Director Kalyan Krishna Shocking Comments on Naga Chaitanya Daksha Viral Video - Sakshi
Sakshi News home page

Director Kalyan Krishna: చై-దక్షల వీడియోపై డైరెక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌, చై బంగారం, ఇదంతా హీరోయిన్‌ వల్లే..

Published Mon, Jan 17 2022 4:45 PM | Last Updated on Mon, Jan 17 2022 5:04 PM

Kalyan Krishna Shocking Comments On Naga Chaitanya And Daksha Nagarkar Viral Video - Sakshi

నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం​ ‘బంగార్రాజు’ ఈవెంట్‌లో నాగచైతన్య, నటి దక్ష వీడయో నెట్టింట చర్చనీయాంశమైంది. స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుంటే చై, హీరోయిన్‌ దక్ష వైపు చూడగా.. ఆమె కొట్టెగా కనుబొమ్మలు ఎగిరేయడంతో చై సిగ్గుపడిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తూ వైరల్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. బంగార్రాజు మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో మూవీ సెక్సెస్‌ మీట్‌లో దర్శకడు కల్యాణ్‌ కృష్ణ ఈ వీడియోపై స్పందించాడు.

చదవండి: ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్‌ ట్వీట్‌ వైరల్‌

సెట్‌లో నాగచైతన్య ఎలా ఉండేవాడు, స్వభావం గురించి వివరిస్తూ ఈ వైరల్‌ వీడియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా దక్ష వల్లనే జరిగిందంటూ నటివైపు చూస్తూ అన్నాడు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. ‘బెసిగ్గా నాగచైతన్య చాలా సిగ్గు, మోహమటస్తుడు. అతడికి ఎంతటి సిగ్గు అంటే దానికి ఉదహరణ ఇటీవల వైరల్‌ అయిన వీడియోను ఉదాహరణ. నాగ్‌ సార్‌ మాట్లాడుతుంటే ఏదో సౌండ్‌ వినిపంచడంతో వెనక్కి తిరిగాడు. దీంతో దక్ష అతడి చూసి కళ్లు ఎగిరేసింది. దానికే చై సిగ్గుపడ్డాడు. ఆయన స్వభావమే అంతా. దేనికైన సిగ్గు పడతాడు. ఇదంతా దక్ష వల్లే జరిగింది. చైతన్యది ఏం లేదు, అంతా నువ్వే చేశావు’ అంటూ హీరోయిన్‌ వైపు చూస్తూ అన్నాడు.

చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన చాన్స్‌ కొట్టేసిన రష్మిక!

ఇలా చై, దక్షల వైరల్‌ వీడియోపై దర్శకడు కల్యాణ్‌ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సందర్భంగ కల్యాణ్‌ కృష్ణ, నాగ చైతన్యపై ప్రశంసలు కురిపించాడు. ‘చై బంగారం. చైతూని అందరూ బంగారం ఎందుకు అని అంటారో ఆయనతో పని చేశాక తెలుస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను చేశాను. ఇప్పుడు బంగార్రాజు చేశాను. 24 కారెట్స్ కాస్త 48 కారెట్స్ అయింది. ఈ నాలుగేళ్లలో అతనిలో చాలా మార్పులు వచ్చాయి. మాట్లాడే పద్దతి, నటన, మెచ్యూరిటీలో మార్పులు వచ్చాయి. చైలో ఉన్న క్లారిటీ మనకు పది శాతం ఉంటే.. హ్యాపీగా బతికేయోచ్చు. ఈ సినిమా వల్ల ప్రతీ రోజు సెట్‌లో కలిశాం. చై సైలెంట్ అని అనిపిస్తుంది. కానీ అంత సైలెంట్ కాదు. ఓపెన్ అప్ ఎంజాయ్ చేస్తే నవ్వు ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంత వరకు రాముడి పాత్రలు చేస్తే ఇప్పుడు చేసింది కృష్ణుడు కారెక్టర్.

చదవండి: నా జిమ్‌ ట్రైనర్‌ టార్చర్‌ చేస్తుంటాడు, నేను ఆ చాన్స్‌ మిస్సయ్యా: రష్మిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement