
పరిగిలో ఘోర ప్రమాదం తప్పింది. పల్లవి కాలేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగిలో ఘోర ప్రమాదం తప్పింది. పల్లవి కాలేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సును సైడ్‌కు ఆపే క్రమంలో మట్టి కూరుకుపోయిన బస్సు.. బోల్తా కొట్టింది. బస్సులో ఉన్న మహిళల తలలకు గాయాలు కాగా.. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరు క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
బస్సులో మొత్తం 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. 30 మందికి స్వల్ప గాయాలు కాగా, నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిగి నుంచి షాద్ నగర్ వెళ్తుండగా ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు.