కల్యాణ్‌కృష్ణ - అవునవును. నిజం. చివరిగా మీ నలుగురూ కలసి ఒక్కొక్కరూ ఒక్కో భాగం చొప్పున గొలుసుకట్టుగా ఒక సినిమా స్టోరీ ఇప్పటికిప్పుడు అల్లేసి, మా ‘సాక్షి’ పాఠకుల కోసం చెబుతారా? శ్రీవాస్ - (నవ్వేస్తూ...) ఏదో ఎందుకు... ఇదే చెబుతాం... కల్యాణ్ నువ్వు స్టార్ట్ చెయ్యి! ‘సాక్షి ఇంటర్వ్యూకు వచ్చాం’ అని చెప్పు. (కల్యాణ్ నవ్వుతూ... అలాగే చెప్పారు). సుక్కు గారూ! మీరేమో... సుకుమార్ - భలే ఇంటర్వ్యూ మొదలైంది... మధ్యలో రెండు టీలు తాగాం... (నవ్వులు...) శ్రీవాస్ - పత్రికల్లో రివ్యూల ఫక్కీలో చెప్పాలంటే... మధ్యలో కాస్తంత నిదానించినా, మంచి ఇంటర్వ్యూలో భాగమై, హ్యాపీగా ఫీలయ్యాం. గాంధీ గారూ! క్లైమాక్స్ మీదే! గాంధీ - వదిలేస్తే... ఇంటికి వెళ్ళిపోతాం. (నవ్వులు... నలుగురూ దర్శకులూ ఆత్మీయంగా కౌగిలించుకుంటూ, సెల్ఫీ దిగారు). - రెంటాల జయదేవ -
సోగ్గాడే చిన్నినాయనా
నాగార్జున సోగ్గాడిగా, అమాయకుడిగా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ ఇటీవల మైసూర్లో జరిగింది. దాంతో షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. నిర్మాత పి. రామ్మోహన్ ఇచ్చిన స్టోరీ లైన్‌ను కల్యాణ్ కృష్ణ బాగా డెవలప్ చేశాడనీ, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదనీ నాగార్జున చెప్పారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా నటించారు.