
టచ్ చేసి చూడు సినిమా తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ మసాలా ఎంటర్‌టైనర్ నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది.
ఇటీవల విడుదల చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చివరిదశలో షూటింగ్ పనులతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలకు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను మే 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫిదా ఫేం శక్తికాంత్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment