
షూటింగ్‌లో పాల్గొనేందుకు బంగార్రాజు రెడీ అవుతున్నాడు. 2016లో నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఆ సంక్రాంతి పండక్కి ఓ మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర పేరుతోనే ప్రీక్వెల్‌ను ప్లాన్ చేశారు కల్యాణ్ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య మరో హీరోగా నటిస్తారు. షూటింగ్‌ను ఈ నెల 20న మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. సెట్స్ వర్క్ కూడా జరుగుతోందట. అంతేకాదు.. ‘సోగ్గాడే చిన్ని నాయనా..’ని సంక్రాంతికి విడుదల చేసినట్లే ‘బంగార్రాజు’ని కూడా సంక్రాంతికి (2022) విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment