Nagarjuna and Naga Chaitanya Bangarraju Movie OTT Streaming Soon on ZEE5 Telugu - Sakshi
Sakshi News home page

Bangarraju Movie: ఓటీటీకి రాబోతోన్న బంగార్రాజు మూవీ!, ఎప్పుడు, ఎక్కడంటే..

Published Wed, Feb 9 2022 7:46 PM | Last Updated on Wed, Feb 9 2022 8:18 PM

Nagarjuna And Naga Chaitanya Bangarraju Movie Streaming On Zee5 OTT Soon - Sakshi

అక్కినేని హీరోలు నాగార్జున-నాగ చైతన్యలు నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం మంచి విజయం సాధించింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలైన 25 రోజులను పూర్తిచేసుకుంది. దీంతో మరోసారి డిజిటల్‌ రిలీజ్‌కు బంగార్రాజు సిద్దమువుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..

ఈ నెల14వ లేదా 18వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. కాగా జీ-అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడంతో జీ5లోనే బంగర్రాజును మూవీని విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్‌. ఈ మూవీ విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేస్తామని ఇది వరకే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే త్వరలోనే బంగార్రాజును ఓటీటీలో విడుదల చేసేందుకు ప్ర‍స్తుతం ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.  

చదవండి: 2022 ఆగస్ట్‌ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్‌ కామెంట్స్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement