Vikram Sirikonda
-
‘టచ్ చేసి చూడు’ మూవీ రివ్యూ
టైటిల్ : టచ్ చేసి చూడు జానర్ : మాస్ యాక్షన్ తారాగణం : రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్, మురళీ శర్మ, జయప్రకాష్, ఫ్రెడ్డీ దారువాలా సంగీతం : జామ్ 8 నేపథ్య సంగీతం : మణిశర్మ దర్శకత్వం : విక్రమ్ సిరికొండ నిర్మాత : వల్లభనేని వంశీమోహన్, నల్లమలుపు బుజ్జి రాజా ది గ్రేట్ సినిమాతో ఘనవిజయం సాధించిన రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ ఎంటర్టైనర్ టచ్ చేసి చూడు. రవితేజ మార్క్ మాస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ మరోసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథతో విక్రమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన టచ్ చేసి చూడు, రవితేజ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసిందా..? తొలి విక్రమ్ సిరికొండ ఆకట్టుకున్నాడా..? కథ : కార్తీకేయ(రవితేజ) ఆవేశపరుడైన పోలీస్ ఆఫీసర్. అసిస్టెంట్ కమిషనర్‌గా డ్యూటీ చేస్తున్న సమయంలో ఓ కేసులో ఆవేశంగా ఓ నిందితుడి మరణానికి కారణమై సస్పెండ్ అవుతాడు. తరువాత పాండిచ్చేరిలో కార్తీకేయ ఇండస్ట్రీస్ అనే కంపెనీ నిర్వహిస్తూ హ్యాపిగా ఉంటాడు. తల్లి, తండ్రి, బామ్మ, ఇద్దరు చెల్లెల్లు ఇదే కార్తీకేయ ప్రపంచం. (సాక్షి రివ్యూస్) తన వ్యాపారానికి అక్కడి లోకల్ లీడర్ సెల్వం అడ్డు వస్తున్నా.. గొడవలెందుకులే అని తానే సర్దుకుపోతుంటాడు. ఒక రోజు పార్టీలో కార్తీకేయ చెల్లెలు విద్యార్థి నాయకుడు సత్యను కొంత మంది వ్యక్తులు హత్య చేయటం చూస్తుంది. అమ్మానాన్నలు వద్దంటున్నా చెల్లెలితో సాక్ష్యం చెప్పించేందుకు సిద్ధమవుతాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కార్తీకేయ చెల్లెలు చెప్పిన ఇర్ఫాన్ లాలా(ఫ్రెడ్డీ దారువాలా) నాలుగేళ్ల క్రితం కార్తికేయ చంపిన వ్యక్తే అని తెలుస్తుంది. బతికున్న వ్యక్తిని చనిపోయినట్టుగా కార్తికేయను ఎందుకు నమ్మించారు..? కార్తికేయకు ఇర్ఫాన్‌కు గొడవేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : రవితేజకు తనకు అలావాటైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో రవితేజ చేసిన తరహా రొటిన్ సీన్స్ లో కనిపించటంతో కొత్తదనమేమీ కనిపించదు. హీరోయిన్స్ కేవలం కథను సాగదీసేందుకే తప్ప ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ లో కనిపించారు. (సాక్షి రివ్యూస్)ఉన్నంతలో రాశీఖన్నా కాస్త పరవాలేదనిపించింది. సీరత్‌కపూర్ గ్లామర్ షోతో మెప్పించినా.. నటిగా ఆకట్టుకోలేకపోయింది. తండ్రి పాత్రలో జయప్రకాష్, పోలీస్ ఆఫీసర్‌గా మురళీ శర్మ, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్‌లు ఇప్పటికే చాలా సినిమాల్లో కనిపించిన అదే తరహా పాత్రల్లో కనిపించారు. విలన్‌గా నటించిన ఫ్రెడ్డీ దారువాలా లుక్స్‌పరంగా ఆకట్టుకున్నా.. పెద్దగా తెరపైన కనిపించలేదు. బలమైన సన్నివేశాలు కూడా లేకపోవటంతో విలనిజం పెద్దగా ఎలివేట్ కాలేదు. విశ్లేషణ : రవితేజ లాంటి మాస్ హీరోతో రొటీన్ సినిమా అయితే కరెక్ట్ అన్న నమ్మకంతో విక్రమ్ సిరికొండ మూస కథను ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది. వక్కంతం వంశీ లాంటి స్టార్ రైటర్ అందించిన కథ అయిన ఎక్కడ కొత్త దనం కనిపించలేదు. ఎమోషనల్ యాక్షన్స్ సీన్స్ ను మరింత బలంగా రాసుకునే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా రొమాంటిక్ కామెడీ సీన్స్ మీద దృష్టి పెట్టాడు. తొలి భాగం అంతా అసలు కథలోకి వెల్లకుండా కేవలం రవితేజ, రాశీఖన్నా మధ్య సన్నివేశాలతో సాగదీశాడు. (సాక్షి రివ్యూస్)అవి కూడా ఆకట్టుకునే స్థాయిలో లేకపోవటం నిరాశపరుస్తుంది. ద్వితియార్థం కాస్త ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టినా..అదే ఊపు కొనసాగించలేకపోయాడు. ప్రతినాయక పాత్రను బలంగా రూపుదిద్దటంలోను దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. జామ్ 8 గ్రూప్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు.తన నేపథ్య సంగీతంతో మణిశర్మ సినిమాను కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిటోగ్రఫి,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రవితేజ ఎనర్జీ మణిశర్మ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ కథా కథనం పాటలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘టచ్ చేసి చూడు’ న్యూ వర్కింగ్ స్టిల్స్
-
‘నింగి మెరుపులా దూకుతాడు వీడు’
రాజా ది గ్రేట్ సినిమాతో ఘనవిజయం సాధించిన రవితేజ, మరోసారి తన ఎనర్జీకి తగ్గ పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టచ్ చేసి చూడు సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు రవితేజ. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రవితేజ క్యారెక్టరైజేషన్ కు సంబంధించిన ఈ పాటకు మార్క్ డి మ్యూస్ సంగీతమందించగా చంద్రబోస్ సాహిత్యమందించారు. బ్రిజేష్ శాండిల్య, శ్రీరామ్ చంద్రలు ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రైటర్ అయినా నా డైరెక్షన్ అటువైపే
‘‘బై చాన్స్ రైటర్ అయ్యాను. నిజానికి దర్శకత్వమే ఆసక్తి. వీవీ వినాయక్‌గారు తీసిన ‘ఠాగూర్’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. డైరెక్టర్‌గా నా ఫస్ట్ సినిమా ‘టచ్ చేసి చూడు’ పట్ల ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను’’ అన్నారు విక్రమ్ సిరికొండ. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. వచ్చే నెల మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో విక్రమ్ సిరికొండ చెప్పిన విశేషాలు... ∙నిజం చెప్పే అబద్ధం సినిమా అని ఒక మహానుభావుడు అన్నారు. నా సినిమా చెప్పే నిజం బ్యాలెన్సింగ్ లైఫ్. ఒక డెడికేటెడ్ డ్యూటీ మైండెడ్ పోలీసాíఫీసర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ను బ్యాలెన్స్ చేయడం కోసం చేసే యుద్ధమే ఈ ‘టచ్ చేసి చూడు’. యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా ఉంది. రవితేజది డ్యూయెల్ రోల్ కాదు. డిఫరెంట్ టైమ్ అండ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. పోలీసాఫీసర్‌గా రవితేజ చేసిన గత సినిమాలతో పోల్చినప్పుడు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్‌గా కూడా ఉంటుంది. మోడ్రన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ నేరస్తులను ఎలా గుర్తించాడు? అనే సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ∙ఈ సినిమా కథ వక్కంతం వంశీది. నిర్మాత బుజ్జిగారు చెబితే, కథ విన్నాను. నచ్చింది. హీరో రవితేజ అని తెలిసింది. ఆల్రెడీ రవితేజతో ‘మిరపకాయ్’ సినిమా చేశా. వంశీ కథను నాకు అనుకూలంగా చేంజ్ చేసుకున్నాను. వంశీ కూడా హెల్ప్ చేశాడు. ఇందులో హీరోయిన్స్ రాశీఖన్నా, సీరత్ కపూర్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ప్రీతమ్ అండ్ జామ్ 8 మంచి సంగీతం ఇచ్చాడు. రీ–రికార్డింగ్ మణిశర్మగారు చేస్తున్నారు. ∙మాది హైదరాబాద్. బెంగళూరులో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఫిల్మ్ కోర్స్ ఢిల్లీలో చేశాను. ∙ఠాగూర్, సాంబ, బన్నీ చిత్రాలకు డైరెక్షన్ విభాగంలో వర్క్ చేశాను. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో రైటర్‌గా మారా. -
ఫిబ్రవరి 2న ‘టచ్ చేసి చూడు’
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో సినిమా వాయిదా పడింది. తరువాత రవితేజ పుట్టిన రోజు కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తారని భావించినా.. హడావిడి అవుతుందన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రాజా ది గ్రేట్ తో సత్తా చాటిన రవితేజ టచ్ చేసి చూడుతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. -
పుట్టిన రోజు కానుకగా ‘టచ్ చేసి చూడు’
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సీనియర్ హీరో రవితేజ, తన తదుపరి చిత్ర పనుల్లో బిజీ అయ్యాడు. రాజా ది గ్రేట్ తో పాటు షూటింగ్ ప్రారంభించిన టచ్ చేసి చూడు సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈసినిమాను రవితేజ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కావటంతో ఒక్క రోజు ముందు జనవరి 25న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినా.. వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. -
420 రోజుల తర్వాత స్టార్ట్ చేశాడు!
సరిగ్గా 420 రోజులు... ‘బెంగాల్ టైగర్’ విడుదలై నిన్నటికి 420 రోజులు! ఆ సినిమా విడుదల తర్వాత ఏడాదికి పైగా విరామం తీసుకున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టారు. సీన్ పేపర్ టచ్ చేశారు. తర్వాత డైలాగ్ చెప్పారు. మొత్తానికి షూటింగ్ స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండని దర్శకునిగా పరిచయం చేస్తూ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ క్లాప్ ఇవ్వగా, ఎడిటర్ గౌతంరాజు కెమేరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘శుక్రవారం చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్‌లో వారం రోజులకు పైగా షూటింగ్ చేసి, తర్వాత పాండిచ్చేరి వెళతాం. అక్కడ 25 రోజులు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టు వక్కంతం వంశీ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ కథ తయారుచేశారు’’ అన్నారు. రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, మాటలు: శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు, ఆర్ట్: రమణ వంక, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎం. సుకుమార్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: జామ్8. -
'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ
-
'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ
మాస్ మహరాజ్ రవితేజ సినిమా కోసం అభిమానులు సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో డీసెంట్ హిట్ సాధించిన రవితేజ, ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న తరుణంలో ఆగిపోవటంతో కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్‌లో వరల్డ్ టూర్ కు వెళ్లొచ్చిన మాస్ హీరో.. ఫైనల్‌గా కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఇన్నాళ్లు రూమర్స్ గానే ఉన్న వార్తలపై క్లారిటీ ఇస్తూ కొత్త సినిమా పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. టచ్ చేసి చూడు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు విక్రమ్ సిరకొండ దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో రవితేజకు శుభాకాంక్షలు తెలపటంతో పాటు ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.