టచ్‌లోనే ఉన్నారు | raviteja new movies updates | Sakshi
Sakshi News home page

టచ్‌లోనే ఉన్నారు

Published Wed, Sep 13 2017 12:32 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

టచ్‌లోనే ఉన్నారు

టచ్‌లోనే ఉన్నారు

ఎవరితో? ‘టచ్‌ చేసి చూడు’ దర్శక–నిర్మాతలతో! ఆల్మోస్ట్‌ రెండేళ్లవుతోంది రవితేజ సినిమా వచ్చి! ‘బెంగాల్‌ టైగర్‌’ తర్వాత కొన్నాళ్లు సరైన కథల కోసం వెయిట్‌ చేసిన రవితేజ ఇంచుమించు సేమ్‌ టైమ్‌లో రెండు సిన్మాలు స్టార్ట్‌ చేశారు. ఒకటి... అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా.. ది గ్రేట్‌’. ఇంకొకటి... రచయిత విక్రమ్‌ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రారంభించిన ‘టచ్‌ చేసి చూడు’. రీసెంట్‌గా ఏదొక వార్తతో ఒక సిన్మా టచ్‌లోనే ఉంటోంది. ఇంకొక సిన్మా గురించి ఏ వార్తా వినిపించడం లేదు. ఈలోపు కొందరు ఏవేవో గాసిప్పులు పుట్టించేశారు. ‘టచ్‌ చేసి చూడు’ ఆగిందన్నది వాటి సారాంశం. అసలు మేటర్‌ ఏంటంటే... ‘రాజా.. ది గ్రేట్‌’లో రవితేజ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ‘టచ్‌ చేసి చూడు’ను సేమ్‌ లుక్‌తో చేయడం రవితేజకు ఇష్టం లేదట.

అందులో చిన్నపాటి గడ్డంతో కొన్ని, క్లీన్‌ షేవ్‌తో మరికొన్ని సీన్లలోనూ కనిపించనున్నారట. న్యూ లుక్‌లోకి మారే ముందు ఇప్పుడున్న లుక్‌లో సిన్మా కంప్లీట్‌ చేయాలనుకున్నారట. ‘‘రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ టీమ్‌తో 100% టచ్‌లో ఉన్నారు. ప్యారలల్‌గా రెండు సిన్మాల షూటింగులు చేయాలంటే... గెటప్‌ ఇష్యూ వస్తుందని ‘టచ్‌ చేసి చూడు’కి చిన్న బ్రేక్‌ ఇచ్చారు. ‘రాజా  ది గ్రేట్‌’ పూరై్తన తర్వాత నాన్‌–స్టాప్‌గా ‘టచ్‌ చేసి చూడు’ షూటింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ఆయన క్లీన్‌ షేవ్‌తో మరింత హ్యాండ్సమ్‌గా కనిపించే సీన్లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు’’ అని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’ను లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement