తప్పులను క్షమించాలి | Nela Ticket Movie Press Meet | Sakshi
Sakshi News home page

తప్పులను క్షమించాలి

Published Fri, May 25 2018 3:56 AM | Last Updated on Fri, May 25 2018 3:57 AM

Nela Ticket Movie Press Meet - Sakshi

కల్యాణ్‌కృష్ణ, మాళవికశర్మ, రామ్‌ తాళ్లూరి

‘‘సినిమా సౌండ్‌ అర్థమయ్యే పిల్లల నుంచీ 90ఏళ్ల వాళ్ల వరకూ అందరూ ‘నేల టిక్కెట్టు’ సినిమాని ఎంజాయ్‌ చేస్తారు. ప్రతి సినిమాకీ ఫస్ట్‌ సినిమాలాగే కష్టపడతాను. ఈ సినిమాపై నాకు 100 శాతం నమ్మకం ఉంది’’ అని కల్యాణ్‌ కృష్ణ అన్నారు. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘అనాథ అయిన హీరో ఓ కుటుంబాన్ని ఎలా సంపాదించుకుంటాడు? ప్రతి మనిషికీ ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ లోపం లేకుంటే దేవుడు అయిపోతాడు. ఆ తప్పుల్ని కూడా మనం క్షమించగలిగితేనే ఒకరికొకరు దగ్గరవుతారు. అలా.. ప్రతి మనిషిలోనూ హీరో ఒక రిలేషన్‌ వెతుక్కుంటాడు. చివరికి దేవుడితో కూడా.

ఒక్కసారి రిలేషన్‌ కనెక్ట్‌ అయిన తర్వాత వాళ్ల కోసం ఎంత ఫైట్‌ చేశాడన్నదే సినిమా’’ అన్నారు. ‘‘నేను సోలోగా తీసిన మొట్టమొదటి చిత్రమిది. క్లాస్, మాస్‌ కాంబినేషన్‌లో ఉన్న ఫ్యామిలీ ఎమోష¯Œ  మూవీ. రవితేజగారు లేకుంటే ఈ సినిమా ఇంత స్పీడ్‌గా పూర్తయ్యేది కాదు. కల్యాణ్‌ కృష్ణ కూడా బాగా కష్టపడ్డారు. వీరిద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. రవితేజగారితోనే మరో సినిమా చేస్తాం. సెప్టెంబర్‌ ఆఖరులో ప్రారంభం అవుతుందిæ’’ అన్నారు రామ్‌ తాళ్లూరి. ‘‘ఈ చిత్రంలో నాది మెడికల్‌ స్టూడెంట్‌ పాత్ర. రవితేజగారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కల్యాణ్‌ కృష్ణ చాలా పాజిటివ్‌. రామ్‌ తాళ్లూరి సార్‌ బ్యానర్‌లో పని చేయడం వెరీ కంఫర్టబుల్‌’’ అన్నారు మాళవికా శర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement