Musical Night
-
వెంకటేశ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మ్యూజికల్ నెట్లో చిందులేసిన సినీ తారలు (ఫోటోలు)
-
‘రౌడీ బాయ్స్’తో రామ్ చరణ్ సందడి
-
హీరోయిన్ కొంటె నవ్వు.. సిగ్గుపడిపోయిన నాగ చైతన్య
Naga Chaitanya And Daksha Cute Expressions Video In Bangarraju Event: నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. 'సోగ్గాడే చిన్నినాయనా' కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం గత రాత్రి(సోమవారం) మ్యూజికల్ నైట్స్ అనే ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుండగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. మ్యూజిక్ గురించి అనూప్ రూబెన్స్‌ని నాగార్జున ప్రశంసిస్తుంటే.. సడెన్‌గా నాగ చైతన్య వెనక్కి తిరిగి హీరోయిన్ దక్ష నాగర్కర్ వైపు చూశాడు. దీంతో ఆమె కూడా కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా నవ్వింది. దీంతో చైతూ కూడా సిగ్గుపడిపోయాడు. దీనికి సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒక్కోసారి సడెన్ ఇన్సిడెంట్స్ కూడా క్యూట్‌గా ఉంటాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టిలతో పాటు 8మంది హీరోయిన్లు సందడి చేయనున్న విషయం తెలిసిందే. • Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT — ChayAkkineni ™ 🏹 (@massChayCults) January 10, 2022 -
ప్రతి పాట వజ్రంలా ఉంటుంది
‘‘బంగార్రాజు’ చిత్రంలో ప్రతి పాట ఓ వజ్రంలా ఉంటుంది. ఇది సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది’’ అని నాగార్జున అన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బంగార్రాజు మ్యూజికల్ నైట్’ లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘అభిమానులందర్నీ ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలి. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోకు చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ పుట్టింది. యాభై ఏళ్ల క్రితం ‘దసరా బుల్లోడు’తో నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) సంక్రాంతికి దుమ్ములేపారు.. ఆ చిత్రం కూడా మ్యూజికల్ హిట్. సినిమా సక్సెస్‌లో సగ భాగం మ్యూజిక్దే. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ రాబోతోంది. జనవరి 14 పండుగ రోజున పండుగలాంటి ‘బంగార్రాజు’ ను తీసుకొస్తున్నాం’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘బంగార్రాజు’ ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. అనూప్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. మా లిరిక్ రైటర్స్‌కి థ్యాంక్స్. ఇది పండుగ లాంటి సినిమా. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ–‘‘సినిమా సక్సెన్ స్థాయిని నిర్ణయించేది సంగీతమే. ‘బంగార్రాజు’ కు ఇంత మంచి సంగీతం ఇచ్చిన అనూప్ రూబెన్స్‌కి థ్యాంక్స్. నాగ్ సర్ ప్రతి సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టరే. ‘బంగార్రాజు’ పాటలు కూడా అలాగే ఉంటాయి. ఇండస్ట్రీలో బంగార్రాజు అంటే నాగ్ సారే.. ఇప్పుడు ఆయ నకు పోటీగా చిన్న బంగార్రాజు(నాగచైతన్య) ఎక్కడా తగ్గలేదు’’ అన్నారు. ‘‘ఈ మ్యూజికల్ నైట్తోనే సంక్రాంతి ప్రారంభమైనట్టుంది’ అని నిర్మాత జీ స్టూడియోస్ ప్రసాద్ అన్నారు. హీరోలు సుమంత్, సుశాంత్, నిర్మాత నాగ సుశీల, కెమెరామేన్ యువరాజ్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్ మాట్లాడారు. -
కలెక్టర్ నోట... బాలు పాట
విజయనగరం టౌన్: ‘ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..’ అంటూ సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎమ్.హరిజవహర్‌లాల్ అద్భుతంగా పాడి ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘స్వరాల సందమామ’ సంగీత విభావరిలో ఆయన తన స్వరాన్ని వినిపించారు. అనంతరం కళాపీఠం వ్యవస్ధాపకులు ఎమ్.భీష్మారావు ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆయన్ను దుశ్సాలువతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్.లలిత, ఏపీఎస్ఈబీ యూనియన్ నాయకులు డి.వి.డి.ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ లిఫ్ట్ అడిగి దాడి చేసి.. చివరికి.. -
‘వెంకీమామ’ మ్యూజికల్ నైట్
-
‘కేటీఆర్ బామ్మర్ది బ్రోకర్ పని చేస్తున్నాడా’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ బంధువులు బ్రోకర్ అవతారమెత్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వారికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మంత్రి కేటీఆర్ దన్నుగా నిలుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. రేవంత్ శనివారం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ బామ్మర్దికి చెందిన ‘ఈవెంట్స్ నౌ’ అనే సంస్థ యువతులతో వ్యాపారం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. మ్యూజిక్ నైట్స్ పేరుతో బ్రోకర్ పనులు చేస్తున్నారని విమర్శించారు. మేమే అడ్డుకుంటాం.. శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ‘సెస్సేషన్ ఈవెంట్’ నిర్వహించే మ్యూజికల్ నైట్ పార్టీపై ఈసీ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. లేదంటే, ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగుతారని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా గచ్చిబౌలి వెళ్లి సెన్సేషన్ ఈవెంట్‌ను అడ్డుకుంటాని అన్నారు. అయినా, గోవా, ముంబయ్, పుణెల్లో నిషేదించిన మ్యూజికల్ నైట్స్‌కు హైదరాబాద్‌లో ఎలా అనుమతిస్తారని అన్నారు. డీలర్ల కోసమే.. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల డేటింగ్ క్లబ్ నిర్వహిస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. లేకుంటే పోలీసు పహరాలో మ్యూజికల్ నైట్స్ నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. డ్రగ్స్ అమ్మకానికి, డీలర్లను ఏర్పాటు చేసుకోవటానికే ఇలాంటి పార్టీలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈవెంట్లో పాల్గొనేందుకు ఒక్కక్కరి దగ్గర లక్ష నుంచి 5 లక్షల వసూలు చేస్తున్నారంటేనే అక్కడ ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చని అన్నారు. కేటీఆర్ బంధువులైన మాదాపూర్ డీసీపీ, ఏసీపీ ఈ ఈవెంట్‌కు పహారా కాస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఇలాంటి నీచమైన పనులు చేస్తోంటే రాష్ట్రం ఏమైపోతుందని అన్నారు. అందుకే విచారణ ఆపేశారు. గతేడాది హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన బార్లు, పబ్‌లలో మాదక ద్రవ్యాల అమ్మకాలపై హడావుడి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు మౌనంగా ఉందని రేవంత్ ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ నేతృత్వంలో పలువురు ప్రముఖులను విచారించిన వివేదికలు బయటపెట్టాని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ముఠాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువర్గం కూడా ఉండడంతో మాదక ద్రవ్యాల ఉదంతంపై విచారణ పక్కన పెట్టారని అన్నారు. -
పాప్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసిన ట్రంప్ దంపతులు
-
నయా జోష్
నగరంలో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద అందరూ 2016కు వీడ్కోలు పలికి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పారు. కేక్ కట్ చేసి ఆటపాటలతో సందడి చేశారు. యువత బైక్‌లపై తిరిగి హంగామా చేశారు. ఆడపడుచులు ఇళ్ల ఎదుట ముగ్గులు వేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. నగరంలోని పలు హోటళ్లు, గార్డెన్లలో మ్యూజికల్ నైట్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. -
అలరించిన ‘యాదే రఫీ’ సంగీత విభావరి
నెల్లూరు(దర్గామిట్ట): మినీబైపాస్‌రోడ్డులోని అనిల్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి మహ్మద్ రఫీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యాదే రఫీ' సంగీత విభావరి అలరించింది. అకాడమీ అధ్యక్షుడు జాకీర్‌హుస్సేన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన గాయకులు మధురగీతాలతో సమ్మోహితులను చేశారు. మహ్మద్ రఫీ 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మ్యూజికల్ నైట్‌లో మహ్మద్ రఫీ సుమధుర గీతాలు ఆద్యంతం శ్రోతలను ఆనందపారవశ్యంలో ముంచెత్తాయి. గాయకులు ఎహ్తెషామ్, సిమ్రన్, గౌస్‌బాషా, సుజాత, శిరీష, తొలిసారి నెల్లూరుకి విచ్చేసిన ఇండియన్ ఐడల్ సింగర్స్ సుప్రీంశేఖర్, నాగజ్యోతి, తదితరులు ఆలపించిన పాటలు ఓలలాడించాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. జాదూగర్ శ్రీనివాస్‌తో ప్రదర్శితమైన ఇంద్రజాల ప్రదర్శన సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విశేషంగా హాజరైన ప్రేక్షకులతో అనిల్‌గార్డెన్స్ నిండిపోయింది. మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
కళలకు పుట్టినిల్లు సింహపురి
నెల్లూరు(బారకాసు): కళారంగానికి పుట్టినిల్లు సింహపురి అని, ఇక్కడి నుంచి అనేక మంది కళాకారులు తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని 25 కళాసంఘాల గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కష్ణారెడ్డి పేర్కొన్నారు. టౌన్హాల్లో ఆదివారం జరిగిన శాంతి కల్చరల్స్ 14వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రాధాన్యం ఉన్న కళలు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను ప్రభుత్వం ప్రోత్సాహించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో గజ్జెల సవ్వడి వినిపించాలని కాంక్షించారు. శాంతి కల్చరల్స్ అధినేత, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ అమానుల్లాఖాన్ తన వారుసుడ్ని కళారంగం వైపు ప్రోత్సహిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలవడాన్ని అభినందించారు. అనంతరం వివిధ రంగాల్లో తమ వంతు సేవలందించిన ముగ్గురు ప్రముఖులు బాలబ్రహ్మయ్య, అబ్దుల్లా, వల్లూరు కొండపనాయుడ్ని ఘనంగా సత్కరించారు. సినీ గీతాలు, డ్యాన్స్‌లు, ఏకపాత్రాభినయ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సాయిరాగాంజలి ఆర్కెస్ట్రా వారితో నిర్వహించిన మెగా మ్యూజికల్ నైట్ అలరించింది. పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గాలి కిరణ్‌కుమార్, గజల్ గానలహరి నాగరాజారావు, రాజేశ్వరరావు, సురేష్‌బాబు, రమేష్‌బాబు, నల్లమల్లి సత్యనారాయణ, మదార్, మున్వర్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లులో తారల హంగామా