Cultural shows
-
రంగస్థలం
లక్నో సాంస్కృతిక వైభవ మణిపూసలలో రంగస్థలం ఒకటి. ఆ వెలుగు మరింత ప్రజ్వరిల్లేలా ఔత్సాహికులు నాటకరంగంలో భాగం అవుతున్నారు. అయితే రంగస్థలం అంటే యువతరం మాత్రమేనా? ‘కానే కాదు’ అంటోంది ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ. రచనల నుంచి నటన వరకు పెద్దలలోని సృజనాత్మక శక్తులను రంగస్థలంపైకి సాదరంగా తీసుకురావడానికి ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ పేరుతో నాటకరంగ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది... థియేటర్ గ్రూప్ ‘మంచ్కీర్తి సమితి’ లక్నో (ఉత్తరప్రదేశ్)లో నిర్వహించిన ‘30 డేస్ 30 ప్లేస్’ కు అనూహ్యమైన స్పందన లభించింది. విశేషం ఏమిటంటే ఆ జామ్ ప్యాక్డ్ థియేటర్లలో ఎక్కువమంది వృద్ధులు కనిపించారు. నాటకాలు చూస్తున్నప్పుడు వారిలో వయసు భారం మాయమైపోయింది. ప్రదర్శన పూర్తయిన తరువాత టీ తాగుతూ వారు ఆ నాటకాన్ని లోతుగా విశ్లేషించుకునే దృశ్యాలు ఎన్నో కనిపించాయి... దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్నోకు చెందిన ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో సీనియర్ సిటీజన్లతో నలభైరోజుల పాటు థియేటర్ వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ‘వారి కోసం వారి చేత’ ట్యాగ్‌లైన్‌తో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌లలో రచన, నటన, దర్శకత్వం, సంగీతం... మొదలైన అంశాలలో శిక్షణ ఉంటుంది. దీంతో పాటు తమ ఏరియాలో తమ వయసు ఉన్న వ్యక్తులను సమీకరించి ‘స్టోరీ టెల్లింగ్’లాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చెబుతారు. ‘సీనియర్ సిటిజన్స్ కోసం థియేటర్ అనేది మంచి కాన్సెప్ట్. అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త శక్తిని ఇస్తుంది’ అంటున్నాడు థియేటర్ డైరెక్టర్ సలీమ్ ఆరీఫ్. ‘నాటకరంగం అనేది అత్యంత ప్రభావశీలమైనది. ఈ బలమైన మాధ్యమం పెద్దల నీడలో మరింత బలం పుంజుకుంటుంది. వయసు ఎన్నో అనుభవాలను ఇస్తుంది. ఆ అనుభవ జ్ఞానం నాటకాల్లో ప్రతిఫలిస్తుంది. వృద్ధులు అనగానే ప్రేక్షకుల్లో కూర్చుని నాటకం వీక్షించడానికే పరిమితం కానవసరం లేదు. ఇప్పుడు వారిని రంగస్థలం ప్రేమగా, అభిమానంగా ఆహ్వానిస్తోంది’’ అంటున్నాడు రంగస్థల ప్రముఖుడు సంగమ్ బహుగుణ. పెద్దల చేత రూపుదిద్దుకుంటున్న నాటకాలు, పెద్దలు నటించే నాటకాలు ఎలా ఉండబోతున్నాయి? కేవలం.. ఒంటరి ఏకాంతాలు, వయసు సమస్యలు, కుటుంబ సమస్యలు... ఇలా ఏవోవో సమస్యలు ఉండబోతున్నాయా? ‘కానే కాదు’ అంటుంది పీపుల్స్ ఇన్షియేటివ్. వారు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. తాము నడిచొచ్చిన బాటను గుర్తు చేస్తూ ఈ తరానికి సానుకూలశక్తిని పంచుతారు. ఇంతకంటే కావాల్సినదేముంది! నాటకాల పాఠశాల వయసు పైబడినంత మాత్రాన అది నటనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని నిరూపిస్తున్న ప్రతిభావంతులలో సోహైలా కపూర్ ఒకరు. ఘనమైన ఖాన్దాన్ నుంచి వచ్చిన కపూర్ నటి, రచయిత్రి, మోడ్రన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. ఈ తరం నటులతో కలిసి రంగస్థలం, జీ థియేటర్లలో నటిస్తోంది కపూర్. ఆమెతో నటించడం అంటే ఔత్సాహిక నటులకు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్నంత అదృష్టం. దిల్లీలో పుట్టిన కపూర్ హైస్కూల్ రోజుల్లోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ‘వయసు పైబడగానే విషాదం మూర్తీభవించే పాత్రలకు మాత్రమే మహిళా నటులు పరిమితం అవుతున్నారు. ఇది సరికాదు. వృద్ధాప్యం అంటే విషాదం మాత్రమే కాదు. ఎన్నో బలమైన పాత్రలు మన కోసం ఎదురుచూస్తున్నాయి. వోటీటీ పుణ్యమా అని సీనియర్ నటీమణులకు మూస పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రలలో నటించే అవకాశం దొరుకుతుంది’ అంటోంది కపూర్. -
విల్లామేరీ విద్యార్థినులు ఉద్యమ స్ఫూర్తి
-
నయా జోష్
నగరంలో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద అందరూ 2016కు వీడ్కోలు పలికి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పారు. కేక్ కట్ చేసి ఆటపాటలతో సందడి చేశారు. యువత బైక్‌లపై తిరిగి హంగామా చేశారు. ఆడపడుచులు ఇళ్ల ఎదుట ముగ్గులు వేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. నగరంలోని పలు హోటళ్లు, గార్డెన్లలో మ్యూజికల్ నైట్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. -
బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం
► రాష్ట్ర మంత్రి జోగు రామన్న ► అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆదిలాబాద్ కల్చరల్ : రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అందరం కలిసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద గురువారం రాత్రి తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అమరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి బాసటగా నిలిచారని అన్నారు. అనంతరం రచయిత జీఆర్ కుర్మే రచించిన తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఎస్పీ విక్రజిత్‌దుగ్గల్, జేసీ సుందర్ అబ్నార్, ఏజేసీ సంజీవరెడ్డి, డ్వామా పీడీ అరుణకుమారి, యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మనీశ పాల్గొన్నారు. కళాకారుల పాటలు, పేరిణి, లంబాడి నృత్యం, కథక్, కూచిపూడి, భరతనాట్యం ఆకట్టుకున్నారుు. -
కోలాహలంగా ఏడు గంగల జాతర
=ఆకట్టుకున్న గంగమ్మ అలంకరణలు =ప్రత్యేక ప్రభలలో ఊరేగింపులు =అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు =భారీ పోలీసు బందోబస్తు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం ఏడు గంగల జాతర కోలాహలంగా జరిగింది. విద్యుత్ దీపాలంకరణ లు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తిలో ఒకేరోజు ఏడు గంగమ్మలతో జాతర జరగడం విశేషం. జాతర కమిటీ సభ్యులు అలంకరించిన చప్పరాలు మంగళవారం రాత్రి ముత్యాలమ్మ గుడివీధిలో ఉన్న గంగమ్మ ఆల యానికి చేరుకున్నాయి. పూజారులు అమ్మవారికి కుంభం వేసి అభిషేకాలు చేశారు. ఆ తర్వాత గంగమ్మలు బయలుదేరాయి. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. మా మూలుగా సూర్యోదయానికి ముందే గంగమ్మలు రావాల్సి ఉంది. అయితే బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో నిర్దేశించిన ప్రాంతాలకు చేరుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఉదయం నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి గంగమ్మలను దర్శించుకున్నారు. నిర్వాహకులు పోటీలు పడి గంగమ్మలను అలంకరించారు. కులమతాలకు అతీతంగా ప్రజ లు గంగమ్మలను దర్శించుకోవడం విశేషం. సాయంత్రం వరకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ సులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోకి భారీ వాహనాలు, బస్సులు రాకుండా బైపాస్‌రోడ్డు ద్వారా మళ్లించారు. అయితే భక్తులు బైపాస్‌రోడ్డు నుంచి ఆలయానికి చేరుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డారు. వివిధ రూపాల్లో అలంకరణలు ఏడు గంగమ్మలను వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంలోని పెండ్లిమండపం వద్ద పొన్నాల మ్మకు (పెద్దక్క) అభయవైష్టవిదేవి అలంకరణ, ఊరేగింపునకు పద్మవైకుంఠప్రభ (చప్పరం)తయారు చేశారు. అలాగే బేరివారిమండపం వద్ద ముత్యాలమ్మకు ధనలక్ష్మి అలంకరణ, శ్రీకృష్ణ జగన్నాథ ప్రభ, పూసలవీధి కావమ్మకు భవానీదేవి అలంకరణ, పుష్పప్రభ, సన్నిధివీధిలోని అంకాళమ్మకు గౌరీభవాని అలంకరణ, శివనాగదేవత పంచప్రభ, తేరువీధిలో నల్లగంగమ్మకు అంబికాదేవి అలంకరణ, సూర్యదేవత మణిమండప ప్రభ, గాంధీవీధి అంకమ్మకు గాయత్రిదేవి అలంకరణ, సప్తశక్తి విశ్వరూపప్రభ, కొత్తపేటలోని భువనేశ్వరి అమ్మవారికి రేణుకాంబదేవి అలంకరణ, ఆదిశేష ప్రభను తయారుచేశారు. అమ్మవారి ఊరేగింపు ముందు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో పట్టణమంతా కోలాహలంగా కనింపించింది.