Touch chesi chudu
-
ఎవరూ ఎవరికీ బ్యాకప్ ఇవ్వరు
‘‘నేను చాలా సినిమాల్లో పోలీస్‌గా చేశా. అయితే అవి సీరియస్‌తో కూడుకున్నవి. ‘టచ్ చేసి చూడు ’లో కొంచెం సీరియస్.. ఎక్కువగా ఫన్ ఉంటుంది. ఇటు కుటుంబం.. అటు ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడన్నదే కథ’’ అని రవితేజ అన్నారు. ఆయన హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానున్న సందర్భంగా రవితేజ పలు విశేషాలు పంచుకున్నారు. ‘టచ్ చేసి చూడు’ అంటున్నారు. టచ్ చేస్తే షాక్ కొడుతుందా? టచ్ చేస్తే ఏమవుతుందా? అని నేనూ ఎదురు చూస్తున్నా. ఎంత షాక్ కొడుతుంది? అన్నది రెండో తారీఖు తెలిసిపోతుంది. కొత్త దర్శకుడు విక్రమ్‌తో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా? విక్రమ్ డైరెక్షన్‌కి కొత్తేమో కానీ ఇండస్ట్రీకి కాదు. రైటర్‌గా ఇండస్ట్రీలో ఉన్నాడు. డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చాడు. ‘మిరపకాయ్’ సినిమా నుంచి తను నాకు బాగా పరిచయం. విక్రమ్ రచయిత అయినా ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ ఇచ్చారేం? విక్రమ్ నాకో కథ చెప్పాడు. నచ్చింది. నా కమిట్మెంట్స్ అవ్వగానే చేద్దామనుకున్నాం. ఈలోగా వక్కంతం వంశీ, బుజ్జి ‘టచ్ చేసి చూడు’ కథ చెప్పారు. బుజ్జి, విక్రమ్‌కి మంచి సాన్నిహిత్యం ఉండటంతో తన డైరెక్షన్లో ఈ సినిమా చేశాం. నిర్మాతలు బుజ్జి, వంశీ, నా కాంబినేషన్లో ఎప్పుడో సినిమా రావాల్సింది. కొన్ని కారణాల వల్ల లేటైంది. అయినా ఈ టైమింగ్ బాగుంది. గతంలో ప్రయోగాత్మక పాత్రలు చేశారు. ఇప్పుడు ఎంటర్టైనింగ్ పాత్రలే చేస్తున్నారే? కొత్త తరహా ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటే పోతున్నాయి మరి. కమర్షియల్‌గా ఆడలేదు. ‘నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, ఈ అబ్బాయి చాలా మంచోడు, నేనింతే’ ఎంత మంచి సినిమాలు. సరిగ్గా ఆడలేదు. నా తొలి ప్రాధాన్యత ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే. ఇక ప్రయోగాత్మక పాత్రలకు ఫుల్స్టాప్ పెట్టినట్లేనా? అలా ఏం లేదు. కచ్చితంగా చేస్తాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనా తీరు మారింది. ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే బ్రహ్మాండంగా ఆడేదేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ టైప్ కొన్ని కథలు విన్నాను. చేస్తా. తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ పెరగడంపై మీ ఫీలింగ్? హ్యాపీ. థ్యాంక్స్ టు రాజమౌళి. ‘రాజా ది గ్రేట్’ ప్రమోషన్‌కి డార్జిలింగ్ వెళ్లినప్పుడు అక్కడి వారి స్పందన చూసి, ఫుల్ హ్యాపీ. ఆ మధ్య పూరీ జగన్నాథ్‌తో సినిమా అని వార్తలొచ్చాయే? జగన్‌తో సినిమా ఉంటుంది. అయితే ఈ ఏడాది కాదు. మల్టీస్టారర్ సినిమాలు చేసే ఆలోచన ఉందా? ఎవరితో చేయడానికైనా రెడీ. అది రచయితలు, దర్శకులు ఆలోచించాలి. ఇండస్ట్రీలో అందరు హీరోలూ నాకు ఫ్రెండ్సే. నటుడిగా సంతృప్తి చెందారా? దర్శకత్వం ఎప్పుడు చేస్తారు? ప్రస్తుతం నటుడిగా నా పనిని ఎంజాయ్ చేస్తున్నా. కానీ, కచ్చితంగా దర్శకత్వం చేస్తాను. అది ఎప్పుడో తెలియదు. అయితే ఆ సినిమాలో మాత్రం నేను నటించను. కథ ఎంపిక చేసుకునే విధానంలో ఏమైనా మార్పులొచ్చాయా? గతంలో స్మాల్ నెగ్లిజెన్స్ ఉండేది. ఇప్పుడు అన్నీ ప్రాపర్‌గా చూసి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నా. నా పాత్ర కంటే కథకే నేను ఇంపార్టెన్స్ ఇస్తా. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్ నిర్మించారు కదా? అవును. అనిల్ అని నా జిమ్ మేట్. సరదాగా ఓ ఐడియా చెప్పాడు. ఆ ఏజ్‌లో తన ఆలోచన నాకు నచ్చింది. అందుకే చేశా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అబ్బాయి మహాధన్‌ని ఎప్పుడు హీరోని చేస్తున్నారు? వాడి వయసు ఇప్పుడు పదేళ్లే. హీరోని చేయడానికి చాలా టైమ్ ఉంది. మీ తర్వాతి ప్రాజెక్టులు ఏంటి? కల్యాణ్‌కృష్ణతో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత శ్రీనువైట్ల సినిమా ఉంటుంది. శ్రీనువైట్ల కథ నచ్చి సినిమా చేస్తున్నారా? లేకుంటే బ్యాకప్ ఇవ్వాలనా? ఎవరూ ఎవరికీ బ్యాకప్ ఇవ్వరు. కథ నచ్చింది. హిట్టా? ఫ్లాపా? అన్నది తర్వాతి విషయం. -
అందరికీ వయసు పెరుగుతుంది కానీ రవితేజకు మాత్రం తగ్గుతోంది – వినాయక్
‘‘అందరికీ సినిమా సినిమాకు వయసు పెరుగుద్ది కానీ రవితేజకి మాత్రం తగ్గుతోంది. ‘విక్రమార్కుడు’ సినిమా చూసి ఎలా ఫీల్ అయ్యామో ‘టచ్ చేసి చూడు’ చూసి కూడా అలానే ఫీల్ అవుతాం’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మోహన్ నిర్మించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నాకు స్పెషల్. కారణం నిర్మాతలు బుజ్జి, వంశీ మోహన్‌గారు. దర్శకుడు విక్కీ (విక్రమ్) నాతో కలిసి పని చేశాడు. రెండు రీళ్లు చూశాను. చాలా బాగా తెరకెక్కించాడు’’ అన్నారు. ‘‘మా టెక్నీషియన్స్ రామ్–లక్ష్మణ్, రవివర్మన్, వెంకట్ ఫైట్ మాస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కో ఫైట్ చేశారు. నా ప్రొడ్యూసర్స్ ఇద్దరూ నా ఫ్రెండ్స్. విక్రమ్ సిరికొండ నాకు ‘మిరపకాయ్’ సినిమా నుంచి తెలుసు. వక్కంతం వంశీ అందించిన కథను విక్రమ్ బాగా హ్యాంyì ల్ చేశాడు. జామ్ 8 అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు’’ అన్నారు రవితేజ. ‘‘నేను ఇండస్ట్రీలో నిలబడటానికి కారణం హీరో రవితేజగారి ‘కిక్’ సినిమానే. ‘టచ్ చేసి చూడు’ ఫుల్ కమర్షియల్‌గా ఉంటుంది’’ అన్నారు వక్కంతం వంశీ. విక్రమ్ సిరికొండ మాట్లాడు తూ – ‘‘నా సినిమా గురు వినాయక్‌గారికి థాంక్స్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం బుజ్జిగారు. నా మాస్ రాజా ఎనర్జీ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కు ఇంకో క్వాలిటీ ఉంది. అదేంటంటే ఆ ఎనర్జీని చుట్టూ ఉన్న వాళ్లకి పాస్ చేస్తారు’’ అన్నారు. ‘‘రవితేజగారితో ‘కృష్ణ’ సినిమా తీయలేకపోయాను. పది సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం దొరికింది. చక్కటి స్క్రిప్ట్, మంచి డైరెక్టర్’’ అన్నారు వంశీమోహన్. -
టచ్ చేస్తే...
‘రాజా ది గ్రేట్’ సినిమా హిట్‌తో మాంచి ఊపు మీదున్నారు రవితేజ. అదే స్పీడ్‌తో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ సినిమాని పూర్తి చేశారాయన. ఇందులో రాశీఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బుజ్జి, వంశీ మాట్లాడుతూ– ‘‘మా చిరకాల మిత్రుడు రవితేజతో ‘టచ్ చేసి చూడు’ సినిమా నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది. రవి ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పాటలకు, టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. మా చిత్రంలో రవితేజ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు. సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ వారంలో ప్రీ–రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జామ్ 8, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
‘నింగి మెరుపులా దూకుతాడు వీడు’
రాజా ది గ్రేట్ సినిమాతో ఘనవిజయం సాధించిన రవితేజ, మరోసారి తన ఎనర్జీకి తగ్గ పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టచ్ చేసి చూడు సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు రవితేజ. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రవితేజ క్యారెక్టరైజేషన్ కు సంబంధించిన ఈ పాటకు మార్క్ డి మ్యూస్ సంగీతమందించగా చంద్రబోస్ సాహిత్యమందించారు. బ్రిజేష్ శాండిల్య, శ్రీరామ్ చంద్రలు ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
పక్కా మాస్ యాక్షన్.. ‘టచ్ చేసి చూడు’
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేయటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న రవితేజ, టీజర్ లో మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు. రాజా ది గ్రేట్ తో సత్తా చాటిన రవితేజ టచ్ చేసి చూడుతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. -
ఉతికి ఆరేస్తాడు
కూల్‌గా కామ్‌గా ఉన్నవాడిని అనవరంగా కదిలిస్తేనే ఏదో రకంగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అలాంటిది బలుపు, పవర్ ఉన్న మాస్ అబ్బాయిని కెలికితే ఊరుకుంటాడా? దమ్ము చూపించి, వాళ్ల దుమ్మ దులిపి ఉతికారేస్తాడు. మరి.. మా హీరో ఉతుకుడు ఏ రేంజ్లో ఉందో చూడాలంటే మా సినిమా వచ్చేంతవరకు ఆగాల్సిందే అంటున్నారు ‘టచ్ చేసి చూడు’ చిత్ర బృందం. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘టచ్ చేసి చూడు’. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘రవితేజతో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రవితేజ ఇమేజ్ తగ్గట్లుగా రచయిత వక్కంతం వంశీ సూపర్ కథను అందించారు. షూటింగ్ కంప్లీటైంది. ప్రజెంట్ రీ–రికార్డింగ్ వర్క్ జరుగుతుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం : ప్రీతమ్ జామ్8, కెమెరా: చోటా. కె. నాయుడు. -
రవితేజకు జోడిగా కొత్తమ్మాయి
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు షూటింగ్ పూర్తి చేసిన ఈ సీనియర్ హీరో త్వరలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించనున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ సరసన కొత్తమ్మాయిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. జనవరి 5న షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం మాళవిక శర్మను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ముందుగా హీరోయిన్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని భావించినా.. రవితేజ, రకుల్ కాంబినేషన్ లో వచ్చిన కిక్ 2 ఫ్లాప్ కావటంతో వేరే హీరోయిన్ కోసం ప్రయత్నించారు. యాడ్ ఫిలింస్ తో ఆకట్టుకున్న మాళవిక శర్మ, హిమాలయ గర్ల్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రవితేజ సరసన నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. -
పుట్టిన రోజు కానుకగా ‘టచ్ చేసి చూడు’
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సీనియర్ హీరో రవితేజ, తన తదుపరి చిత్ర పనుల్లో బిజీ అయ్యాడు. రాజా ది గ్రేట్ తో పాటు షూటింగ్ ప్రారంభించిన టచ్ చేసి చూడు సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈసినిమాను రవితేజ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కావటంతో ఒక్క రోజు ముందు జనవరి 25న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినా.. వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. -
టచ్‌లోనే ఉన్నారు
ఎవరితో? ‘టచ్ చేసి చూడు’ దర్శక–నిర్మాతలతో! ఆల్మోస్ట్ రెండేళ్లవుతోంది రవితేజ సినిమా వచ్చి! ‘బెంగాల్ టైగర్’ తర్వాత కొన్నాళ్లు సరైన కథల కోసం వెయిట్ చేసిన రవితేజ ఇంచుమించు సేమ్ టైమ్‌లో రెండు సిన్మాలు స్టార్ట్ చేశారు. ఒకటి... అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా.. ది గ్రేట్’. ఇంకొకటి... రచయిత విక్రమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రారంభించిన ‘టచ్ చేసి చూడు’. రీసెంట్గా ఏదొక వార్తతో ఒక సిన్మా టచ్‌లోనే ఉంటోంది. ఇంకొక సిన్మా గురించి ఏ వార్తా వినిపించడం లేదు. ఈలోపు కొందరు ఏవేవో గాసిప్పులు పుట్టించేశారు. ‘టచ్ చేసి చూడు’ ఆగిందన్నది వాటి సారాంశం. అసలు మేటర్ ఏంటంటే... ‘రాజా.. ది గ్రేట్’లో రవితేజ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ‘టచ్ చేసి చూడు’ను సేమ్ లుక్‌తో చేయడం రవితేజకు ఇష్టం లేదట. అందులో చిన్నపాటి గడ్డంతో కొన్ని, క్లీన్ షేవ్‌తో మరికొన్ని సీన్లలోనూ కనిపించనున్నారట. న్యూ లుక్‌లోకి మారే ముందు ఇప్పుడున్న లుక్‌లో సిన్మా కంప్లీట్ చేయాలనుకున్నారట. ‘‘రవితేజ ‘టచ్ చేసి చూడు’ టీమ్‌తో 100% టచ్‌లో ఉన్నారు. ప్యారలల్‌గా రెండు సిన్మాల షూటింగులు చేయాలంటే... గెటప్ ఇష్యూ వస్తుందని ‘టచ్ చేసి చూడు’కి చిన్న బ్రేక్ ఇచ్చారు. ‘రాజా ది గ్రేట్’ పూరై్తన తర్వాత నాన్–స్టాప్‌గా ‘టచ్ చేసి చూడు’ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆయన క్లీన్ షేవ్‌తో మరింత హ్యాండ్సమ్గా కనిపించే సీన్లను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు’’ అని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘టచ్ చేసి చూడు’ను లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు.