
హీరోయిన్ ధక్ష నగర్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హోరాహోరి,హుషారు వంటి సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య-దక్ష మధ్య జరిగిన క్యూట్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇద్దరూ సైగలతో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు పుట్టుకుచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దక్ష నాగచైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'చైతూ చాలా స్వీట్ పర్సన్. చై లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అమ్మాయిలందరి క్రష్ అని చెప్పొచ్చు.
చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అమ్మాయిలను చాలా గౌరవిస్తాడు. బంగర్రాజు సినిమా షూటింగ్ టైంలో నన్ను హగ్ చేసుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ సీన్స్ చిత్రీకరించాక వచ్చి నాకు సారీ చెప్పాడు..అంత స్వీట్ అబ్బాయి అతను అంటూ చై పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ సరసన రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
• Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT
— ChayAkkineni ™ 🏹 (@MassChayCults) January 10, 2022
Comments
Please login to add a commentAdd a comment