మరో మల్టీ స్టారర్లో కింగ్
మరో మల్టీ స్టారర్లో కింగ్
Published Tue, Apr 12 2016 10:56 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
యంగ్ హీరోలు కూడా సక్సెస్ కోసం కష్టాలు పడుతుంటే సీనియర్ హీరో నాగార్జున మాత్రం వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన నాగ్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా కొత్త దనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ తన మార్క్ కంటిన్యూ చేస్తున్నాడు.
ప్రస్తుతం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మరోసారి భక్తిరస ఛారిత్రక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తిరుమల వెంకటేశ్వరుడి పరమ భక్తుడైన హాథీరాం బాబాగా మరోసారి భక్తుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమా తరువాత సొగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బంగార్రాజు టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా మల్టీ స్టారర్గా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా సినిమా చేస్తున్న కళ్యాణ్, ఆ సినిమా పూర్తవ్వగానే నాగార్జునతో తెరకెక్కించబోయే సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.
Advertisement
Advertisement