
రవితేజ
... ఎందుకు? రవితేజ వైజాగ్‌లో వారం రోజులు ఎందుకు ఉండాలనుకున్నారంటే... కచ్చితంగా హాలిడేస్ కాదు. షూటింగ్ కోసమే. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లారు.
ఈ నెల 8 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత బ్యాక్ టు హైదరాబాద్. ఇందులో రవితేజ సరసన మాళవికా శర్మ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ స్టైల్ మాస్, కల్యాణ్ కృష్ణ ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘నేల టిక్కెట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సమాచారం.