రవితేజ
‘‘నేను చాలా సినిమాల్లో పోలీస్‌గా చేశా. అయితే అవి సీరియస్‌తో కూడుకున్నవి. ‘టచ్ చేసి చూడు ’లో కొంచెం సీరియస్.. ఎక్కువగా ఫన్ ఉంటుంది. ఇటు కుటుంబం.. అటు ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడన్నదే కథ’’ అని రవితేజ అన్నారు. ఆయన హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానున్న సందర్భంగా రవితేజ పలు విశేషాలు పంచుకున్నారు.
‘టచ్ చేసి చూడు’ అంటున్నారు. టచ్ చేస్తే షాక్ కొడుతుందా?
టచ్ చేస్తే ఏమవుతుందా? అని నేనూ ఎదురు చూస్తున్నా. ఎంత షాక్ కొడుతుంది? అన్నది రెండో తారీఖు తెలిసిపోతుంది.
కొత్త దర్శకుడు విక్రమ్‌తో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
విక్రమ్ డైరెక్షన్‌కి కొత్తేమో కానీ ఇండస్ట్రీకి కాదు. రైటర్‌గా ఇండస్ట్రీలో ఉన్నాడు. డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చాడు. ‘మిరపకాయ్’ సినిమా నుంచి తను నాకు బాగా పరిచయం.
విక్రమ్ రచయిత అయినా ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ ఇచ్చారేం?
విక్రమ్ నాకో కథ చెప్పాడు. నచ్చింది. నా కమిట్‌మెంట్స్ అవ్వగానే చేద్దామనుకున్నాం. ఈలోగా వక్కంతం వంశీ, బుజ్జి ‘టచ్ చేసి చూడు’ కథ చెప్పారు. బుజ్జి, విక్రమ్‌కి మంచి సాన్నిహిత్యం ఉండటంతో తన డైరెక్షన్‌లో ఈ సినిమా చేశాం. నిర్మాతలు బుజ్జి, వంశీ, నా కాంబినేషన్‌లో ఎప్పుడో సినిమా రావాల్సింది. కొన్ని కారణాల వల్ల లేటైంది. అయినా ఈ టైమింగ్ బాగుంది.
గతంలో ప్రయోగాత్మక పాత్రలు చేశారు. ఇప్పుడు ఎంటర్‌టైనింగ్ పాత్రలే చేస్తున్నారే?
కొత్త తరహా ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటే పోతున్నాయి మరి. కమర్షియల్‌గా ఆడలేదు. ‘నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, ఈ అబ్బాయి చాలా మంచోడు, నేనింతే’ ఎంత మంచి సినిమాలు. సరిగ్గా ఆడలేదు. నా తొలి ప్రాధాన్యత ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే.
ఇక ప్రయోగాత్మక పాత్రలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లేనా?
అలా ఏం లేదు. కచ్చితంగా చేస్తాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనా తీరు మారింది. ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే బ్రహ్మాండంగా ఆడేదేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ టైప్ కొన్ని కథలు విన్నాను. చేస్తా.
తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ పెరగడంపై మీ ఫీలింగ్?
హ్యాపీ. థ్యాంక్స్ టు రాజమౌళి. ‘రాజా ది గ్రేట్’ ప్రమోషన్‌కి డార్జిలింగ్ వెళ్లినప్పుడు అక్కడి వారి స్పందన చూసి, ఫుల్ హ్యాపీ.
ఆ మధ్య పూరీ జగన్నాథ్‌తో సినిమా అని వార్తలొచ్చాయే?
జగన్‌తో సినిమా ఉంటుంది. అయితే ఈ ఏడాది కాదు.
మల్టీస్టారర్ సినిమాలు చేసే ఆలోచన ఉందా?
ఎవరితో చేయడానికైనా రెడీ. అది రచయితలు, దర్శకులు ఆలోచించాలి. ఇండస్ట్రీలో అందరు హీరోలూ నాకు ఫ్రెండ్సే.
నటుడిగా సంతృప్తి చెందారా? దర్శకత్వం ఎప్పుడు చేస్తారు?
ప్రస్తుతం నటుడిగా నా పనిని ఎంజాయ్ చేస్తున్నా. కానీ, కచ్చితంగా దర్శకత్వం చేస్తాను. అది ఎప్పుడో తెలియదు. అయితే ఆ సినిమాలో మాత్రం నేను నటించను.
కథ ఎంపిక చేసుకునే విధానంలో ఏమైనా మార్పులొచ్చాయా?
గతంలో స్మాల్ నెగ్లిజెన్స్ ఉండేది. ఇప్పుడు అన్నీ ప్రాపర్‌గా చూసి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నా. నా పాత్ర కంటే కథకే నేను ఇంపార్టెన్స్ ఇస్తా.
ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్ నిర్మించారు కదా?
అవును. అనిల్ అని నా జిమ్ మేట్. సరదాగా ఓ ఐడియా చెప్పాడు. ఆ ఏజ్‌లో తన ఆలోచన నాకు నచ్చింది. అందుకే చేశా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీ అబ్బాయి మహాధన్‌ని ఎప్పుడు హీరోని చేస్తున్నారు?
వాడి వయసు ఇప్పుడు పదేళ్లే. హీరోని చేయడానికి చాలా టైమ్ ఉంది.
మీ తర్వాతి ప్రాజెక్టులు ఏంటి?
కల్యాణ్‌కృష్ణతో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత శ్రీనువైట్ల సినిమా ఉంటుంది.
శ్రీనువైట్ల కథ నచ్చి సినిమా చేస్తున్నారా? లేకుంటే బ్యాకప్ ఇవ్వాలనా?
ఎవరూ ఎవరికీ బ్యాకప్ ఇవ్వరు. కథ నచ్చింది. హిట్టా? ఫ్లాపా? అన్నది తర్వాతి విషయం.
Comments
Please login to add a commentAdd a comment