మరోసారి మాయ చేస్తారట..! | Naga Chaitanya Romance with Samantha For Kalyan Krishna Film | Sakshi

మరోసారి మాయ చేస్తారట..!

Jun 10 2016 1:46 PM | Updated on Sep 4 2017 2:10 AM

మరోసారి మాయ చేస్తారట..!

మరోసారి మాయ చేస్తారట..!

'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మరోసారి తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్...

'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మరోసారి తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ కపుల్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఏం మాయ చేసావే సినిమా తరువాత ఆటోనగర్ సూర్యలో కలిసి నటించారు చైతు, సామ్. ఈ సినిమా విజయం సాధించకపోయినా, ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్క్ అవుట్ అయ్యింది.

తరువాత మనం సినిమాతో మరోసారి భారీ సక్సెస్ను నమోదు చేశారు. ఇటీవల సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సమంతను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతూ, ప్రస్తుతం ప్రేమమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.

ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెర మీదే కాదు తెర వెనక కూడా వీరి మధ్య ఏదో ఉందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరో సినిమాలో కలిని నటించటం ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యంగ్ జనరేషన్ లో రామ్ చరణ్, కాజల్ తప్ప మరే జంట నాలుగు సినిమాల్లో కలిసి నటించలేదు. దీంతో ఈ రికార్డ్ సాధించిన రెండో జంటగా నిలిచారు చైతన్య, సమంత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement