
ఇటీవలి కాలంలో హీరో నాగ చైతన్య పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. సమంతతో విడాకుల అనంతరం సినిమాల పరంగా యమ స్పీడుతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన బంగార్రాజు చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. అయితే సినిమాల కంటే కూడా వైరల్ వీడియోలతోనే చై పేరు ఈ మధ్యకాలంలో తెగ ట్రెండింగ్‌లో నిలుస్తుంది.
ఇంతకుముందు బంగార్రాజు ప్రమోషన్స్‌లో హీరోయిన్ దక్ష కొంటె చూపులకు చైతూ సిగ్గుపడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన బంగార్రాజు సక్సెస్ మీట్‌లో నాగార్జున స్టేజ్‌పై మాట్లాడుతుండగానే కృతిశెట్టితో చై మాటలు కలిపాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చిలిపిగా నవ్వుకోవడం ప్రేక్షకుల కంట పడింది. ఇంకేముందు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
— ₳ ₭ 🦋 (@itsmeGAK) January 18, 2022
Comments
Please login to add a commentAdd a comment