Bigg Boss 5 Telugu Lahari Shari Interview With Bangarraju Team - Sakshi
Sakshi News home page

Bangarraju: నాగార్జునను ఇంటర్వ్యూ చేసిన బిగ్‌బాస్‌ 'అర్జున్‌రెడ్డి'

Published Sun, Jan 9 2022 8:24 PM | Last Updated on Mon, Jan 10 2022 8:49 AM

Bigg Boss Fame Lahari Interview With Bangarraju Team - Sakshi

Bigg Boss Fame Lahari Interview With Bangarraju Team: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా సుపరిచితం అయిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని ఈ అమ్మడికి బిగ్‌బాస్‌ షోతో బోలెడంత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిన ఈ బ్యూటీ తాజాగా కింగ్‌ నాగార్జున, నాగా చైతన్యలతో కలిసి ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణించింది.

బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇందులో భాగంగా తమను ప్రైవేట్‌ జెట్‌లో ఇంటర్వ్యూ చేసే అద్భుత అవకాశం లహరి చేతికందింది. దీంతో యమ హుషారుతో బంగార్రాజులతో సరదాగా ముచ్చటించింది.

ఈ సందర్భంగా చై, నాగార్జునలతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. 'కలలు నిజమవుతాయి. నా కల నెరవేరింది. మీలాంటి గొప్ప వ్యక్తులతో ఒక రోజంతా గడిపేందుకు అవకాశం ఇచ్చిన నాగార్జున సర్‌, చై సార్‌లకు ధన్యవాదాలు. లవ్‌ అక్కినేనిస్‌' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement