
సంగీత విభావరిలో పాట పాడుతున్న కలెక్టర్ డాక్టర్ ఎమ్.హరిజవహర్‌లాల్
విజయనగరం టౌన్: ‘ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..’ అంటూ సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎమ్.హరిజవహర్‌లాల్ అద్భుతంగా పాడి ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘స్వరాల సందమామ’ సంగీత విభావరిలో ఆయన తన స్వరాన్ని వినిపించారు.
అనంతరం కళాపీఠం వ్యవస్ధాపకులు ఎమ్.భీష్మారావు ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆయన్ను దుశ్సాలువతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్.లలిత, ఏపీఎస్‌ఈబీ యూనియన్ నాయకులు డి.వి.డి.ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్
లిఫ్ట్ అడిగి దాడి చేసి.. చివరికి..
Comments
Please login to add a commentAdd a comment