చైతూకి విలన్గా సీనియర్ హీరో | Srikanth Turns Villain For Naga Chaitanya | Sakshi

చైతూకి విలన్గా సీనియర్ హీరో

Apr 18 2017 11:17 AM | Updated on Sep 5 2017 9:05 AM

చైతూకి విలన్గా సీనియర్ హీరో

చైతూకి విలన్గా సీనియర్ హీరో

వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాగచైతన్య ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. సోగ్గాడే

వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాగచైతన్య ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రారండోయ్ వేడుక చూద్దాం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. కొత్త దర్శకుడు కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో సందడి చేస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యకు ప్రతినాయకుడిగా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో విలన్గా నటిస్తున్న శ్రీకాంత్.. చాలా ఏళ్ల తరువాత ఓ తెలుగు సినిమాలో విలన్ రోల్కు ఓకె చెప్పాడు. ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ మరోసారి విలన్ రోల్లో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement