నయా జోష్
నగరంలో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద అందరూ 2016కు వీడ్కోలు పలికి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పారు. కేక్ కట్ చేసి ఆటపాటలతో సందడి చేశారు. యువత బైక్‌లపై తిరిగి హంగామా చేశారు.
ఆడపడుచులు ఇళ్ల ఎదుట ముగ్గులు వేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. నగరంలోని పలు హోటళ్లు, గార్డెన్లలో మ్యూజికల్ నైట్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.