
సాక్షి, సూర్యాపేట జిల్లా: చింతలపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగింది. దీంతో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. కోదాడ నుంచి చింతలపాలెం మండలం నక్కగూడెం వెళ్తుండగా జిల్లేడు గుంట బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది.