
Bangarraju Movie Success Meet At Annapurna Studios In Hyderabad: బంగార్రాజు సినిమా చూశాక అమల ఇంటికి రాగానే అమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసిందని కింగ్ నాగార్జున తెలిపారు. అక్కినేని తండ్రి కొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి విజయంతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం (జనవరి 15)న బంగార్రాజు చిత్రబృందం అన్నపూర్ణ స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగ చైతన్య, కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ జునైద్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
'జనవరి 14 అనేది మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. ప్రతి సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని నాన్నాగారు అంటుండేవారు. అలాగే ప్రయత్నిస్తున్నాం. బంగార్రాజుకు ఆంధ్ర, తెలంగాణ, ఓవర్‌సీస్ నుంచి కలిపి ఒక్క రోజులోనే రూ. 17.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ సినిమా చూశాకా పెద్ద బంగార్రాజు పాత్ర ఎక్కువగా ఉందని అంటున్నారు. అది పాత్రపరంగా డైరెక్టర్ డిజైన్ చేసిందే. సినిమా చూశాక అమల ఇంటికి రాగానే ఆమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసింది. అవి ఆనందంతో కూడిన కన్నీళ్లు. వారు మనల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పింది. వారు మా వెనక ఉన్నారనే ఫీలింగ్‌ను వ్యక్తం చేసింది. ఇదే అభిప్రాయాన్ని చాలామంది వారి అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, నాన్నలను గుర్తుచేసుకున్నామని చెప్పారు. ఈ సినిమాకు మరో సీక్వెల్‌ను ఇప్పుడే ప్లాన్ చేయలేం.' అని నాగార్జున వెల్లడించారు.
నాగ చైతన్య మాట్లాడుతూ బంగార్రాజు సినిమాలో చేయడం నాకు సవాల్‌గా అనిపించింది. గ్రామీణ నేపథ్యం, ఎనర్జిటిక్ పాత్ర ఇంతవరకూ చేయలేదు. ఇందుకు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ చాలా సపోర్ట్ చేశాడు. ఆయనకు ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు. కథ విన్నాక ఆయన చెప్పినట్లు చేయడమే. షూటింగ్‌లో నాన్నగారు నన్ను డామినేట్ చేశారనే ఫీలింగ్ ఒకసారి కలిగింది. అది ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాను. అని పేర్కొన్నాడు. 'పండుగ సందర్భంగా రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయడం మాకు బగా కలిసివచ్చింది. నాగార్జునతోపాటు టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడి పనిచేశారు. సంగీతం దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలకు తగిన ట్యూన్స్ ఇచ్చి ఆడియోకు మరింత క్రేజ్ వచ్చేలా చేశాడు.' అని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు. కథ ప్రకారం వీఎఫ్‌ఎక్స్ చేశానన్నారు జునైద్. కథకు కావాల్సిన అన్ని అంశాలను డైరెక్టర్‌తో చర్చించి చేయడం వల్లే గ్రాఫిక్ విజువల్స్‌కు మంచి పేరు వచ్చిందన్నారు.
ఇదీ చదవండి: బంగార్రాజు మూవీ ఎలా ఉందంటే..
Comments
Please login to add a commentAdd a comment