
Naga Chaitanya And Daksha Cute Expressions Video In Bangarraju Event: నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. 'సోగ్గాడే చిన్నినాయనా' కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం గత రాత్రి(సోమవారం) మ్యూజికల్ నైట్స్ అనే ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుండగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.
మ్యూజిక్ గురించి అనూప్ రూబెన్స్‌ని నాగార్జున ప్రశంసిస్తుంటే.. సడెన్‌గా నాగ చైతన్య వెనక్కి తిరిగి హీరోయిన్ దక్ష నాగర్కర్ వైపు చూశాడు. దీంతో ఆమె కూడా కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా నవ్వింది. దీంతో చైతూ కూడా సిగ్గుపడిపోయాడు. దీనికి సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒక్కోసారి సడెన్ ఇన్సిడెంట్స్ కూడా క్యూట్‌గా ఉంటాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టిలతో పాటు 8మంది హీరోయిన్లు సందడి చేయనున్న విషయం తెలిసిందే.
• Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT
— ChayAkkineni ™ 🏹 (@massChayCults) January 10, 2022