
కింగ్ నాగార్జున త్వరలో తాత కాబోతున్నారు. అయితే అది రియల్ లైఫ్‌లో మాత్రం కాదు.. రీల్ లైఫ్‌లోనే. అవును నాగార్జున తన తదుపరి చిత్రంలో తాత పాత్రలో కనిపించనున్నాడట. దేవదాసు సినిమా తరువాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నాగ్, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రతో పాటు మరో మలయాళం సినిమాలో నటిస్తున్నారు. తమిళ్‌లో ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైనా ఇంకా పట్టాలెక్కలేదు.
తాజాగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వల్‌ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు నాగ్. కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చటంతో ఏప్రిల్ లోనే సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు నాగార్జున, నాగచైతన్య కే తాతగా కనిపించనున్నాడట. బంగార్రాజు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment