ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు.. | Old Man Deceased In RTC Bus | Sakshi
Sakshi News home page

ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు..

Published Tue, Feb 23 2021 10:32 AM | Last Updated on Tue, Feb 23 2021 2:49 PM

Old Man Deceased In RTC Bus - Sakshi

రోడ్డుపై భర్త మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తున్న పోలమ్మ

బొబ్బిలి: అది పార్వతీపురం నుంచి బొబ్బిలివైపు వస్తున్న ఆర్టీసీ బస్సు. అందులో ఓ వృద్ధ జంట ప్రయాణిస్తోంది. ఏమైందో ఏమో... జీవితాంతం తోడుండాల్సిన భర్త ఆ వృద్ధురాలి ఒడిలోనే అకస్మాత్తుగా కన్నుమూశాడు. అనుకోని సంఘటనతో ఆమె హతాశురాలైంది. ఏంచేయాలో తెలియక కాస్త కలవరపడింది. విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ సిబ్బంది బస్సును రోడ్డుపక్క నిలిపేసి... మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో మృతదేహాన్ని దింపేశారు. దిక్కుతోచని ఆమె కన్నీరుమున్నీరైంది. మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని రోదించింది. సాయం చేయాలంటూ దారిన పోయేవారిని అర్థించింది. ఎవరూ ఆమెను పట్టించుకోలేదు.

ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను పలకరించి విషయం తెలుసుకున్నారు. వెంటనే తెలిసిన మిత్రులు, జర్నలిస్టులకు సమాచారం అందించారు. వారంతా కూడి కాస్తంత ఆర్థిక సాయం చేసి మృతదేహాన్ని సొంత ఊరికి తరలించేందుకు సాయ పడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన పార్వతీపురం, బొబ్బిలి మార్గంలో సోమవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పోలమ్మ, తన భర్త పైడయ్య(58)కు అనారోగ్యంగా ఉండటంతో వైద్యం నిమిత్తం పార్వతీపురం తీసుకువెళ్లింది.

తిరుగు ప్రయాణంలో బొబ్బిలి సమీపంలో పైడయ్య మృతి చెందాడు. బొబ్బిలి చేరాక సిబ్బంది, ఇతరులు కలసి ఆ మృత దేహా న్ని బస్సునుంచి దించేశారు. అక్కడ రాయఘడ రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజ్‌కు ఆనుకుని మృత దేహాన్ని దించేయడంతో ఆమె అక్కడే మృత దేహాన్ని తన వద్దకు తీసుకుని రోదిస్తూ సాయం చేయాలని అభ్యర్థించింది. అటువైపుగా నడచుకుంటూ వెళ్తున్న తారకరామా కాలనీకి చెందిన అలజంగి స్కూల్‌ హెచ్‌ఎం కె.కృష్ణదాసు చూసి తన స్నేహితులైన స్థానిక జర్నలిస్టులకు సమాచారమిచ్చారు. వెంటనే జర్నలిస్టులు రాయఘడ జగదీ‹Ù, కొండ్రవీడి ఆచారి ఆదినారాయణ, బు జ్జి, రుంకాన రమేష్, ఫైర్‌ స్టేషన్‌ డ్రైవర్‌ తదితరులతో పాటు అంతర్రాష్ట్ర రహదారి కావడంతో మరికొందరు చేసిన ఆరి్ధక సహాయం పోగు చేసి ఆటోలో వారి స్వగ్రామానికి పంపించారు. ఆటో సొమ్ము కొంత పోగా మిగతా మొత్తాన్ని పోలమ్మ చేతిలో పెట్టారు.  

మూఢనమ్మకంతో... 
పైడయ్యకు చాలారోజులుగా ఒంట్లో బాగాలేదు. కుటుంబ సభ్యులు, ఇతరులు చిల్లంగి, దెయ్యం పట్టిందని వారిలో అనుమాన బీజం నాటారు. పార్వతీపురం దరి ఓ దేముడమ్మ వద్దకు తీసుకెళ్లాలని సూచించడంతో పండుటాకు లిద్దరూ అక్కడకు వెళ్లారు. ఎన్నో ఆస్పత్రులున్నా, వైద్యం అందుబాటులో కి వచ్చినా, ఇంటింటికీ వైద్య సేవలు అందుతు న్నా ఇంకా కొంత మంది ఇలా మూఢ నమ్మకాలను అనుసరిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారనడానికి ఇదో ఉదాహరణ.
చదవండి:
13 మంది దుర్గ గుడి ఉద్యోగుల సస్పెన్షన్‌..  
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement