అక్కినేని వారసులు క్లారిటీ ఇచ్చారు | Naga Chaitanya and Akhils Directors Names Revealed | Sakshi
Sakshi News home page

అక్కినేని వారసులు క్లారిటీ ఇచ్చారు

Published Fri, Sep 2 2016 10:13 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అక్కినేని వారసులు క్లారిటీ ఇచ్చారు - Sakshi

అక్కినేని వారసులు క్లారిటీ ఇచ్చారు

యంగ్ హీరో అఖిల్ తన రెండో సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ సినిమా రిజల్ట్తో ఆలోచనలో పడ్డ ఈ యువ కథానాయకుడు రెండో సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన అక్కినేని యంగ్ హీరో గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే నిర్మాణపరమైన సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

తాజాగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. ఇదే విషయాన్ని నాగార్జున కూడా కన్ఫామ్ చేశాడు. అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని ప్రకటించిన నాగ్, నాగచైతన్య.., సొగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నాడని ప్రకటించాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement