Sharwanand as Chiranjeevi's son in Bro Daddy movie - Sakshi
Sakshi News home page

Chiranjeevi : చిరంజీవికి కుమారుడిగా 'రామ్‌ చరణ్‌' క్లోజ్‌ ఫ్రెండ్‌

Published Fri, Aug 4 2023 9:04 AM | Last Updated on Fri, Aug 4 2023 9:17 AM

Sharwanand Role Play Son Of Chiranjeevi In Bro Daddy Movie - Sakshi

టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలకు కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి వరుసుగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా విజయం ఆయనలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇదే జోష్‌లో ప్రస్తుతం ఆయన నటించిన 'భోళాశంకర్'​ విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే  చిరంజీవి మరో సినిమాను లైన్‌లో పెట్టారు.

నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు వంటి చిత్రాలను రూపొందించిన కల్యాణ్​ కృష్ణ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీకి ఆయన కమిట్ అయ్యారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బ్రో డాడీ'ని రీమేక్‌ చేసేందుకు చిరు గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించబోతోంది.  ఈ సినిమాలో ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ త్రిష ఆయనకు జోడీగా కనిపించనుంది. 

వారిద్దరికి గోల్డెన్‌  ఛాన్స్​   
ఈ సినిమా కోసం క్రేజీ కాంబినేషన్‌ ఏర్పాటు చేసే పనిలో దర్శకుడు కాల్యాణ్‌ కృష్ణ ఉన్నారు. సుమారు 23 ఏళ్ల తర్వాత చిరంజీవితో త్రిష మళ్లీ జత కట్టనుంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. మరోవైపు చిరు కొడుకు పాత్ర కోసం ముందుగా సిద్ధు జొన్నలగడ్డ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న దానిపై ఎన్నో  చర్చలు జరిగాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్‌)

ఈ నేపథ్యంలోనే కొందరు హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ చివరకు రామ్ చరణ్ ఫ్రెండ్ శర్వానంద్‌‌ను చిరంజీవి ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. శర్వాకు జోడీగా యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీలను ఫిక్స్‌ చేశారని టాక్‌. అలా వారిద్దరూ చిరుతో నటించేందుకు గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేశారు. అలా చిరంజీవి-త్రిషలకు  కొడుకుగా శర్వానంద్‌ నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చిరు బర్త్‌డే రోజు (ఆగష్టు 22)న ప్రకటించనున్నారు.

బ్రో డాడీ రీమేక్​
ఇక బ్రో డాడీ సినిమా విషయానికొస్తే కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. కల్యాణి ప్రియదర్శి, మీనా, మోహన్ లాల్ తదితరులు నటించారు. ఈ మూవీ స్టోరీ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. పైగా చిరంజీవి కూడా కొత్త కథలతో ప్రయోగాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ చేసిన ఆయన.. ప్రస్తుతం విడుదల కానున్న భోళా శంకర్ కూడా​ 'వేదాళం' సినిమాకు రీమేక్‌ అని తెలిసిందే.

(ఇదీ చదవండి: విజయ్‌ సేతుపతి సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ రెడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement