
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు షూటింగ్ పూర్తి చేసిన ఈ సీనియర్ హీరో త్వరలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించనున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ సరసన కొత్తమ్మాయిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. జనవరి 5న షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం మాళవిక శర్మను హీరోయిన్ గా ఎంపిక చేశారు.
ముందుగా హీరోయిన్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని భావించినా.. రవితేజ, రకుల్ కాంబినేషన్ లో వచ్చిన కిక్ 2 ఫ్లాప్ కావటంతో వేరే హీరోయిన్ కోసం ప్రయత్నించారు. యాడ్ ఫిలింస్ తో ఆకట్టుకున్న మాళవిక శర్మ, హిమాలయ గర్ల్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రవితేజ సరసన నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment