పుట్టిన రోజు కానుకగా ‘టచ్ చేసి చూడు’ | Ravi teja new movie in january | Sakshi
Sakshi News home page

Dec 22 2017 4:18 PM | Updated on Dec 22 2017 4:22 PM

Ravi teja new movie in january - Sakshi

రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సీనియర్ హీరో రవితేజ, తన తదుపరి చిత్ర పనుల్లో బిజీ అయ్యాడు. రాజా ది గ్రేట్ తో పాటు షూటింగ్ ప్రారంభించిన టచ్ చేసి చూడు సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈసినిమాను రవితేజ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కావటంతో ఒక్క రోజు ముందు జనవరి 25న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినా.. వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement