vijayanagram
-
విజయనగరం: కుప్పకూలిన టీడీపీ ‘కోట’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలుచుకోలేక కుదేలైన టీడీపీకి ఇప్పుడు మరో చావుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన శోభా హైమావతి పార్టీకి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు ఆమె వెల్లడించారు. దీంతో ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న కాస్తంత బలం కూడా కరిగిపోయింది. ఇటు జిల్లాలో అటు విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో కీలకమైన శృంగవరపుకోటలో టీడీపీకి గట్టి నాయకత్వమే లేకుండా పోయింది. మారుమూల గ్రామం నుంచి... హైమావతి స్వస్థలం విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని భీమవరం గ్రామం. ఆమె భర్త అప్పలరాజు హిందుస్థాన్ షిప్‌యార్డులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె కుమార్తె శోభా స్వాతిరాణి బ్యాచలర్ ఆప్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) పూర్తిచేశారు. 2014 నుంచి 2019 వరకూ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. హైమావతి ఇద్దరు కుమారులూ బీటెక్ పూర్తి చేశారు. రాజకీయాల్లో కీలక స్థానానికి... జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఒకప్పుడు జిల్లా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దివంగత నాయకుడు లగుడు సింహాద్రి హైమావతికి రాజకీయ గురువు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన శృంగవరపు కోట నుంచి టీడీపీ అభ్యర్థిగా హైమావతి తొలిసారి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామిపై 678 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఓడిపోయింది. అప్పుడే కాంగ్రెస్ అభ్యర్థి కుంబా రవిబాబు చేతిలో 5,862 ఓట్ల తేడాతో హైమావతి ఓటమి పాలయ్యారు. తర్వాత ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్‌గా సేవలు అందించారు. టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలిగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. అనకాపల్లి, విశాఖ, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్చార్జిగా వ్యవహరించారు. 2009 నాటి ఎన్నికల్లో అరకు, ఎస్.కోట నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిగా పనిచేశారు. జిందాల్ భూముల వ్యవహారంపై అలుపెరుగని పోరాటం చేశారు. ఆ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. మృధుస్వభావి అయిన ఆమె పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ కీలక నేతగా ఎదిగారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్.కోట జనరల్ సెగ్మెంట్ అయింది. ఉత్తరాపల్లి నియోజకవర్గం రద్దు అయ్యింది. దీంతో చంద్రబాబు ఎస్.కోట నియోజకవర్గాన్ని ‘కోళ్ల’ కుటుంబానికి కేటాయించారు. తదుపరి పరిణామాల్లో హైమావతి కుటుంబాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. పార్టీలో ప్రాధాన్యం క్రమేపీ తగ్గిపోయింది. పార్టీ పదవుల నుంచి దూరం చేశారు. టీడీపీ వైఖరిని భరించలేక చివరకు ఆమె ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎస్.కోటలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. -
టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆమె తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపుతానని శనివారం మీడియాకు చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. అధికారం కోల్పోయాక పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని, పార్టీలో ఎదిగేందుకు అవకాశంలేదని ఆమె కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. 1999లో ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలి ప్రయత్నంలోనే ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభా రవిబాబు చేతిలో ఓటమి చెందారు. 2009లో సామాజిక సమీకరణల్లో ఎస్.కోట అసెంబ్లీ సీటును ఆమె త్యాగం చేశారు. అప్పటి నుంచి పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. 2014లో హైమావతి కుమార్తె స్వాతిరాణి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2019లో ఎన్నికల తర్వాత స్వాతిరాణి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ వైఖరి నచ్చక రాజీనామాలు కాగా, టీడీపీకి ఇలా పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన దాసరి రాజా మాస్టారు పార్టీకి గుడ్‌బై చెప్పారు. అలాగే, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన జియావుద్దీన్ కూడా అసంతృప్తితోనే పార్టీని వీడారు. అంతకుముందు.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అనేకమంది పార్టీ వైఖరి నచ్చక రాజీనామా చేశారు. మరి -
ఆ పాపాలు ఎవరివంటే..?
భామిని: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వా రా పిల్లలు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన ఐసీడీఎస్ పాలు ఆక్రమ రవాణా కేసులో ఇద్దరిని అరె స్టు చేశామని, మరో ముగ్గురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. అరెస్టయిన వారిలో వ్యాన్ యజమాని, డ్రైవర్ ఉన్నట్టు పేర్కొన్నారు. భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్లో ఎస్సై కె.వి.సురేష్‌తో కలిసి పాలు ఆక్రమ రవాణా కేసు వివరాలను ఆది వారం వెల్లడించారు. బత్తిలి పోలీస్‌లు చెక్‌పోస్టు వ ద్ద శనివారం పట్టుకున్న 1919 లీటర్ల పాల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లను సరఫరా చేసే సబ్‌డీలర్లే కార్యకర్తల వద్ద కొనుగోలు చేసి అ క్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధి నుంచి పాల ప్యా కెట్లు తరలివచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీటిని మిఠాయి, టీ షాపులకు విక్రయిస్తున్నారన్నా రు. ప్యాకెట్లపై ఉన్న నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయగా.. వీరఘట్టం ప్రాజెక్టుకు చెందిన ప్యాకెట్లు కూడా ఉన్నట్టు వివరించారు. వీటి అమ్మకాలపై డి విజన్‌లోని కొన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహించి పలు దుకాణాల్లో ఇవే రకం పాలు ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. సీజ్ చేసిన ప్యాకెట్లను ఐసీడీఎస్ పీడీకి అప్పగించామన్నారు. -
కలెక్టర్ నోట... బాలు పాట
విజయనగరం టౌన్: ‘ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..’ అంటూ సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎమ్.హరిజవహర్‌లాల్ అద్భుతంగా పాడి ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘స్వరాల సందమామ’ సంగీత విభావరిలో ఆయన తన స్వరాన్ని వినిపించారు. అనంతరం కళాపీఠం వ్యవస్ధాపకులు ఎమ్.భీష్మారావు ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆయన్ను దుశ్సాలువతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్.లలిత, ఏపీఎస్ఈబీ యూనియన్ నాయకులు డి.వి.డి.ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ లిఫ్ట్ అడిగి దాడి చేసి.. చివరికి.. -
రాజాంలో ఆదిమానవుల ఆనవాళ్లు
రాజాం సిటీ: శ్రీకాకుళం జిల్లా రాజాం మండల పరిధి రాజయ్యపేట గ్రామంలో నవీన శిలాయుగ ఆనవాళ్లు లభించాయని రాజాం రచయితల వేదిక నిర్వాహకులు గార రంగనాథం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజాం చరిత్ర రచనలో భాగంగా రాజయ్యపేట వెళ్లానన్నారు. అక్కడ మంచినీటి కోనేరు దక్షిణ గట్టున ఉన్న తుప్పల మధ్య బండరాతి మీద లోతుగా చెక్కినట్టు ఉన్న గుర్తులను గమనించానని, అవి క్రీస్తు పూర్వం నాలుగువేల సంవత్సరాల నాటివని తెలిపారు. ఆదిమానవుడు ఆధునికుడయ్యే క్రమంలో రాతి బండలమీద, కొండలమీద నల్ల శానపు రాళ్లను అరగదీసి పనిముట్లుగా మార్చుకునేవాడని, ఆ విధంగా ఏర్పడినవే ఆ రాతి గోతులని వివరించారు. ఈ విషయాన్ని విజయవాడ ఆర్కియాలజీ సాంకేతిక నిపుణులు లీలా సుబ్రహ్మణ్యంతో సంప్రదించి ధ్రువీకరించామని వెల్లడించారు. రాజాంలో పురావస్తు శాఖ వారు పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని అన్నారు. -
ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు..
బొబ్బిలి: అది పార్వతీపురం నుంచి బొబ్బిలివైపు వస్తున్న ఆర్టీసీ బస్సు. అందులో ఓ వృద్ధ జంట ప్రయాణిస్తోంది. ఏమైందో ఏమో... జీవితాంతం తోడుండాల్సిన భర్త ఆ వృద్ధురాలి ఒడిలోనే అకస్మాత్తుగా కన్నుమూశాడు. అనుకోని సంఘటనతో ఆమె హతాశురాలైంది. ఏంచేయాలో తెలియక కాస్త కలవరపడింది. విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ సిబ్బంది బస్సును రోడ్డుపక్క నిలిపేసి... మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో మృతదేహాన్ని దింపేశారు. దిక్కుతోచని ఆమె కన్నీరుమున్నీరైంది. మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని రోదించింది. సాయం చేయాలంటూ దారిన పోయేవారిని అర్థించింది. ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను పలకరించి విషయం తెలుసుకున్నారు. వెంటనే తెలిసిన మిత్రులు, జర్నలిస్టులకు సమాచారం అందించారు. వారంతా కూడి కాస్తంత ఆర్థిక సాయం చేసి మృతదేహాన్ని సొంత ఊరికి తరలించేందుకు సాయ పడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన పార్వతీపురం, బొబ్బిలి మార్గంలో సోమవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పోలమ్మ, తన భర్త పైడయ్య(58)కు అనారోగ్యంగా ఉండటంతో వైద్యం నిమిత్తం పార్వతీపురం తీసుకువెళ్లింది. తిరుగు ప్రయాణంలో బొబ్బిలి సమీపంలో పైడయ్య మృతి చెందాడు. బొబ్బిలి చేరాక సిబ్బంది, ఇతరులు కలసి ఆ మృత దేహా న్ని బస్సునుంచి దించేశారు. అక్కడ రాయఘడ రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజ్‌కు ఆనుకుని మృత దేహాన్ని దించేయడంతో ఆమె అక్కడే మృత దేహాన్ని తన వద్దకు తీసుకుని రోదిస్తూ సాయం చేయాలని అభ్యర్థించింది. అటువైపుగా నడచుకుంటూ వెళ్తున్న తారకరామా కాలనీకి చెందిన అలజంగి స్కూల్ హెచ్ఎం కె.కృష్ణదాసు చూసి తన స్నేహితులైన స్థానిక జర్నలిస్టులకు సమాచారమిచ్చారు. వెంటనే జర్నలిస్టులు రాయఘడ జగదీ‹Ù, కొండ్రవీడి ఆచారి ఆదినారాయణ, బు జ్జి, రుంకాన రమేష్, ఫైర్ స్టేషన్ డ్రైవర్ తదితరులతో పాటు అంతర్రాష్ట్ర రహదారి కావడంతో మరికొందరు చేసిన ఆరి్ధక సహాయం పోగు చేసి ఆటోలో వారి స్వగ్రామానికి పంపించారు. ఆటో సొమ్ము కొంత పోగా మిగతా మొత్తాన్ని పోలమ్మ చేతిలో పెట్టారు. మూఢనమ్మకంతో... పైడయ్యకు చాలారోజులుగా ఒంట్లో బాగాలేదు. కుటుంబ సభ్యులు, ఇతరులు చిల్లంగి, దెయ్యం పట్టిందని వారిలో అనుమాన బీజం నాటారు. పార్వతీపురం దరి ఓ దేముడమ్మ వద్దకు తీసుకెళ్లాలని సూచించడంతో పండుటాకు లిద్దరూ అక్కడకు వెళ్లారు. ఎన్నో ఆస్పత్రులున్నా, వైద్యం అందుబాటులో కి వచ్చినా, ఇంటింటికీ వైద్య సేవలు అందుతు న్నా ఇంకా కొంత మంది ఇలా మూఢ నమ్మకాలను అనుసరిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారనడానికి ఇదో ఉదాహరణ. చదవండి: 13 మంది దుర్గ గుడి ఉద్యోగుల సస్పెన్షన్.. ‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం -
కోటలో కూర్చోని రాజకీయాలు చేయడం మానండి..
సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా వివిధ హోదాలో పనిచేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. కోటలో కూర్చోని రాజకీయాలు చేయడం మానుకోండని హితవు పలికారు. చరిత్రలు చెప్పడం అందరికీ తెలుసని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌పై స్పష్టమైన విధానాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటు కారణంగా ఇక్కడ ప్రజలు చాలా ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల కాలం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలు జీవనాన్ని నెట్టుకొస్తున్నారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖాభివృది జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని బొమ్మలు చూపించి చివరికి రేకుల షెడ్డులో ఉన్నతాధికారులను కూర్చొబెట్టి పాలన సాగించారని మండిపడ్డారు. రాజధాని ముసుగులో టీడీపీ నాయకులు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని ధ్వజమెత్తారు. -
పార్వతీపురం వైఎస్ జగన్ ప్రజసంకల్పయాత్ర
-
287వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర విశేషాలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రైవేట్ టీచర్లు , లెక్చరర్లు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఏపీ విద్యా పరిరక్షన కమిటీ నేతలు
-
ముగిసిన 286వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
పైడితల్లికి విశేష పూజలు
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు అయిన విజయనగరం పైడితల్లి అమ్మవారు మంగళవారం విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. ఇక్కడ ప్రతీ మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు ఆ రోజున ప్రత్యేక అలంకారం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి జామపండ్లతో అలంకారం చేశారు. అనంతరం ఆలయం ఆవరణలో వేద పండితులు చండీయాగం నిర్వహించారు. ఈవో భానురాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.