నాగార్జున సోగ్గాడిగా, అమాయకుడిగా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’.
నాగార్జున సోగ్గాడిగా, అమాయకుడిగా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ ఇటీవల మైసూర్‌లో జరిగింది. దాంతో షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. నిర్మాత పి. రామ్మోహన్ ఇచ్చిన స్టోరీ లైన్‌ను కల్యాణ్ కృష్ణ బాగా డెవలప్ చేశాడనీ, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదనీ నాగార్జున చెప్పారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా నటించారు.