బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం
► రాష్ట్ర మంత్రి జోగు రామన్న
► అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
ఆదిలాబాద్ కల్చరల్ : రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అందరం కలిసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద గురువారం రాత్రి తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అమరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి బాసటగా నిలిచారని అన్నారు. అనంతరం రచయిత జీఆర్ కుర్మే రచించిన తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఎస్పీ విక్రజిత్‌దుగ్గల్, జేసీ సుందర్ అబ్నార్, ఏజేసీ సంజీవరెడ్డి, డ్వామా పీడీ అరుణకుమారి, యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ మనీశ పాల్గొన్నారు. కళాకారుల పాటలు, పేరిణి, లంబాడి నృత్యం, కథక్, కూచిపూడి, భరతనాట్యం ఆకట్టుకున్నారుు.